V Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి కన్నుమూత.. గుండెపోటుతో హఠాన్మరణం
హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో శాంతమ్మ చనిపోయారు. గుండెపోటు రావడం వల్ల హఠాన్మరణం చెందినట్లుగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. మంత్రి తల్లి శాంతమ్మ శుక్రవారం రాత్రి కన్నుమూశారు. హైదరాబాద్‌లో శుక్రవారం రాత్రి సుమారు 11 గంటల సమయంలో ఆమె చనిపోయారు. గుండెపోటు రావడం వల్ల హఠాన్మరణం చెందినట్లుగా మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఓ ప్రకటనలో తెలిపారు. శాంతమ్మ అంత్యక్రియలు మహబూబ్ నగర్ పట్టణంలోని వారి సొంత వ్యవసాయ క్షేత్రంలో ఈ రోజు (అక్టోబరు 30) సాయంత్రం జరుగుతాయని ప్రకటనలో తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ తల్లి మృతి పట్ల పార్టీ నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.
Also Read: ‘కేటీఆర్ సర్.. ఇది న్యాయమా? అంత ఒత్తిడి దేనికి?’ మంత్రికి యాంకర్ అనసూయ ట్వీట్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ తల్లి శాంతమ్మ మరణంపట్ల సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. శాంతమ్మ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ గుండెపోటుతో ఆకాల మరణం చెందడం పట్ల రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థించారు.
Also Read: మంత్రులకు జీహెచ్ఎంసీ షాక్... టీఆర్ఎస్ ఫ్లెక్సీలకు భారీగా జరిమానాలు...
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి