By: ABP Desam | Updated at : 29 Oct 2021 10:10 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి జగదీష్ రెడ్డి
హైదరాబాద్ హైటెక్స్ లో విద్యుత్ వాహనాల ప్రదర్శనను మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, టీఎసస్ రెడ్కో వి.సి.య.డి జానయ్య శుక్రవారం సందర్శించారు. భవిష్యత్ లో విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. టీఎస్ రెడ్కో ఆధ్వర్యంలో ఈవీ ట్రెడ్ ఎక్స్పో విద్యుత్ వాహనాల ప్రదర్శనను ఆయన శుక్రవారం ప్రారంభించారు. ప్రదర్శన ప్రారంభోత్సవం అనంతరం కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేశారు. మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ 10 వేల విద్యుత్ మోటారు సైకిళ్లు వినియోగంలోకి వచ్చినట్లైతే సంవత్సరానికి రూ.250 కోట్ల పెట్రోల్ దిగుమతులు ఆదా అవుతుందన్నారు. ప్రపంచానికి పర్యావరణ కాలుష్యం ఛాలెంజ్ గా మారిందన్నారు. విద్యుత్ వాహనాల వాడకం తప్పనిసరి అవుతుందని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు.
Also Read: మంత్రులకు జీహెచ్ఎంసీ షాక్... టీఆర్ఎస్ ఫ్లెక్సీలకు భారీగా జరిమానాలు...
తెలంగాణలో మరో 600 ఛార్జింగ్ కేంద్రాలు
పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని సీఎం కేసీఆర్, రాష్ట్ర ఐటీ పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విద్యుత్ వాహనాలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. విద్యుత్ వాహనాలు తయారు చేస్తున్న పారిశ్రామికవేత్తలను ప్రోత్సాహం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యుత్ వాహనాల అమ్మకాలను మాత్రమే కాకుండా తెలంగాణలో తయారీకి పారిశ్రామిక వేత్తలను రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహిస్తుందన్నారు. అంతే కాకుండా విద్యుత్ వాహనాలకు అవసరమైన బ్యాటరీ పరిశ్రమలను తెలంగాణలో నెలకొల్పే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. విద్యుత్ వాహనాల ఛార్జింగ్ కు సందేహపడొద్దని ఇప్పటికే 138 ఛార్జింగ్ కేంద్రాలను ప్రారంభించినట్లు మరో 600 ఛార్జింగ్ కేంద్రాల ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు.
Also Read: ‘కేటీఆర్ సర్.. ఇది న్యాయమా? అంత ఒత్తిడి దేనికి?’ మంత్రికి యాంకర్ అనసూయ ట్వీట్
పర్యావరణ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి
తెలంగాణలో 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా ఉందని, విద్యుత్ వాహనాల ఛార్జింగ్ విషయంలో భయపడొద్దని మంత్రి జగదీష్ రెడ్డి భరోసా ఇచ్చారు. పర్యావరణ కాలుష్యం మానవజాతి మనుగడకే ఛాలెంజ్ గా మారిందన్నారు. అటువంటి ఛాలెంజ్ లను ఎదుర్కోడానికి విద్యుత్ వాహనాల వాడకం తప్పని సరైందన్నారు. పొగ మంచుతో పాటు పర్యావరణ కాలుష్యం విడుదల చేస్తున్న పొగతో దేశ రాజధాని కొత్త దిల్లీతో పాటు బీజింగ్ వంటి ప్రాంతాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్న అంశాన్ని ఆయన ప్రస్తావించారు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Telangana CM KCR resigns:సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా, ఎలాంటి కాన్వాయ్ లేకుండా రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ కు లేఖ!
Telangana Election Results 2023 LIVE: తెలంగాణ ఎన్నికల్లో 'కాంగ్రెస్' విజయం - రేపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం.?
Hyderabad Assembly Election Results 2023: హైదరాబాద్ లో నియోజకవర్గాల వారీగా గెలిచిన, ఓడిన వారి జాబితా ఇదే!
Telangana constituency wise results: తెలంగాణ తీర్పు: ఏయే నియోజకవర్గంలో ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు?
Losing Minister 2023:ఆరుగురు మంత్రులకు షాక్ ఇచ్చిన ఓటర్లు
Best Browser: మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వర్సెస్ గూగుల్ క్రోమ్ - ఈ మూడు విషయాల్లో ‘ఎడ్జ్’నే బెస్ట్!
Rajasthan Election Result 2023: రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఓటమికి కారణాలేంటి? గహ్లోట్ జాదూ ఎందుకు పని చేయలేదు?
RGV Tweet on Revanth Reddy: రేవంత్ రెడ్డి బాహుబలి, తెలంగాణ ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌ది కాదు - వర్మ సెన్సేషనల్ ట్వీట్
KTR on Telangana Election Results: ఎన్నికల ఫలితాలు నిరాశ కలిగించాయి, కాంగ్రెస్ కు ఆల్ ది బెస్ట్ - కేటీఆర్ ట్వీట్ వైరల్
/body>