Mitraaw Sharma: 'నాకు డబ్బు కావాలి, నాకు డబ్బు మాత్రమే కావాలి' - మిత్రా శర్మ మరో ఆడియో లీక్!
Mitra Sharma: యూట్యూబర్ హర్షసాయిపై ఫిర్యాదు చేసిన మిత్రాశర్శ మాట్లాడుతున్నట్లు మరో ఆడియో లీకైంది. ఆమె సంబాషణల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.
Mitraaw Sharma Sensational Audio Leak: యూట్యూబర్ హర్షసాయిపై ఫిర్యాదు చేసిన మిత్రాశర్మ ఆడియో సంభాషణలు సంచలనంగా మారియి. తనపై కేసు నమోదైన వెంటనే హర్షసాయి ఓ ఆడియో లీక్ చేసిన విషయం తెలిసిందే. అందులో ఆమె హర్షసాయిని ప్రేమించమని ఒత్తిడి చేస్తున్నట్లు ఆ సంభాషణలు సాగుతుంటాయి. ఇదిలా ఉంటే తాజాగా మిత్ర శర్శ మరో ఆడియో ABP Desam చేతికి చిక్కింది. ఆ ఆడియోలో మరో వ్యక్తితో సంభాషిస్తున్న మిత్రా శర్శ, అక్రమ మద్యం వ్యాపారం గురించి మాట్లాడుతున్న తీరు సంచలనంగా మారింది .ఆ ఆడియోలో మిత్ర శర్శ ఏమన్నారంటే..!
'ఐదేళ్ల క్రితం మాకు లిక్కర్ లైసెన్స్ వచ్చింది. అంటే లైసెన్స్ వేరే వాళ్ల పేరుతో ఉంటుంది. కానీ షాపు మాత్రం మన కంట్రోల్‌లో ఉంటుంది. వాళ్ల కోసం మనం పనిచేశాం. లైసెన్స్ ఉన్న ఓనర్ అనుకోకుండా మృతి చెందాడు. ఓనర్ కొడుకుకు లైనెస్స్ నెక్ట్స్ అర్హత ఉంటుంది. కానీ నేను ఆ అవకాశం ఇవ్వకుండా మద్యం అమ్మకాలపై ఆదాయం విపరీతంగా వస్తుందని ఆశపడ్డాను. ఇది మేము కంటిన్యూ చేస్తాం. నీకు ఇవ్వం అని ఓనర్ కొడుకుకి చెప్పేశాను. అది అలా కొనసాగుతుండగా, నన్ను చంపాలని లైసెన్స్ కోసం ఓనర్ కొడుకు ఎన్నో ప్రత్నాలు చేశాడు. ఓసారి మాదాపూర్ జంక్షన్‌లో కారు దిగి, ఓ రెండు అడుగులు వేశాను. అంతే బైక్‌పై వేగంగా వచ్చిన ఇద్దరు యువకులు నాపై కత్తులతో దాడి చేశారు. అదృష్టవశాత్తు ఆ రోజు బ్రతికిపోయాను. ఇప్పటికీ చేతిపై ఆ గాయం ఉంది. మాకు ఓ పెద్ద బాస్ ఉండేవాడు. నాకు ఉన్న పరిచయాలు అన్నీ హై ప్రొఫైల్ పరిచయాలు. వాళ్లంతా నీకెందకమ్మా ఈ మద్యం వ్యాపారం అనేవాళ్లు. కానీ నాకు మాత్రం డబ్బు కావాలి. డబ్బు మాత్రమే కావాలి. అందుకే నేను కంటిన్యూ చేశాను.' అని ఆ ఆడియోలో సంభాషణలు ఉన్నాయి.
'ఆ డబ్బుకు కక్కుర్తి పడి ఇప్పటికీ మద్యం వ్యాపారం వదల్లేదు. ఓ పెద్దాయన వచ్చేసి, వదిలేయమ్మా.. ఇవన్నీ మనకు కరెక్ట్ కాదు అని చెప్పారు. నిన్ను ఎక్కడైనా పట్టుకుంటే ఏం చేస్తావు. ఈ వ్యాపారం వదిలేయమని చెప్పారు. ఓ రోజు సిట్టింగ్ పెట్టి తిరిగి ఓనర్ కొడుకుకే షాపు ఒప్పించారు.నాకు డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు. అప్పటికే నేను కొందరు వివిఐపి వ్యక్తుల పరిచయాలతో డబ్బు బాగానే సంపాదించాను.' ఇలా మిత్రా శర్శ సన్నిహిత వ్యక్తితో మాట్లాడుతున్న ఆడియో సంభాషణ సంచలనం రేపుతోంది. అనేక ప్రశ్నలు, అనుమానాలను లేవనెత్తుతోంది. వేల రూపాయల ఆదాయంతో మొదలైన మిత్రాశర్శ జీవితం కోట్లకు పడగలెత్తి, ఓ సినిమాకు నిర్మతా మారే స్దాయికి ఎదిగారంటే ఈ అక్రమ మద్యం వ్యాపారం కారణమా.? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఆడియోలో మిత్రా శర్శను మందలించిన పెద్దాయన ఎవరు. ఆమెకు మిాత్రాతొో ఉన్న సంబంధం ఏమిటి.. నేను గతంలో అనేక మంది వీవీఐపీలతో పనిచేసాను.అందులోనూ విదేశీయులు ఉన్నారు అంటోంది. విదేశీయులతో మిత్రా చేసిన పనేంటి.. ఇలా మిత్రాశర్శ తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.