అన్వేషించండి

KTR FIR Case: కేటీఆర్‌పై మరో కేసు నమోదు, వరుస కేసులతో కాంగ్రెస్ వ్యూహం ఫలిస్తుందా?

Telangana News | ఫార్ములా ఈ కారు రేసు కేసులో విచారణకు హాజరైన అనంతరం ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ నిర్వహించారని కేటీఆర్ పై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది.

BRS Leader KTR | హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (KTR)పై మరో కేసు నమోదైంది. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నేత, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌పై మరో కేసు నమోదు చేసింది. రెండు రోజుల కిందట ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ ఆఫీసుకు వెళ్లి విచారణకు హాజరయ్యారు కేటీఆర్. అయితే ఏసీబీ ఆఫీసు నుంచి నగరంలోని బీఆర్ఎస్ ఆఫీసు తెలంగాణ భవన్ వరకు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించడంతో కేటీఆర్ మీద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. 

కేటీఆర్ ర్యాలీపై కేసు నమోదు

ఎలాంటి అనుమతి లేకుండా కేటీఆర్ ర్యాలీ నిర్వహించారని, ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, గెల్లు శ్రీనివాస్, మన్నె గోవర్ధన్, జైసింహ, క్రిశాంక్, తదితరులపై 305, R/W బీఎన్ఎస్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏసీబీ ఆఫీసు నుంచి తెలంగాణ భవన్ వరకు కేటీఆర్ ర్యాలీపై నమోదు చేసిన కేసులో ఏ1గా కేటీఆర్ పేరు చేర్చారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఏసీబీ ఆఫీసు నుంచి వస్తున్న తమ నేతకు వెదురుగా వెళ్లి.. ఆయనతో కలిసి ఫార్టీ కార్యాలయానికి వెళ్లిన తమపై బూటకపు కేసులు పెట్టారంటూ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. 

ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంపై కేటీఆర్ విచారణ ఎదుర్కొంటున్నారు. ఇదివరకే ఏసీబీ, ఈడీ నుంచి ఆయనకు విచారణకు హాజరు కావాలని నోటీసులు వచ్చాయి. ఏసీబీ ఆఫీసుకు విచారణకు వెళ్లగా లాయర్ ను అనుమతించకపోవడంతో కేటీఆర్ అరగంట పాటు వేచిచూసి తిరిగి వెళ్లిపోయారు. తన విచారణలో లాయర్ ను అనుమతించాలన్న కేటీఆర్ పిటిషన్ ను హైకోర్టు విచారించింది. లాయర్ సమక్షంలో కేటీఆర్ ను విచారణ జరిపి, ఆయన స్టేట్‌మెంట్ రికార్డ్ చేయాలని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. దాంతో కేటీఆర్ మరోసారి ఏసీబీ ఆఫీసుకు వెళ్లి విచారణకు హాజరయ్యారు. కానీ తిరిగి వెళ్లే సమయంలో పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేశారంటూ ఆయనపై బంజారాహిల్స్ పీఎస్‌లో కేసు నమోదైంది.

Also Read: Revanth Reddy: వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ - ప్రత్యేక కోటాలో ఇందిరమ్మ ఇండ్లు: సీఎం రేవంత్ రెడ్డి

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Rushikonda Palace Usage: రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం దిశగా అడుగులు; లగ్జరీ హోటల్స్‌గా మార్చే ప్లాన్‌, ప్రజల కోసం సాంస్కృతిక వేదికలు!
రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం దిశగా అడుగులు; లగ్జరీ హోటల్స్‌గా మార్చే ప్లాన్‌, ప్రజల కోసం సాంస్కృతిక వేదికలు!
Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Sivaji Comments : శివాజీ Vs సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ - 'మంగపతి' కామెంట్స్ వివాదానికి చెక్ ఎప్పుడు?
శివాజీ Vs సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ - 'మంగపతి' కామెంట్స్ వివాదానికి చెక్ ఎప్పుడు?
Bangladesh Violence: తారిక్ రెహమాన్ తిరిగి రాకముందే బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ! ఢాకాలో బాంబు పేలుడులో ఒక వ్యక్తి మృతి!
తారిక్ రెహమాన్ తిరిగి రాకముందే బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ! ఢాకాలో బాంబు పేలుడులో ఒక వ్యక్తి మృతి!

వీడియోలు

Rohit Sharma Century Mumbai vs Sikkim | Vijay Hazare Trophy 2025 తొలి మ్యాచ్ లో ముంబై ఘన విజయం | ABP Desam
Vijay Hazare trophy 2025 | విజయ్ హజారే ట్రోఫీలో తొలిరోజే రికార్డుల మోత మోగించిన బిహార్ బ్యాటర్లు
ప్రపంచ రికార్డ్ సృష్టించిన షెఫాలీ వర్మ
టీమిండియా సూపర్ విక్టరీ.. ఐసీసీ ర్యాంకులో దూసుకెళ్లిన దీప్తి
15 ఏళ్ల తర్వాత రోహిత్, కోహ్లీ.. ఫస్ట్ టైం స్టార్లతో నిండిన విజయ్ హజాారే ట్రోఫీ

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rushikonda Palace Usage: రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం దిశగా అడుగులు; లగ్జరీ హోటల్స్‌గా మార్చే ప్లాన్‌, ప్రజల కోసం సాంస్కృతిక వేదికలు!
రుషికొండ ప్యాలెస్‌పై కీలక నిర్ణయం దిశగా అడుగులు; లగ్జరీ హోటల్స్‌గా మార్చే ప్లాన్‌, ప్రజల కోసం సాంస్కృతిక వేదికలు!
Hyderabad New Year Celebrations: హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
హైదరాబాద్‌లో తాగి వాహనం నడిపితే పది వేల రూపాయల జరిమానా, 6 నెలల జైలు శిక్ష;న్యూ ఇయర్ వేడుకలకు రూల్స్‌ 
Sivaji Comments : శివాజీ Vs సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ - 'మంగపతి' కామెంట్స్ వివాదానికి చెక్ ఎప్పుడు?
శివాజీ Vs సింగర్ చిన్మయి, యాంకర్ అనసూయ - 'మంగపతి' కామెంట్స్ వివాదానికి చెక్ ఎప్పుడు?
Bangladesh Violence: తారిక్ రెహమాన్ తిరిగి రాకముందే బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ! ఢాకాలో బాంబు పేలుడులో ఒక వ్యక్తి మృతి!
తారిక్ రెహమాన్ తిరిగి రాకముందే బంగ్లాదేశ్‌లో మళ్లీ హింస ! ఢాకాలో బాంబు పేలుడులో ఒక వ్యక్తి మృతి!
Vijay Hazare Trophy 2025: విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!
విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలో తొలి రోజు 22 సెంచరీలు నమోదు! ఒకే రోజులో పాత రికార్డు బద్దలు!
Atal Bihari Vajpayee: అటల్ బిహారీ వాజ్‌పేయి గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? ఆమె కూతురిని మాజీ ప్రధాని దత్తత తీసుకున్నారా?
అటల్ బిహారీ వాజ్‌పేయి గర్ల్‌ఫ్రెండ్ ఎవరు? ఆమె కూతురిని మాజీ ప్రధాని దత్తత తీసుకున్నారా?
Damaged Kidney Recovery : కిడ్నీ చెడిపోయినా ఆరోగ్యంగా మార్చవచ్చా? తాజా అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
కిడ్నీ చెడిపోయినా ఆరోగ్యంగా మార్చవచ్చా? తాజా అధ్యయనంలో ఇంట్రెస్టింగ్ విషయాలు
Aravalli Mountains:అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
అరవళిలో మైనింగ్‌పై వెనక్కి తగ్గిన కేంద్రం! పర్వత శ్రేణిలో కొత్త లీజులపై పూర్తిగా నిషేధం
Embed widget