New Year 2024 Celebrations: న్యూ ఇయర్ పార్టీల్లో పాల్గొంటున్నారా? పోలీసుల వార్నింగ్, ఈ రూల్స్ పాటించాల్సిందే
Hyderabad News: డీజే సౌండ్‌లు 45 డెసిబుల్స్ శబ్దం కంటే ఎక్కువ శబ్ధం ఉండొద్దని పోలీసులు అన్నారు. ఈవెంట్లలో కెపాసిటీ మించి పాసులు ఇవ్వొద్దని ఆదేశించారు.
Hyderabad New Year Celebrations 2024: హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలకు రాత్రి ఒంటి గంటలోపు ముగించాలని నగర పోలీసులు తేల్చి చెప్పారు. కొత్త సంవత్సర వేడుక కోసం ఈవెంట్‌లు నిర్వహించే నిర్వహకులు పది రోజుల ముందుగానే పోలీసుల పర్మిషన్ తీసుకోవాలని సూచించారు. లేదంటే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి ఈవెంట్ లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని నిర్దేశించారు. అలాగే ఆ ఈవెంట్స్ లో సెక్యూరిటీని తప్పనిసరిగా నియమించుకోవాలని చెప్పారు.
అలాగే అశ్లీల నృత్యాలకు అనుమతి లేదని చెప్పారు. డీజే సౌండ్‌లు 45 డెసిబుల్స్ శబ్దం కంటే ఎక్కువ శబ్ధం ఉండొద్దని అన్నారు. ఈవెంట్లలో కెపాసిటీ మించి పాసులు ఇవ్వొద్దని ఆదేశించారు. అలాగే వేడుకలకు హాజరయ్యే చోట పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని.. సాధారణ పౌరులకు ట్రాఫిక్ సమస్య కల్పించొద్దని సూచించారు. లిక్కర్ ఈవెంట్స్ లో మైనర్లకు అనుమతి లేదని.. న్యూఇయర్ వేడుకల్లో డ్రగ్స్ వాడితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. సమయానికి మించి లిక్కర్ సరఫరా చేసినా కఠిన చర్యలు ఉంటాయని చెప్పారు.
తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
ఈవెంట్లలో పాల్గొని ఫూటుగా తాగి వాహనాలు నడుపుతూ (డ్రంక్ అండ్ డ్రైవ్) లో పట్టు పడితే పది వేల రూపాయల జరిమానాలతో పాటు ఆరు నెలల జైలు శిక్ష ఉంటుందని పోలీసులు హెచ్చరించారు. అవసరమైతే డ్రైవింగ్ లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు.