News
News
X

Naveen Murder Case: నవీన్ హత్య జరిగిన రోజు పొద్దున నుంచి రాత్రి వరకు జరిగిందిదే..!

Naveen Murder Case: నవీన్ ను హత్య చేసిన రోజు పొద్దున నుంచి రాత్రి వరకు ఏం జరిగిందో హరిహరకృష్ణ మొత్తం చెప్పేశాడు. అతడిని ఎలా హత్య చేసింది, ఆపై ఏం చేసింది అంతా వివరించాడు. 

FOLLOW US: 
Share:

Naveen Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నవీన్ హత్య కేసు విషయంలో ఆరోజు ఏం జరిగిందనే దానిపై పూర్తి వివరాలను తెలిపాడు హరిహరకృష్ణ. అలాగే ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితులతో ఏ విధంగా ప్రవర్తించాడు.. ఆరోజంతా నవీన్ తో కలిసి ఎక్కడెక్కడ తిరిగాడు, ఏం చేశాడు వంటి విషయాల గురించి పోలీసులు తెలిపారు. తనను నమ్మి తనతో వచ్చిన స్నేహితుడినే ఏ విధంగా మట్టుబెట్టాడు వంటి పూర్తి వివరాలను వెల్లడించారు. ఎంత క్రూరంగా, ఎందుకు చేశాడో స్పష్టం చేశాడు. 

హత్య జరిగిన రోజు ఏం జరిగిందంటే..?

ఫిబ్రవరి 17వ తేదీ ఉదయం 9 గంటలకు హరిహరికృష్ణకు నవీన్ ఫోన్ చేసి హైదరాబాద్ కు వస్తున్నట్లు చెప్పాడు. అతడిని కలిసే లోపు హరిహర నగరంలోని మరో మిత్రుడికి ఫోన్ చేశాడు. ఉదయం 10.45 గంటలకు ఇద్దరూ కలిసి ఉప్పల్ వెళ్లారు. అక్కడ ఒక మాల్ లోని థియేటర్ లో హాలీవుడ్ సినిమా చూశారు. అదే సమయంలో అంటే మధ్యాహ్నం 1 గంటలకు నవీన్ నుంచి హరిహరకృష్ణకు ఫోన్ వచ్చింది. తాను ఎల్బీనగర్ లో ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. ఇద్దరు మిత్రులు కలిసి ఎల్బీనగర్ వెళ్లి నవీన్ ను నాగోల్ కు తీసుకువచ్చారు. రెస్టారెంట్ లో ముగ్గురు కలిసి భోజనం చేశారు. తర్వాత నవీన్ ను తీసుకొని హరిహర మూసారాంబాగ్ లోని తన సోదరి ఇంటికి చేరాడు. ఇద్దరు మాట్లాడుకుంటుండగా... హరిహర కృష్ణకు ఓ స్నేహితురాలి నుంచి ఫోన్ వచ్చింది. కొత్త ఫోన్ కొనేందుకు సహకరించమని కోరింది. దీంతో నవీన్ సాయంత్రం 5 గంటలకు చైతన్యపురిలోని మొబైల్ దుకాణానికి వెళ్లాడు. సదరు స్నేహితురాలు ఫోన్ కొనేందుకు మరింత డబ్బు కావాలని రిక్వస్ట్ చేసింది. 

