MLC Kavitha Comments on CM Revanth | రేవంత్ కు అభినందనలు తెలిపిన కవిత
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల, సీఎం రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తీసుకున్న అప్పులను ఎక్కడకి దారి మర్లిస్తున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కేసీఆర్ అప్పు తెస్తే కిస్తీలు కట్టారని... రేవంత్ రెడ్డి అది కూడా కట్టట్లేదని మండిపడ్డారు ఎమ్మెల్సీ కవిత. అప్పు తెచ్చినందుకు తెలంగాణ ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, సీఎం రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల. కాళేశ్వరం ప్రాజెక్టుకు తీసుకున్న అప్పుకు కేసీఆర్ కిస్తీలు కట్టారు... తెచ్చుకున్న అప్పుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం కనీసం కిస్తీలు కూడా కట్టడం లేదని మండిపడ్డారు కల్వకుంట్ల కవిత. వేల కోట్ల అప్పులు చేసి రాష్ట్ర ప్రజలకు మాత్రం ఎలాంటి పతకాలు కూడా అమలు చేయట్లేదని అన్నారు కవిత. మహా లక్ష్మి పతకం, పెన్షన్, మహిళలకు ఇస్తామన్న డబ్బులు కూడా ఇవ్వట్లేదని అన్నారు. అప్పులు కట్టట్లేదు పతకాలు అమలు చెయ్యట్లేదు అని మండిపడ్డారు. కాంట్రాక్టర్లకు కేసీఆర్ అడ్వాన్స్ ఇవ్వలేదు కానీ రేవంత్ రెడ్డి ఇస్తున్నారు... రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి తరపున 'అవినీతి చక్రవర్తి' బిరుదు ఇచ్చారు కవిత.





















