Pochampally Srinivas Reddy: లెటర్ వార్ కు మద్దతిచ్చిన ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, కేంద్రానికి లేఖాస్త్రం
Pochampally Srinivas Reddy: ఉపాది హామీ పథకాన్ని వ్యవసయానికి అనుసందానం చేయాలంటూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ ప్రారంభించిన ఉత్తర యుద్దం కార్యక్రమానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మద్దతిచ్చారు.
Pochampally Srinivas Reddy: ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై ఉత్తర యుద్దం కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఉత్తర యుద్ధానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మద్దతు ఇచ్చారు. ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలోనే కేంద్ర ప్రభుత్వానికి ఎమ్మెల్సీ పోచంపల్లి ఉత్తరం రాశారు. ఇది చాలా మంచి కార్యక్రమం అని తెలిపారు. రైతులకు మేలు చేసేలా ఉన్న ఉత్తర యుద్దాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కొనియాడారు. ఎమ్మెల్యే తీసుకువచ్చిన ఈ ఉత్తర యుద్దం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి పోస్ట్ కార్డులను పంపే ఉత్తర ఉద్యమాన్ని చేపట్టారు. దానికి మద్దతుగా ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నేడు కేంద్ర ప్రభుత్వానికి పోస్ట్ కార్డు రాశారు.
కేసిఆర్ నాయకత్వంలో ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించినట్లు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే దిశగా అడుగులు వేస్తోందని విమర్శించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయడం వల్ల రైతులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. కాబట్టి దీనిపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో కేంద్రంపై ఉత్తర యుద్ధం కార్యక్రమాన్ని మొదలు పెట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా రైతులు, ఉపాధి హామీ కూలీలు కేంద్రానికి ఉత్తరాలను పంపాలని పిలుపునిచ్చారు. కేంద్రం దిగివచ్చి ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసే వరకు నిరంతరాయంగా తెలంగాణ మొత్తంగా ఈ ఉద్యమం సాగుతుందని వెల్లడించారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ తీర్మానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
లేఖలో ఏం రాశారంటే..?
"గౌరవనీయులైన కేంద్ర జాతీయ గ్రామీణాభివృద్ధి మంత్రికి... కేంద్ర ప్రభుత్వ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలి. 30 వేల కోట్ల నిధులు తగ్గించడంతో ఉపాధి కూలీలకు పని దినాలు తగ్గిపోయాయి. వ్యవసాయ కూలీకి రోజుకు రూ.257/-. ప్రతి కూలీకి 100/- రూపాయలు ఇవ్వాలని చట్టం ఉన్నప్పటికీ. ఇది చాలా ఎక్కువ కాదు. పని ప్రదేశాల్లో కనీసం కనీస సౌకర్యాలు (డేరు, తాగునీరు, రగ్గులు, రగ్గులు, ప్లేట్లు) కల్పించడం లేదు. కనీస వేతన చట్టం ప్రకారం 8 గంటలు పనిచేసిన కూలీ రూ.480/- ఉపాధి హామీ కూలీలు ఇవ్వాలనుకున్నా కనీస వేతనం అందడం లేదు. ఆన్‌లైన్ విధానం వల్ల గ్రామీణ, అటవీ ప్రాంతాల్లో ఉదయం 10 గంటలకు సిగ్నల్స్ లేవు. అదృష్టం & కో: సాయంత్రం 4 గం. కంప్యూటర్ అప్‌లోడ్ విధానం అమలు చేయాల్సి రావడంతో కూలీలు ఉపాధికి దూరమవుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేసేందుకు అసెంబ్లీ తీర్మానాన్ని అమలు చేయాలి. వ్యవసాయాన్ని అనుసంధానించడం అనేది గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న కారు రైతులు కూలీలు కాబట్టి, వ్యవసాయాన్ని అనుసంధానించడం రైతులకు మరియు కార్మికులకు లాభదాయకంగా ఉంటుంది. పంట స్థాయిని బట్టి ఎకరాకు కూలీ టోకెన్లు, మాస్టర్‌లో 100 పని దినాలు ఉండేలా చూడాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి మండల స్థాయి ఏపీఓల వరకు వేలాది మంది ఉపాధి కూలీలు కృషి చేస్తున్నారు. వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి’ అని లేఖలో పేర్కొన్నారు.