CH Malla Reddy: 40 ఏళ్లనాటి స్కూటర్‌పై మల్లారెడ్డి షికార్లు, దానిమీదే పాల వ్యాపారం
విజయదశమి సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తన గత స్మృతులను గుర్తు తెచ్చుకున్నారు. 40 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి ఎల్లప్పుడు ప్రత్యేకంగా నిలుస్తుంటారు. సభల్లో తన వ్యాఖ్యలతోనూ, చేష్టలతోనూ విపరీతంగా వైరల్ అవుతుంటారు. ఆ మధ్య తాను ఎదిగిన తీరును వివరిస్తూ.. ‘పాలమ్మినా, పూలమ్మినా, బోర్ వెల్స్ నడిపిచ్చినా, కాలేజీలు పెట్టినా’ అన్న మాటలు విపరీతంగా వైరల్ అయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే మంత్రి మల్లారెడ్డి ఓ సెలబ్రిటీ అయిపోయారు.
తాజాగా విజయదశమి సందర్భంగా మంత్రి మల్లారెడ్డి తన గత స్మృతులను గుర్తు తెచ్చుకున్నారు. 40 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాలను మరోసారి గుర్తు చేసుకున్నారు. బోయిన్ పల్లిలో విజయదశమి సందర్భంగా మల్లారెడ్డి ఆయుధ పూజ నిర్వహించారు. ఆ సమయంలో తాను యువకుడిగా ఉన్నప్పుడు ఉపయోగించిన స్కూటర్‌కు కూడా పూజ చేశారు.
దీని మీదే పాలమ్మిన
ఆ స్కూటర్ పై చక్కర్లు కొట్టి ఫోటోలకు ఫోజులిచ్చారు. గతంలో ఓ సందర్భంలో పాలమ్మిన.. పూలమ్మిన.. కష్టపడినా అంటూ మల్లారెడ్డి చెప్పిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాను పాలమ్మిన ఆ స్కూటర్‌పైనే పూజ చేసి దానిపై చక్కర్లు కొట్టారు మంత్రి.