Anchor Anasuya: ‘కేటీఆర్ సర్.. ఇది న్యాయమా? అంత ఒత్తిడి దేనికి?’ మంత్రికి యాంకర్ అనసూయ ట్వీట్
పిల్లలను స్కూళ్లకు పంపే క్రమంలో స్కూల్ యాజమాన్యాలు ఓ విషయంలో తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయని అనసూయ విమర్శించారు.
కరోనా రెండో వేవ్ తర్వాత పాఠశాలలు, విద్యాసంస్థలు తెరిచిన సంగతి తెలిసిందే. అనంతరం స్కూళ్ల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరు పట్ల యాంకర్ అనసూయ గళం విప్పారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. పిల్లలను స్కూళ్లకు పంపే క్రమంలో స్కూల్ యాజమాన్యాలు ఓ విషయంలో తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయని విమర్శించారు. ఈ విషయంపై దృష్టి పెట్టాలని మంత్రి కేటీఆర్‌ను, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ట్యాగ్ చేస్తూ శుక్రవారం ట్వీట్ చేశారు.
Also Read: Family Drama Movie Review 'ఫ్యామిలీ డ్రామా' సమీక్ష: థ్రిల్లింత కొంత... సుహాస్ నటన కొండంత!
కేటీఆర్ సర్... నాకో విషయం తెలియాలి. మనం కరోనా వచ్చినప్పుడు లాక్ డౌన్ ఎందుకు పెట్టుకున్నాం? డఆ తర్వాత అన్ లాక్ ఎందుకు చేసుకున్నాం. పెద్దవారికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం, అందరూ వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల భరోసాతో అన్ని నిబంధనలు సడలించుకున్నాం. కానీ, పిల్లల విషయంలో ఎలా? ఇప్పుడు పిల్లల్ని స్కూళ్లకి పంపుతున్నా వారు తల్లి దండ్రుల నుంచి ఓ హామీ పత్రం గురించి బాగా ఒత్తిడి చేస్తున్నారు. చిన్నారులు స్కూళ్లలో ఉన్నప్పుడు వారికి కరోనా సోకినా.. యాజమాన్యానికి ఏం సంబంధం లేదని హామీ పత్రం అడుగుతున్నారు. దాదాపు అన్ని స్కూళ్లు ఇలా తల్లిదండ్రులపై ఒత్తిడి చేస్తున్నాయి. ఇది ఎంత వరకూ న్యాయం? మీరు ఎప్పటిలాగే ఈ విషయంలో జోక్యం చేసుకొని దీనిపై సమీక్ష జరుపుతారని ఆశిస్తున్నాం.’’ అని అనసూయ కేటీఆర్‌ను కోరారు. అనంతరం ఈ ట్వీట్‌ను మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా ట్యాగ్ చేస్తూ రీట్వీట్ చేశారు.
Also Read: Romantic Movie Review 'రొమాంటిక్' సమీక్ష: రొమాన్స్ తక్కువ... రొటీన్ సీన్లు ఎక్కువ!
Dear @KTRTRS Sir.. I want to understand why there was lockdown in the first place..and then there is unlock.. we can be a bit assured that we are all getting vaccinated..but what about the children below the required vaccine age sir?? Why are the schools forcing the parents (1/2)
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 29, 2021
(2/2) to send the children to school with a signed document which says they are NOT responsible if/whatsoever happens to the children while they are at school.. tell me sir.. how fair is this.. hoping you would guide us right as always.. we are all in a fix 🙏🏻
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 29, 2021
Cc to Dear @SabithaindraTRS ma’am 🙏🏻 https://t.co/FLHQrRe9ZQ
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 29, 2021
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి