అన్వేషించండి

Kavitha: బీఆర్ఎస్ మద్దతుతో రైల్ రోకో- కవిత సంచలన వ్యాఖ్యలు: BC రిజర్వేషన్ బిల్లుపై బీజేపీకి సవాల్!

K Kavitha:రైల్‌రోకో నిరసన పోస్టర్ రిలీజ్ చేసిన కె. కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని తన పోరాటానికి బీఆర్‌ఎస్ మద్ధతు ఉందని కామెంట్ చేశారు.

K Kavitha: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి కీలకవ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నానని... తన కార్యక్రమాలకు బీఆర్‌ఎస్ సపోర్టు ఉంటుందని కామెంట్ చేశారు. రైల్‌రోకో పోస్టర్ రిలీజ్ సందర్భంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఇలా స్పందించారు. కొత్తగా ఎన్నికైన బీజేపీ తెలంగాణ అధ్యక్షుడికి లేఖ కూడా రాశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించాలని డిమాండ్ చేశారు. 

తెలంగాణలో బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జులై 17న జాగృతి ఆధ్వర్యంలో రైల్‌రోకోకు కవిత పిలుపునిచ్చారు. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారామె. చేపట్టబోయే రైల్ రోకోను విజయవంతం చేయాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. 

బీసీ బిల్లు సాధించేందుకు జులై 17 తారీఖున రైల్ రోకోలో అన్ని పార్టీలు పాల్గొనాలని కె. కవి పిలుపునిచ్చారు. ఇప్పటికే అన్ని పార్టీల మద్దతు కూడ గట్టామన్నారు. జూలై 17న తెలంగాణ నుంచి ఢిల్లీ వెళ్ళే ప్రతి రైలును ఆపి నిరసన కార్యక్రమం విజయవంతం చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు సాధించుకునేందుకు బిజెపిపై ఒత్తిడి తెస్తామన్నారు. రైల్ రోకో కార్యక్రమానికి బిఆర్ఎస్ మద్దతు ఉంటుందా అని అడిగిన ప్రశ్నకు కవిత సమాధానం ఇచ్చారు. తాను బిఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. రైల్ రోకోకు కచ్చితంగా బీఆర్ఎస్ సపోర్ట్  ఉంటుందని స్పష్టం చేశారు. 

స్థానిక సంస్థల్లో లబ్ధి పొందాలనే ఢిల్లీ నుంచి AICC అధ్యక్షుడు మల్లి ఖార్జున్ ఖర్గే సహా ఇతర కీలక నేతలు వస్తున్నారని కవిత ఆరోపించారు. బిసిలకు ఇచ్చిన హామీలు అమలు చెయ్యకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. మల్లి ఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ బీసీల కోసం పార్లమెంట్‌లో ఎప్పుడూ మాట్లాడింది లేదని ఆరోపించారు. బిసిలకు 42 రిజర్వేషన్ అమలు అయ్యేలా బిజెపిపై మల్లిఖార్జున్ ఖర్గే ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. 

కులగణన వివరాలు బయట పెట్టాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు కవిత. ఇంకా పాత లెక్కలే చెప్తున్నారని, గ్రామ పంచాయతీల వారీగా కులగణన వివరాలు బయట పెట్టాలని అన్నారు. లేకుంటే ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. 

బీసీ బిల్లుపై బిజెపి కొత్త అధ్యక్షుడు చొరవ తీసుకోవాలని సూచించారు కవిత. ఈమేరకు రామచందర్ రావుకు లెటర్ రాశామని తెలిపారు. ఆ వివరాలను కూడా ఆమె పంచుకున్నారు. ఆయన చొరవ తీసుకొని బిజెపి అధ్యక్ష హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలని సూచించారు.

Kavitha: బీఆర్ఎస్ మద్దతుతో రైల్ రోకో- కవిత సంచలన వ్యాఖ్యలు: BC రిజర్వేషన్ బిల్లుపై బీజేపీకి సవాల్!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!

వీడియోలు

History Behind Peppé Buddha Relics | భారత్‌కు తిరిగి వచ్చిన బుద్ధుని అస్థికలు! | ABP Desam
అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
ONGC పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ పరుగులు పెట్టిన పోలీసులు, సిబ్బంది
Telangana Gurukul Admissions: తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ గురుకులాల్లో ప్రవేశాల జాతర: 2026-27 విద్యా సంవత్సరానికి ఉమ్మడి ప్రవేశ పరీక్ష- నోటిఫికేషన్ విడుదల
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Embed widget