Hyderabad Metro: తెలంగాణ ప్రభుత్వం సంచలనం - మెట్రోలో ఎల్ అండ్ టీ వాటా అంతా కొనాలని నిర్ణయం !
Hyderabad Metro Update: L&T హైదరాబాద్ మెట్రో ఫేజ్-1లో తమ పూర్తి షేర్‌ను రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయించాలని నిర్ణయించింది. రూ. 5,900 కోట్ల ఈక్విటీ విలువ, అప్పుల టెకోవర్ ద్వారా ఈ ప్రక్రియ పూర్తవుతుంది

L and T divest their complete stake in Hyderabad Metro: లార్సెన్ అండ్ టౌబ్రో (L&T) కంపెనీ తన హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్‌లోని ఫేజ్-1లో ఉన్న 90% పైగా షేర్‌ను తెలంగాణ ప్రభుత్వానికి విక్రయించాలని నిర్ణయించింది. ఈ ప్రతిపాదన ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం L&T మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ పై ఉన్న పూర్తి అప్పును టెకోవర్ చేయాలి..అలాగే ఈక్విటీ విలువ కోసం సుమారు రూ. 5,900 కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ డీల్‌తో ఫేజ్-1 మెట్రో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నియంత్రణలోకి వస్తుంది. L&T ఈ నిర్ణయానికి కారణంగా అసలు ఆపరేషనల్ నష్టాలు, కోవిడ్ ప్రభావం, ప్రయాణికుల తగ్గుదల, ఫేజ్-2 విస్తరణ లో పాల్గొనలేకపోవడాన్ని చెప్పింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై చర్చలు జరిపి డీల్ ఫైనల్ చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అతిపెద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) మోడల్‌లో అమలవుతుంది. 2008లో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్‌లో ఫేజ్-1 69.2 కి.మీ. పొడవుతో మూడు కారిడార్లను కవర్ చేస్తుంది . L&T 90% ఈక్విటీ , తెలంగాణ ప్రభుత్వం 10% షేర్ కలిగి ఉంది. ప్రాజెక్ట్ 2017లో ప్రారంభమయింది. కానీ కోవిడ్-19 కారణంగా 169 రోజులు షట్‌డౌన్ అయ్యింది. ప్రయాణికుల సంఖ్య 3.5-3.8 లక్షల నుంచి 5.5 లక్షలకు పెరిగినా, ఆపరేషనల్ నష్టాలు రూ. 5,000 కోట్లకు పైగా చేరాయి. ఫేర్ షేరింగ్, విద్యుత్ చార్జీలు, ల్యాండ్ అక్విజిషన్ వంటి సమస్యలు పెరిగాయి. L&T మే 2025లో యూనియన్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిస్తవం మనోహర్ లాల్ ఖట్టర్‌కు లేఖ రాసి, ఈ సమస్యలను వివరించింది.
#Breaking—-
— @Coreena Enet Suares (@CoreenaSuares2) September 25, 2025
L & T divest their complete stake in Phase 1 metro to the State government. This makes the state government the entity of that metro phase 1.
Telangana government to take over the complete debt of LTMRHL and pay about
Rs.5900 crores for their equity value. pic.twitter.com/NONaDatK5d
తెలంగాణ ప్రభుత్వం మొత్తం ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వకపోవడం వల్ల లిక్విడిటీ సమస్యలు పెరిగాయని ఎల్ అండ్ టీ చెబుతూ వస్తోంది.
ఈ డీల్ పూర్తయితే, ఫేజ్-1 మెట్రో పూర్తిగా రాష్ట్ర సర్కార్ నియంత్రణలోకి వస్తుంది. ఫేజ్-2 విస్తరణ ఎయిర్‌పోర్ట్ కనెక్టివిటీ సహాకు కొత్త SPV ఏర్పాటు అవుతుంది. అయితే, రూ. 5,900 కోట్ల ఈక్విటీ, అప్పుల టేకోవర్ రాష్ట్ర ప్రభుత్వానికి పెను సవాల్ గా మారనుంది.
హైదరాబాద్ మెట్రో విషయంలో ఎల్ అండ్ టీ అనాసక్తంగా ఉండటంతో ఏదో ఓ నిర్ణయం తీసుకోవాలని రేవంత్ భావిస్తున్నారు. ఇటీవల ఎల్ అండ్ టీ .. తమ వల్ల కాదని లేఖ రాయడంతో.. ముఖ్యమంత్రి ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించారు. మెట్రో ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని బదిలీ చేశారు. ఆయన రిటైరై 9 ఏళ్లు అవుతున్నా అదే పోస్టులో ఉన్నారు. ఆయనను సలహాదారుగా నియమించారు. ఇప్పుడు డీల్ ను పూర్తి చేస్తున్నారు.





















