అన్వేషించండి

PM Modi Telangana Tour: ఏప్రిల్‌లో తెలంగాణకు రానున్న ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు

PM Modi Hyderabad Visit | ఏప్రిల్‌లో ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రానున్నారు. రాష్ట్రంలో కేంద్రం చేపట్టిన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారని సమాచారం.

హైదరాబాద్:  భారత ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ మొదటి వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పలు కీలక అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు, మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా నగరంలో నిర్వహించే ఒక భారీ బహిరంగ సభకు ఆయన హాజరవుతారు. అక్కడి నుంచే వర్చువల్ విధానంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వివిధ అభివృద్ధి పనులకు ఆయన శ్రీకారం చుడతారని సమాచారం. లోక్‌సభ ఎన్నికల అనంతరం ప్రధాని మోదీ తెలంగాణకు రావడం ఇదే తొలిసారి కావడంతో, ఈ పర్యటనపై రాజకీయంగానూ ప్రాధాన్యత సంతరించుకుంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 8 స్థానాల్లో విజయం సాధించి సత్తా చాటింది.

పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని

ఈ పర్యటనలో భాగంగా వరంగల్‌లోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బీబీనగర్ ఎయిమ్స్ (AIIMS)లో కొత్తగా నిర్మించిన పలు బ్లాకులు, అలాగే పూర్తయిన జాతీయ రహదారులను ప్రధాని ప్రారంభించనున్నారు. వీటితో పాటు, హైదరాబాద్ నుండి యాదాద్రి వరకు ప్రతిపాదించిన ఎంఎంటీఎస్ (MMTS) రెండో దశ రైల్వే ప్రాజెక్టుకు, ప్రాంతీయ వలయ రహదారి (RRR) ఉత్తర భాగానికి ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టులు రాష్ట్ర రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయని భావిస్తున్నారు.

మోదీకి స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు సన్నద్ధం

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై పార్టీ పరంగా సమాచారం రావడంతో ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. సికింద్రాబాద్‌లోని క్లాసిక్ గార్డెన్‌లో శనివారం జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఈ విషయంపై ప్రాథమికంగా చర్చించారు. ప్రధాని మోదీ అధికారిక పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్, కార్యక్రమాల టైమింగ్స్‌పై కేంద్ర ప్రభుత్వం నుండి త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ కార్పొరేషన్, మల్కాజిగిరి కార్పొరేషన్లకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ కీలక సమయంలో ప్రధాని మోదీ రాష్ట్రానికి రానుండటంతో తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Jubilee Hills CI Suspension: ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను వీడియోలతో బ్లాక్ మెయిల్! జూబ్లీహిల్స్ సీఐపై సస్పెన్షన్‌ వేటు
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
Telangana Family Register: ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?
ఇక తెలంగాణలో సులభంగా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ - SIRకి ఉపయోగం - ఓవైసీ కోరినందుకేనా?

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget