IPL, 2022 | Match 70 | Wankhede Stadium, Mumbai - 22 May, 07:30 pm IST
(Match Yet To Begin)
SRH
SRH
VS
PBKS
PBKS
IPL, 2022 | Qualifier 1 | Eden Gardens, Kolkata - 24 May, 07:30 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
RR
RR

KTR: ఇక అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అక్కడ కూడా.. అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ ప్రకటన

శాస‌న‌మండ‌లిలో ప్రశ్నోత్తరాల సంద‌ర్భంగా వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమంపై స‌భ్యులు అడిగిన ప్రశ్నలపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు.

FOLLOW US: 

హైదరాబాద్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీపై మంగళవారం నాటి అసెంబ్లీలో చర్చ జరిగింది. శాస‌న‌మండ‌లిలో ప్రశ్నోత్తరాల సంద‌ర్భంగా వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమంపై స‌భ్యులు అడిగిన ప్రశ్నలపై మంత్రి కేటీఆర్ మాట్లాడారు. భవిష్యత్తు అవసరాలు, నగరం ఏటికేడూ విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యూహాత్మక నాలా అభివృద్ధిని చేపట్టామని తెలిపారు. ఇందులో భాగంగా గతంలో హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లోని ప్రజలకు తాగు నీటి సమస్యలను ఎలా పారద్రోలామో అదే తరహాలో డ్రైనేజీ సమస్యను కూడా పరిష్కరిస్తామని వెల్లడించారు. ఆ క్రమంలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవ‌స్థను నిర్మించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని కేటీఆర్ చెప్పారు.

న‌గ‌రంలో వ‌ర‌ద స‌మ‌స్యను నివారించేందుకే వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం చేప‌ట్టామ‌ని మంత్రి ఈ సందర్భంగా తెలిపారు. ఇటీవల ముంపునకు గురైన ప్రాంతాలను గుర్తిస్తామ‌ని తెలిపారు. సమగ్ర విచారణ చేపట్టి, నాలా గ్రిడ్ మెరుగుదల కోసం వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం చేపట్టామని కేటీఆర్ వివరించారు. ఈ క్రమంలో మొత్తం ప్రధాన కాలువలను 173 కిలో మీటర్లుగా మదింపు చేసి మొదటి దశ కింద జాబితాను ఖరారు చేశామని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2021లోనే వర్షాకాలం రాకముందే ఈ పనిని చేపట్టి వరద నీటిని డ్రైనేజీ నెట్​వర్క్‌లో కనీసం 30 శాతాన్ని పూర్తి చేయాలనుకున్నట్లు వివరించారు. జీహెచ్ఎంసీ అధికారులను సంప్రదించి.. కిర్లోస్కర్, వోయన్ట్స్ నివేదికలను పరిగణలోకి తీసుకుంటూ, ఎస్ఈపీఈ ఇన్‌ఫ్రా కన్సల్టెన్సీని సంప్రదించి జీహెచ్ఎంసీ జాబితాకి ప్రాధాన్యం ఇచ్చామని కేటీఆర్ తెలిపారు.

Also Read:  రిపబ్లిక్ సినిమా చూసిన రేవంత్ రెడ్డి, సీతక్క.. వారి స్పందన ఏంటంటే..

కేటీఆర్ ప్రసంగం ఇంటలెక్చువల్స్‌లాగా ఉంది: గోరెటి వెంకన్న
మరోవైపు, మంత్రి కేటీఆర్ ప్రసంగంపై ఎమ్మెల్సీ గోరెటి వెంక‌న్న ప్రశంస‌లు కురిపించారు. మండ‌లిలో ప్రశ్నోత్తరాల సంద‌ర్భంగా క‌ళాకారుల‌కు పెన్షన్లు అనే అంశంపై గోరెటి వెంక‌న్న మాట్లాడారు. ‘‘మొన్న కేటీఆర్ ఉప‌న్యాసం విన్న త‌ర్వాత ఎంతో సంతోషం కలిగింది. హార్వర్డ్, ఆక్స్‌ఫ‌ర్డ్, జేఎన్‌యూ యూనివ‌ర్సిటీల్లో ఇంట‌లెక్సువ‌ల్స్ మాట్లాడితే ఎట్ల ఉంటదో అట్ల ఉంది. తెలంగాణ క‌ళ‌ల‌కు నిల‌యం. తెలంగాణ సంప్రదాయం దరువు సంప్రదాయం అని సింగ భూపాలుడు చెప్పిండు. తెలంగాణకు చెందిన 200 మంది నాట్యక‌త్తెల పేర్లు.. కోణార్క్‌లోని సూర్యదేవాల‌యంలో ఉన్నాయి. తెలంగాణ‌లో ఉన్న సంస్కృతి, సంప్రదాయాల‌తో ఈ ప్రాంతం పుల‌క‌రించిపోతోంది. సంగీతానికి గొప్ప విలువ ఉంది.’’

