Kavitha Vs KTR: చెల్లెలు రాఖీకి అన్న దూరం! కవితకు అందుబాటులో లేని కేటీఆర్
Kavitha Vs KTR:రాజకీయ విభేదాలతో కవిత, కేటీఆర్ మధ్య దూరం ఏ స్థాయిలో స్పష్టమైంది. రాఖీ కట్టించుకునేందుకు కూడా కేటీఆర్ అందుబాటులో లేరని తెలుస్తోంది.

Kavitha Vs KTR: తెలంగాణలో సంబరంగా రాఖీ వేడుకలు జరుగతున్నాయి. చాలా మంది నేతలకు అక్కచెల్లెమ్మలు రాఖీలు కడుతున్నారు. కానీ యావత్ మీడియా ఆసక్తి మాత్రం ఇద్దరిపై ఉంది. వాళ్లే కేటీఆర్, కవిత. ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నాయని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే కేసీఆర్ కుటుంబంలో అలాంటి విభేదాలకు తావులేదని బీఆర్ఎస్ కవర్ చేస్తూ వచ్చింది. మొన్న కేటీఆర్‌కు సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే శుభాకాంక్షలు చెప్పిన కవిత... రక్షాబంధన్ రోజు రాఖీ కడతారా లేదా అనేది చాలా మందికి అనుమానం. కానీ ఇంత వరకు ఒకరినొకరు విష్ చేసుకోవడం కానీ రాఖీ కట్టించుకున్న ఫొటోలు, వీడియోలు కానీ బయటకు రాలేదు.
కవిత రాఖీకి కేటీఆర్ దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో ఉన్నట్టు సన్నిహితులు చెబుతున్నారు. ఎమ్మెల్యేల అనర్హత కేసుతోపాటు ఎమ్మెల్సీలపై కూడా అనర్హత వేటు వేసేందుకు బీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తుంది. ఆ కేసు విషయంలోనే న్యాయవాదులతో చర్చలు జరపడానికి ఢిల్లీ వెళ్లినట్టు చెబుతున్నారు. ఇది సందర్భం కాదు కదా అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కవిత రాఖీకి కేటీఆర్ కావాలనే దూరంగా ఉన్నారని ఆమె వర్గీయులు ఆరోపిస్తున్నారు.
రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత ఇలా కవితతో కేటీఆర్ రాఖీ కట్టించుకోకపోవడం ఇది సెకండ్ టైం. గతంలో ఆమె జైల్లో ఉన్నప్పుడు కూడా రాఖీ కట్టించుకోలేదు. ఆ సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు. జైల్లో ఉన్న కారణంగా రాఖీ కట్టలేకపోవచ్చేమో కానీ కష్ట సుఖాల్లో వెన్నంటే ఉంటాను అంటూ అప్పట్లో భావోద్వేగమైన ట్వీట్ చేశారు.

ఇప్పుడు హైదరాబాద్‌లో కవిత ఉన్నారు.కేటీఆర్ ఢిల్లీలో ఉన్నారు. రాఖీ కూడా కట్టించుకోలేదు. సాధారణంగా అందరికీ చెప్పినట్టుగానే రాఖీ శుభాకాంక్షలు చెబుతూ కవిత ట్వీట్ చేశారు. కేటీఆర్ మాత్రం ఈ ఉదయం నుంచి ఎక్స్‌లో ఎలాంటి పోస్ట్‌లు చేయలేదు. దీంతో కవిత పోస్టు కింద అభిమానులు చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. కేటీఆర్‌కు రాఖీ కట్టారా లేదా కడతారా అని ప్రశ్నిస్తున్నారు. రాజకీయ విభేదాల నేపథ్యంలో అన్న కేటీఆర్‌కు రాఖీ కడతారా అని గతంలో ఓ మీడియా ఇంటర్వ్యూలో అడిగింతే రాజకీయా రాజీకయాలేనని రాఖీ రాఖీయే అన్నారు. కచ్చితంగా అందుబాటులో ఉంటే కడతానంటూ చెప్పుకొచ్చారు కవిత. కానీ కేటీఆర్ మాత్రం అందుబాటులో లేకుండా ఢిల్లీ వెళ్లిపోయారని కవిత వర్గీయులు చెబుతున్నారు.
అన్నాచెల్లెళ్లు.. అక్కాతమ్ముళ్ల మధ్య అనుబంధానికి ప్రతీకైన రక్షాబంధన్ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు
— Kavitha Kalvakuntla (@RaoKavitha) August 9, 2025
రాఖీ పౌర్ణమి వేడుకను ప్రేమానురాగాలతో, ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను.#RakshaBandhan pic.twitter.com/FVdCrUV09r
చాలా కాలంగా పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని బీఆర్‌ఎస్‌కు దూరంగా ఉంటూ వచ్చారు కవిత. అయితే నేరుగా ఎక్కడా అన్నపై ఎలాంటి ఆరోపణలు చేయలేదు. తనకు పార్టీలో అన్యాయం జరుగుతోందని గళమెత్తారు. ఇప్పటికి కూడా కేసీఆర్ నాయకత్వానికి జై కొడుతున్న కవిత అన్న నాయకత్వంపై నోరు విప్పడం లేదు. దీంతో కవిత, కేటీఆర్ మధ్య దూరం పెరిగిందని గుసగసలు వినిపించాయి. ఇప్పుడు రాఖీ పండగతో అవి గుసగుసలు కాదు నిజమే అనే క్లారిటీ వచ్చిందని అంటున్నారు పొలిటికల్ విశ్లేషకులు.





















