Hyderabad News: డిసెంబర్ 31 నైట్ హైదరాబాద్‌లోని ఆ రూట్స్‌లో అసలు వెళ్లొద్దు!
Hyderabad News: నూతన వేడుకల సందర్భంగా హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్డులతో పాటు ఫ్లైఓవర్లు మూసి వేసే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.
Hyderabad News: కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత నూతన సంవత్సర వేడుకలు పూర్తి స్థాయిలో జరగనున్నాయి. భాగ్యనగర వాసులంతా న్యూ ఇయర్ వేడుకల కోసం తెగ రెడీ అవుతున్నారు. ఈసారి వేడుకలు వారాంతపు రోజైన శనివారం రావడంతో మరింత జోష్ ఏర్పడింది. ఈ క్రమంలోనే ఈనెల 31వ తేదీ రాత్రి నుంచి జనవరి 1వ తేదీన తెల్లవారుజాము వరకు నెక్లెస్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే, ఔటర్ రింగ్ రోడ్డులతోపాటు ఫ్లైఓవర్లు మూసి వేసే అవకాశం ఉందని ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు విమాన టికెట్, సరైన ధ్రువీకరణ పత్రాలు చూపిస్తేనే ఆయా రోడ్లలో అనుమతి ఇస్తారని పేర్కొంది. మద్యం మత్తులో వాహనాలు నడిపినా, ర్యాష్ డ్రైవింగ్, బైక్ లపై విన్యాసాలు చేసినా, మైనర్లు డ్రైవింగ్ చేసినా కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరు పరుస్తారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే రూ.10 వేలు జరిమానా లేదా ఆరు నెలల జైలు శిక్ష విధిస్తారు. డ్రైవింగ్ లైసెన్సులు మూడు నెలలు లేదా శాశ్వతంగా రద్దు చేస్తారని ట్రాఫిక్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
1000 రూపాయలకు దగ్గర్లోనే ఈవెంట్లు..
నగరాసుల నుంచి స్పందన ఎలా ఉంటుందో అనే భావనతో చాలా వరకు న్యూ ఇయర్ ఈవెంట్లకు ధరలను కొంత వరకు అందుబాటులోనే నిర్ణయించారు. సూపర్ సోనిక్ టేకోవర్ పేరుతో నోవాటెల్ నిర్వహిస్తున్న ఈవెంట్ కి రూ.999 ఆపై ధరలోనే ఎంట్రీ ఫీజు నిర్ణయించగా.. తాజ్ డెక్కన్ ఎ నైట్ ఇన్ ప్యారిస్ థీమ్ ఈవెంట్ కు బుకింగ్ ధర రూ.1200తో ప్రారంభించింది. పార్కు హైదరాబాద్ లో న్యూ ఇయర్ పార్టీకి రూ.2,499 ధర నిర్ణయించారు. పార్టీలకు కేరాఫ్ లాంటి ప్రిజ్మ్ క్లబ్ అండ్ కిచెన్ లోకి ద్రి ప్రిజ్మ్ సర్కస్ ఈవెంట్ కు రూ.4 వేల నుంచి ధర నిర్ణయించారు. ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్న చాలా ఈవెంట్లకు రూ.1000కి సమీపంలోనే ఉన్నాయి. నోవాటెల్ లో ఆర్టిస్ట్ ఎన్ కెషిఫ్ట్ పేరొందిన లైవ్ బ్యాండ్ తో కలిసి నిర్వహిస్తున్నారు.
గచ్చిబౌలి స్టేడియంలోనే నో పాజ్ పారీట్ల డిజెషాన్, ఆర్యన్ గాలా, రికాయాలు పాల్గొంటున్నారు. ఓం కన్వెక్షన్ దర్నన్ రావల్ తో వేడుక ఏర్పాటు చేస్తున్నారు. ప్రముఖ తెలుగు పాప్ సినీ గాయకుడు రామ్ మిరియాల హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో థండర్ స్టైక్ పార్క్ పాటలతో అలరించనున్నారు. కంట్రీ క్లబ్ లో నిర్వహిస్తున్న ఈవెంట్ లో డిజె ఆసిఫ్ ఇక్బాల్, గాయని అలీషా చినాయ్, అభిజిత్ సావంత్, బాంబే వైకింగ్స్, సినీతార స్నేహగుప్తా తదితరులు పాల్గొంటున్నారు. గచ్చిబౌలిలోని షెరటాన్ హోటల్ మస్కిరాడె మిస్టరీ పార్టీ, ఏషియన్ ఫీస్టా థీమ్ పార్టీని నిర్వహిస్తోంది. డిజె షరాన్, అమీర్ లు అతిథులను ఉత్సాహ పరుచుకున్నారు. కొన్నేళ్లుగా నగరంలో అతిపెద్ద పార్టీ ఈవెంట్ గా పేరొందిన సన్ బర్న్ తిరిగొచ్చింది. సన్ బర్న్ రీలోడ్ ఈవెంట్ నగర శివార్లలో వండర్ లా అమ్యూజ్ మెంట్ పార్కులో శనివారం రాత్రి 8.30 గంటల నుంచి నిర్వహిస్తున్నామని.. ఇందులో ఇటాలియన్ సెన్సేషన్ జియాన్ నోబిలీ, డైనమిక్ డీజే ఈడీఎం సంగీతానికి పేరొందిన జెఫిర్టోన్-టీ-మ్యాటర్స్ తో పాటుగా డీజే వివాన్ లు అతిథుల్ని అలరిస్తారని నిర్వాహకులు వివరించారు.