అన్వేషించండి

Missing Cheques: డ్రాప్ బాక్సులో చెక్ వేస్తున్నారా, అయితే ఈ మోసం గురించి తెలుసుకోండి!

Missing Cheques: ఇటీవల హైదారాబాద్ నగరంలోని ఏటీఎం కియోస్క్‌లలో చెక్కులు చోరీకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు వినియోగదారులకు పలు సూచనలు చేస్తున్నారు.

Missing Cheques: ఈ రోజుల్లో కాదేది మోసానికి అనర్హం. ఎటు చూసినా మోసమే. డేటా చోరీ, మనీ చోరీ, సైబర్ నేరం, ఇలా అన్నీ చోరీలే. క్రెడిట్ కార్డు ఇస్తామంటూ ఒకరు, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం అంటూ మరొకరు, క్రిప్టోలో లాభాలంటూ ఇంకొకరు ఇలా ఎదుటి వారిని మోసం చేస్తూనే ఉంటారు. చివరికి సొంతవాళ్లను కూడా నమ్మలేని పరిస్థితి. ఫోన్ పే స్క్రాచ్ కార్డు పేరుతో ఖాతా ఖాళీ చేస్తా మరొకరు ఏకంగా బ్యాంకుల్లో వేసే చెక్‌లనే కాజేస్తున్నారు. 

ఇటీవల హైదారాబాద్ నగరంలోని ఏటీఎం కియోస్క్‌లలో చెక్కులు చోరీకి గురవుతున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు వినియోగదారులకు పలు సూచనలు చేస్తున్నారు. చెక్కులను అజాగ్రత్తగా డ్రాప్‌బాక్సుల్లో వేయవద్దని హెచ్చరిస్తున్నారు. ఇటీవల డ్రాప్‌బాక్స్‌లో వేసిన తమ చెక్కులు కనిపించకుండా పోయాయంటూ కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం కియోస్క్‌ల వద్ద ఉన్న డ్రాప్‌బాక్స్‌లను లక్ష్యంగా చేసుకుని కొందరు వ్యక్తులు చెక్కులను చోరీకి పాల్పడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

దొంగలు చెక్కులను దొంగిలించి, బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ముందు వాటిని తారుమారు చేస్తున్నారని పోలీస్ అధికారులు తెలిపారు. ఆ మొత్తాన్ని ఇతర నగరాల్లోని థర్డ్ పార్టీ ఖాతాకు బదిలీ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. నగరంలో ప్రతి నెలా ఇటువంటి కేసులు మూడు, నాలుగు నమోదవుతున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు వినియోగదారులు పలు సూచనలు చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు, సెక్యూరిటీ గార్డులు కాపలా ఉన్న డ్రాప్ బాక్స్‌లలో మాత్రమే ప్రజలు తమ చెక్కులను డిపాజిట్ చేయాలని పోలీసులు  కోరారు. చెక్‌ను తారుమారు చేయడం కష్టంగా ఉండే విధంగా స్క్రిప్ట్‌ను రూపొందించాలని ఖాతాదారులకు పోలీసులు సూచించారు.

మోసగాళ్లు డ్రాప్ బాక్స్‌ల నుంచి చెక్కులను దొంగిలించి, బేరర్/లబ్ధిదారుడి వివరాలను గుర్తించిన తర్వాత మోసాలకు పాల్పడుతున్నారు. చెక్‌లో ఉన్న వివరాలతో దూరంగా ఉన్న ప్రాంతాల్లో నకిలీ డాక్యుమెంట్లతో ఖాతాలు తెరుస్తున్నారు. తరువాత వాటికి బ్యాంకుల్లో వాటిని మార్చి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. చెక్కు మొత్తం క్రెడిట్ అయిన తర్వాత వెంటనే దొంగలు డబ్బు విత్‌డ్రా చేస్తున్నారని ఓ పోలీసు అధికారి తెలిపారు. చెక్కుల చోరీకి గురికాకుండా ఉండేందుకు ఏటీఎంలలో ట్యాంపర్ ప్రూఫ్ డ్రాప్ బాక్స్‌లను ఏర్పాటు చేయాలని పోలీసులు బ్యాంకులకు సూచించారు. అంతేకాదు చెక్కులపై ఖాళీ స్థలం ఉంచవద్దని సూచిస్తున్నారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆ ఊళ్లోనే పెద్దపులి తిష్ట! డ్రోన్లతో గాలింపుభారత్ ఘోర ఓటమి ఆసిస్ సిరీస్ సమంరైతులకు నో ఎంట్రీ, రోడ్లపై ఇనుప మేకులు, బోర్డర్‌లో భారీ బందోబస్తుసప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains: అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
అల్పపీడన ప్రభావం - ఈ నెల 15 వరకూ ఈ జిల్లాల్లో వర్షాలు, అధికారులకు సీఎం కీలక ఆదేశాలు
KCR: తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
తెలంగాణ తల్లి కొత్త విగ్రహం - కాంగ్రెస్ ప్రభుత్వానిది మూర్ఖపు చర్యంటూ కేసీఆర్ తీవ్ర ఆగ్రహం
WhatsApp Message Reminder: ‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
‘బాబూ... మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోయావ్’ - వాట్సాప్‌లో రానున్న కొత్త ఫీచర్ ఇదే!
Special Trains: శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
శబరిమల భక్తులకు గుడ్ న్యూస్ - జనవరిలో 34 ప్రత్యేక రైళ్లు, ఆ రూట్లు ఇవే!
Sandhya Theater Stampede: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన - ముగ్గురిని అరెస్ట్ చేసిన పోలీసులు, కోలుకుంటోన్న బాలుడు
Mahindra BE 6e Vs Tata Curvv EV: నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
నెక్సాన్ వర్సెస్ కర్వ్ వర్సెస్ బీఈ 6ఈ - మూడు ఎలక్ట్రిక్ కార్లలో ఏది బెస్ట్!
Bapatla Accident: ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
ఏపీలో తీవ్ర విషాదం - టిప్పర్ లారీ ఢీకొని ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
Actor Manchu Manoj: బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
బంజారాహిల్స్ ఆస్పత్రికి నటుడు మంచు మనోజ్ - నడవడానికి ఇబ్బంది పడుతూ వ్యక్తి సాయంతో.. వీడియో వైరల్
Embed widget