By: ABP Desam | Updated at : 24 Apr 2023 10:05 PM (IST)
పోలీసులపై దాడి కేసులో షర్మిలకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
Judicial remand for YS Sharmila: హైదరాబాద్ : పోలీసులపై దాడి కేసులో వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిలకు కోర్టు రిమాండ్ విధించింది. ఇరువైపుల వాదనలు విన్న నాంపల్లి కోర్టు మేజిస్ట్రేట్ షర్మిలకు 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్ విధించారు. మే 8వ తేదీ వరకు షర్మిల జ్యూడీషియల్ రిమాండ్ కొనసాగుతుంది. అంతకుముందు సోమవారం సాయంత్రం గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. విధి నిర్వహణలో ఉన్న ఇద్దరు పోలీసులపై షర్మిల చేయి చేసుకున్నారని పోలీసులు చెప్పారు. మరో పోలీస్ ను వాహనంతో ఢీకొట్టి గాయపరిచి, నిర్లక్ష్యంగా ప్రవర్తించారని మేజిస్ట్రేట్ కు వివరించారు.
అయితే ఎలాంటి పోలీస్ వారెంట్ లేకుండా తన ఇంటి మీదకి పెద్ద సంఖ్యలో పోలీసులు వచ్చారని షర్మిల వాదనలు వినిపించారు. పోలీసులు ఎలాంటి అరెస్టు నోటీసు ఇవ్వలేదన్నారు. పోలీసులు తనపై దురుసుగా ప్రవర్తించారని, తనను తాకే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఆత్మరక్షణలో భాగంగానే పోలీసులను నెట్టివేశానని కోర్టుకు షర్మిల తెలిపారు. అయితే షర్మిల రిమాండ్ పై వాదనలు ముగిశాక తీర్పు రిజర్వ్ చేసిన మేజిస్ట్రేట్ తాజాగా షర్మిలకు రెండు వారాలపాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. నేటి మధ్యాహ్నం షర్మిలను చూసేందుకు పోలీస్ స్టేషన్ కు వచ్చిన షర్మిల తల్లి విజయమ్మ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ పోలీసును చెంపదెబ్బ కొట్టారు.
పోలీసులే దురుసుగా ప్రవర్తించారు
షర్మిల తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ... TSPSC పేపర్ లీకేజ్ కేసుపై సిట్ చీఫ్ ను కలవడానికి వెళ్తున్న షర్మిలను పోలీసులు అడ్డుకున్నారని తెలిపారు. షర్మిలను ప్రతిసారి పోలీసులు టార్గెట్ చేస్తున్నారని కోర్టుకు వెల్లడించారు. పోలీసులే షర్మిలపై దురుసుగా ప్రవర్తించారన్నారు. 41 crpc నోటీసులు ఇవ్వకుండా షర్మిలను అక్రమంగా అరెస్ట్ చేశారన్నారు. షర్మిలపై నమోదు చేసిన సెక్షన్స్ అన్ని ఏడు సంవత్సరాలలోపు శిక్ష మాత్రమేనన్నారు. షర్మిల రిమాండ్ రీజెక్ట్ చెయ్యాలని ఆమె తరఫు లాయర్ కోర్టును కోరారు. బెయిల్ పిటిషన్ కూడా వేస్తున్నామన్నారు. ఆడపిల్ల అని కూడా చూడకుండా ఎక్కడపడితే అక్కడ పోలీసులు టచ్ చేశారని కోర్టుకు వెల్లడించారు. షర్మిల దర్యాప్తునకు సహకరిస్తామని స్పష్టం చేశారు.
షర్మిలపై కేసు నమోదు
లోటస్ పాండ్ వద్ద పోలీసుల మీద దాడి చేసిన వైఎస్ షర్మిలతో పాటు కారును ఆపకుండా పోనిచ్చిన ఇద్దరు డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదుచేశారు. కానిస్టేబుల్ గిరిబాబు కాలు మీద కారు ఎక్కించిన షర్మిల కాన్వాయ్ లో ఇద్దరు డ్రైవర్ ల మీద బంజారాహిల్స్ ఎస్ ఐ రవీందర్ ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఫిర్యాదుతో ఐపీసీ 332, 353 , 509, 427 సెక్షన్స్ కింద షర్మిలపై కేసు నమోదు చేశారు. వైఎస్ షర్మిల పోలీసుల వద్ద మాన్ పాక్స్ లాక్కొని పగలగొట్టారని ఫిర్యాదులో పేర్కొన్నారు. షర్మిలపై 337, రెడ్ విత్ 34 కింద మరో రెండు సెక్షన్లు నమోదు చేశారు. అయితే కారు ఎక్కించడంతో గాయపడ్డ కానిస్టేబుల్ గిరిబాబును స్టార్ ఆస్పత్రికి తరలించారు. స్కానింగ్ చేయగా, కాలి లిగ్మెంట్‌కు గాయం అయినట్లు డాక్టర్స్ గుర్తించారు. ఈ క్రమంలో బాధిత పోలీసుల ఫిర్యాదుతో బంజారాహిల్స్ పోలీసులు షర్మిలపై కేసు నమోదు చేశారు.
YS Viveka Murder Case: వైఎస్ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి
TSPSC Paper Leakage: నిందితుడు డీఈ రమేష్ కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టును ఆశ్రయించిన సిట్
Telangana Formation Day: తెలంగాణ ప్రజలను అందరూ మోసం చేస్తే, సోనియా వారి బాధను అర్థం చేసుకున్నారు: మీరా కుమార్
Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు
Hyderabad Accident: హైదరాబాద్ లో కారు డ్రైవర్ నిర్లక్ష్యానికి రెండేళ్ల పాప మృతి, డోర్ తీయడంతో విషాదం
Ahimsa Movie Review - 'అహింస' రివ్యూ : చీమకు హాని చేయనోడు వందల మందిని నరికితే? రానా తమ్ముడి సినిమా ఎలా ఉందంటే?
24 శాతం వడ్డీకి కోట్లాది రూపాయలు అప్పు చేసి ‘బాహుబలి’ తీశాం: రానా
Tata Altroz CNG: దేశంలోనే అత్యంత చవకైన సన్‌రూఫ్ కారు లాంచ్ చేసిన టాటా - రూ.8 లక్షల లోపే!
Narasimha Naidu Re Release : బాలకృష్ణ బర్త్ డేకు 'నరసింహ నాయుడు' రీ రిలీజ్