Also Read: ‘ఆడు మగాడ్రా బుజ్జి.. అమ్మాయి కాదురా..!’ ట్వీట్ చేసిన పోలీసులు.. టెంప్ట్ అయ్యారో ఇక అంతే..

‘‘సీఎం కేసీఆర్‌కు అభివృద్ధి ప్రణాళిక‌ల‌తో పాటు సాహిత్యంపై విశేష అవ‌గాహ‌న ఉంది. తెలంగాణ ప్రభుత్వం క‌ళ‌ల‌కు ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. 500 మంది క‌ళాకారుల‌కు ఉద్యోగాలు ఇవ్వడం దేశంలో ఎక్కడా లేద‌ని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం మొగిల‌య్య 12 మెట్ల కిన్నెర‌ను గుర్తించ‌డం గొప్ప విష‌య‌మ‌ని అన్నారు. ఏ ప్రభుత్వమైతే సాహిత్యానికి, సంగీతానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుందో.. ఆ పాల‌న‌లో మాన‌వ స్వభావం వివేక‌వంతంగా ఉంటుంది.’’ అని గోరెటి వెంక‌న్న ప్రసంగించారు.

Also Read: ‘షేమ్ ఆన్ యూ.. కేటీఆర్! గడీలో బతికే ఆయనే అసలైన సోమరి’ షర్మిల ఘాటు వ్యాఖ్యలు

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 05 Oct 2021 01:37 PM (IST) Tags: minister ktr Hyderabad TS Assembly under ground drinage Strategic nala development program

సంబంధిత కథనాలు

Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ‌మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత

Breaking News Live Updates : తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ ‌మ్యాచ్ ఫిక్సింగ్: ఎమ్మెల్సీ కవిత

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

BegumBazar Honor Killing: పరువుహత్యకు గురైన నీరజ్ పన్వార్ మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి, ఫ్యామిలీకి డెడ్‌బాడీ అప్పగింత

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

Telangana TET Exam : తెలంగాణ టెట్ వాయిదాపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక వ్యాఖ్యలు

CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!

CM KCR Meets Akhilesh Yadav : దిల్లీలో సీఎం కేసీఆర్ తో ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ భేటీ, ప్రత్యామ్నాయ కూటమిపై చర్చ!

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్

Begumbazar Honor Killing : నా అన్నలే హత్య చేశారు, వారిని ఉరితీయాలి - మృతుని భార్య సంజన డిమాండ్
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

Bindu Madhavi: ‘బిగ్ బాస్ తెలుగు’ హిస్టరీలో తొలిసారి - విజేతగా లేడీ కంటెస్టెంట్, బిందు సరికొత్త రికార్డ్

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

YS Jagan Davos Tour: దావోస్‌ చేరుకున్న ఏపీ సీఎం జగన్‌కు ఘన స్వాగతం, రేపు డబ్ల్యూఈఎఫ్‌తో కీలక ఒప్పదం

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

Bigg Boss Telugu: ‘బిగ్ బాస్’ లైవ్ అప్‌డేట్స్: ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ విన్నర్ బిందు మాధవి

KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !

KCR Delhi Schools : తెలంగాణలోనూ ఢిల్లీ విద్యా విధానం - కేజ్రీవాల్‌పై కేసీఆర్ ప్రశంసల జల్లు !