అన్వేషించండి

Teenmar Mallanna: నా మీద హత్యాహత్నం చేస్తారా.. ఇకనుంచి తేల్చుకుందాం: కవితపై తీన్మార్ మల్లన్న ఫైర్

BRS MLC Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన తండ్రి కేసీఆర్, సోదరుడు కేటీఆర్ మీద తన ఫ్రస్టేషన్ ను తన మీద చూపిస్తున్నారని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.

హైదరాబాద్: కేసీఆర్, కేటీఆర్ మీద ఏమైనా ఫ్రస్ట్రేషన్ ఉంటే వారితో తేల్చుకోవాలి, కానీ తనపై హత్యాయత్నం చేయడం ఏంటని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవిత, ఆమెకు సంబంధించిన తెలంగాణ జాగృతి కార్యకర్తలు తనపై హత్యాయత్నం చేశారని చింతపండు నవీన్ ఆరోపించారు. తన ఆఫీసులో దాడి తరువాత తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడారు. 

‘నాపై దాడులు చేస్తే బీసీ ఉద్యమం ఆగిపోతుంది అనుకుంటే అది మీ భ్రమే. నాపై హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని ఆపలేరు. ఇలాంటి దాడులకు తీన్మార్ మల్లన్న భయపడుతాడు అనుకుంటే అది మీ భ్రమే. కవిత అనుచరుల దాడిలో నా చేతికి గాయమైంది. దాడులను గమనించిన మా గన్‌మెన్ అప్రమత్తం అయ్యారు. కానీ ఆ గూండాలు గన్ మెన్ వద్ద నున్న తుపాకీ లాక్కొని మరీ మా ఆఫీసులో బీభత్సం చేశారు. మా సిబ్బందిపై దాడి చేయడంతో పాటు ఫర్నీచర్, ఆఫీసులో అద్దాలు ధ్వంసం చేసి హత్యాయత్నం చేశారు. ఈ దాడుల్లో నాతో పాటు కొందరు సిబ్బందికి గాయాలు అయ్యాయి. 


Teenmar Mallanna: నా మీద హత్యాహత్నం చేస్తారా.. ఇకనుంచి తేల్చుకుందాం: కవితపై తీన్మార్ మల్లన్న ఫైర్
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఆమె కుటుంబం నాపై హత్యాయత్నం చేసింది. బీసీలను అధికారంలోకి తెచ్చేందుకు నా ప్రయత్నం ఆగదు. నేను ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకడుకు వేసే ప్రసక్తే లేదు. కంచం- మంచం అనేది తెలంగాణలో ఊతపదం అని ప్రజలకు తెలుసు. కంచం పొత్తు అనగా తినడం కలసి ఉండటం కలసి పని చేయడం. మంచం పొత్తు అనగా వియ్యం ఇచ్చుకోవడం పుచ్చుకోవడం (పెళ్లి సంబంధాలు) లేదు అని అర్థం లో వాడుతారు. అది బూతు కాదు. అది అర్థం కాని వాళ్ళను ఏమి చేయలేం. రౌడీల్లా వచ్చి మాపై దాడి చేయడం కరెక్ట్ కాదు. నా వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నాను. నేను తప్పు మాట్లాడానా లేదా అన్నది ప్రజలు నిర్ణయిస్తారు. నా ఆఫీస్‌లో నా రక్తం కళ్లజూశారు. 


Teenmar Mallanna: నా మీద హత్యాహత్నం చేస్తారా.. ఇకనుంచి తేల్చుకుందాం: కవితపై తీన్మార్ మల్లన్న ఫైర్

ఇలాంటి ఘటనలపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాలి. ఈ దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాం. పోలీసులపై, న్యాయ వ్యవస్థపై మాకు నమ్మకం ఉంది. న్యాయం జరుగుతుందనే నమ్ముతున్నాం. భవిష్యత్తులో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కుతాం. బీసీ సమస్యలపై మా సలహాలను ప్రభుత్వం స్వీకరిస్తోంది. ఇందులో కవితకు వచ్చిన బాధ ఏంటో అర్థం కావడం లేదు. సహచర ఎమ్మెల్సీపై హత్యాయత్నం చేపించిన కవిత ఎమ్మెల్సీ సభ్యత్వాన్ని ప్రభుత్వం రద్దు చేయాలి. కవిత తన ఉనికి కోసం కేసీఆర్ ను ప్రశ్నించాలి. కేటీఆర్ తో పోరాడాలి. కానీ ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కదా అని తోటి ప్రజాప్రతినిధులపై దాడులు చేపించడం సరికాదు. వీటి వల్ల ప్రజల్లో మరింత చులకన అవుతారు’ అని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
Indiramma Housing Scheme: ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుల గడువు పూర్తి.. లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే
Harish Rao: రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు నిరూపించకపోతే పరువు నష్టం దావాతో కోర్టుకు లాగుతా: హరీష్ రావు
CM Revanth Reddy: రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి
రేషన్ కార్డు అంటే కేవలం బియ్యం ఇచ్చే సాధనం కాదు.. ప్రజల ఆత్మగౌరవం: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Bindu Madhavi Reacts to Uppal Balu Controversy | ఉప్పల్ బాలు vs బిందు మాధవి
Devdutt Padikkal Historic Test Century | స్వతంత్ర దినోత్సవం రోజు పడిక్కల్ సెంచరీ
Devdutt Padikkal Century vs Sri Lanka | శ్రీలంకపై దేవదత్ పడిక్కల్ సూప‌ర్ సెంచ‌రీ
KL Rahul Retired Hurt Near Century | సెంచరీకి చేరువలో కేఎల్ రాహుల్ రిటైర్డ్ హర్ట్
IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ పై టెక్ మహీంద్రా ఉద్యోగి భావన స్ట్రాంగ్ కౌంటర్స్ ..ABP దేశం Exclusive
DSC Teachers Rally: విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
విజయవాడలో మెగా డీఎస్సీ 2025 టీచర్ల భారీ ర్యాలీ.. ఏ అక్రమాలు జరగలేదన్న వైఎస్ జగన్ ఫ్యాన్
Tirumala Viral Video: తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
తిరుమల అలిపిరి మెట్ల మార్గంలో దర్జాగా స్మోకింగ్ చేసిన వ్యక్తి.. భక్తులు ఆగ్రహం
Bandla ganesh Daughter Marriage : ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
ఘనంగా బండ్ల గణేష్ కుమార్తె పెళ్లి - టాలీవుడ్ స్టార్స్ సందడి... తెలుగు రాష్ట్రాల సీఎంలు, రాజకీయ ప్రముఖులు హాజరు
Soaked Raisins : రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
రోజూ కిస్మిస్ నానబెట్టి ఉదయాన్నే తింటే కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
TTD Online Booking: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. నవంబర్ నెల దర్శన కోటా విడుదల షెడ్యూల్
Embed widget