దీంతో నవీన్ సాయంత్రం 5 గంటలకు చైతన్యపురిలోని మొబైల్ దుకాణానికి వెళ్లాడు. సదరు స్నేహితురాలు ఫోన్ కొనేందుకు మరికొంత డబ్బు కావాలని కోరగా.. దీంతో లోన్ యాప్ లో రూ.14 వేలు పేటీఎం పోస్ట్ పెయిడ్ లో రూ.4 వేలు అప్పు తీసుకున్నారు. మొత్తం రూ.30 వేల ఖరీదైన ఫోన్‌ ఆ స్నేహితురాలు కొనుక్కొని వెళ్లింది. ఆ తర్వాత నవీన్, హరిహరకృష్ణ ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తాను ఎంజీ వర్సిటీకి వెళ్తానని నవీన్ చెప్పాడు. ఇదే అదనుగా హరిహరకృష్ణ.. తానే అతడిని హాస్టల్ లో దింపుతానని చెప్పాడు. ఈ క్రమంలోనే ఓ కత్తి, గ్లౌజులు ఉన్న బ్యాగును వెంట తీసుకెళ్లాడు. రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరూ కలిసి ఇంటి నుంచి బయలు దేరారు. పెద్ద అంబర్ పేటలోని తిరుమల వైన్స్ కు చేరుకొని అక్కడ నవీన్ తో మద్యం తాగించాడు. రాత్రి 11.30 గంటల వేళ ఔటర్ రింగ్ రోడ్డు దాటారు. దారిలో నవీన్ ప్రేమించిన యువతితో మాట్లాడమని అతనికి ఫోన్ ఇచ్చాడు. అనంతరం సదరు యువతికి సంబంధించిన ఓ రహస్యం చెబుతానంటూ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే మిత్రుడిని గొంతు నులిమి చంపి ఆపై శరీర భాగాలను వేరు చేశాడు. 

Published at : 11 Mar 2023 10:27 AM (IST) Tags: Hyderabad News Telangana News Naveen Murder Case hari hara krishna Naveen Murder Story

సంబంధిత కథనాలు

Dial 100 Saves Life : డయల్ 100కు కాల్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి- చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్

Dial 100 Saves Life : డయల్ 100కు కాల్ చేసి, ఆత్మహత్యాయత్నం చేసిన యువతి- చాకచక్యంగా కాపాడిన కానిస్టేబుల్

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో మొత్తం 15 ప్రశ్నపత్రాలు!

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ వ్యవహారం, పెన్‌డ్రైవ్‌లో  మొత్తం 15 ప్రశ్నపత్రాలు!

TS EAMCET: టీఎస్ఎంసెట్‌ - 2023 షెడ్యూల్‌లో మార్పులు, కొత్త తేదీలివే!

TS EAMCET: టీఎస్ఎంసెట్‌ - 2023 షెడ్యూల్‌లో మార్పులు, కొత్త తేదీలివే!

Harish Rao About CPR: సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతున్నారు రియల్ హీరోలు - మంత్రి హరీష్ అభినందనలు

Harish Rao About CPR: సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతున్నారు రియల్ హీరోలు - మంత్రి హరీష్ అభినందనలు

Revanth Reddy: కేటీఆర్‌కు ఎగ్జామ్ డేటా ఎలా వెళ్లింది, ఈడీ విచారించాలని రేవంత్ డిమాండ్

Revanth Reddy: కేటీఆర్‌కు ఎగ్జామ్ డేటా ఎలా వెళ్లింది, ఈడీ విచారించాలని రేవంత్ డిమాండ్

టాప్ స్టోరీస్

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

Sukesh Letter BRS : బీఆర్ఎస్ కు రూ.75 కోట్లు ఇచ్చా, కలకలం రేపుతున్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ

CSK vs GT: చెన్నైకి షాకిచ్చిన గుజరాత్ - ఐదు వికెట్లతో ఘనవిజయం!

CSK vs GT: చెన్నైకి షాకిచ్చిన గుజరాత్ - ఐదు వికెట్లతో ఘనవిజయం!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

IPL 2023 Opening Ceremony: తెలుగు పాటలకు ఊగిపోయిన స్టేడియం - అదిరే స్టెప్పులతో అలరించిన తమన్నా, రష్మిక!

MP Nandigam Suresh : పథకం ప్రకారమే దాడి, ఆదినారాయణ రెడ్డి మనుషులే కవ్వించారు- ఎంపీ నందిగం సురేష్

MP Nandigam Suresh : పథకం ప్రకారమే దాడి, ఆదినారాయణ రెడ్డి మనుషులే కవ్వించారు- ఎంపీ నందిగం సురేష్