Family Suicide Attempt: మెదక్ కోర్డు బిల్డింగ్ మీద నుంచి దూకిన ఫ్యామిలీ- భార్య మృతి, భర్త, పిల్లలకు తీవ్ర గాయాలు
One dies after Family suicide | విచారణకు హాజరైన భార్యాభర్తలు గొడవపడి, తమ పిల్లలతో కలిసి మెదక్ కోర్టు బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకారు. ఒకరు చనిపోగా, ముగ్గురికి గాయాలయ్యాయి.

Family Suicide Attempt At Medak Court | మెదక్: ఓ కుటుంబం కోర్టు బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన మెదక్ జిల్లాలో కలకలం రేపింది. కేసు విచారణలో భాగంగా శనివారం నాడు భార్యాభర్తలు తమ ఇద్దరు పిల్లలతో కలిసి కోర్టుకు హాజరయ్యారు. ఈ క్రమంలో శనివారం రాత్రి దంపతులు తమ ఇద్దరు కుమార్తెలతో సహా కోర్టు భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నం యత్నించారు.
ఈ ఘటనలో భార్య మృతి చెందగా, భర్తతో పాటు ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. తీవ్ర రక్తస్రావమైన ఆ ముగ్గురినీ చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిని దౌల్తాబాద్ గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. గత కొంతకాలం నుంచి భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి. కేసు విచారణ లో భాగంగా కోర్టుకు వచ్చిన దంపతులు గొడవపడి, క్షణికావేశంలో తమ కుమార్తెలతో కలిసి కోర్టు భవనం పైనుంచి దూకారనీ పోలీసులు తెలిపారు.






















