By: ABP Desam | Updated at : 16 Jul 2022 12:51 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో గెలిచేది ఎవరు ? ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు ? ఇది చెప్పడానికి జ్యోతిష్కులు కావాలా ఏంటీ ? ఆపార్టీలు, ఆయా నేతలకే తెలుసు. ప్రజల తీర్పు ఏంటో .. సిఎం అయ్యేది ఎవరో రాజకీయనేతలే భవిష్యత్‌ని ఊహించి చెప్పేయగలరు. ఇప్పుడెందుకు ఈ అర్థం పర్థం లేని మాటలు అంటే మంత్రి కెటిఆర్ వ్యాఖ్యలను లోతుగా అర్థం చేసుకున్న కొందరు రాజకీయవిశ్లేషకుల అభిప్రాయం ఇది.
తండ్రి కెసిఆర్ లాగానే కెటిఆర్ కూడా మాంచి మాటకారి. అంతేకాదు ఆ మాటల్లో మర్మంతోపాటు ధీమా కూడా ఉంటుంది. అలా ఇప్పుడు కెటిఆర్ మాటలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. మెయిన్ మీడియా, సోషల్ మీడియాతో ఎప్పుడూ టచ్‌లో ఉండే కెటిఆర్ చిట్ చాట్‌లో భాగంగా ముఖ్యమంత్రి టాపిక్‌పై మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో విజయం టీఆర్‌ఎస్ దేనని, కెసిఆర్ ముచ్చటగా మూడోసారి సిఎం అవ్వడం ఖాయమని చెప్పాడు. ఇప్పటివరకు సౌత్‌లో ఏ నాయకుడు కూడా మూడుసార్లు ముఖ్యమంత్రి అయిన సందర్భాలు లేవు. కాబట్టి తన తండ్రి ఆ రికార్డ్ బద్ధలు కొట్టాలని కెటిఆర్ కోరుకుంటున్నారట.
అయితే జాతీయ రాజకీయాలపై ఆసక్తితో ఉన్న కెసిఆర్ మళ్లీ తెలంగాణ సిఎం పగ్గాలు చేపడతారా? బీజేపీ-మోదీకి చెక్ పెట్టాలన్న కసితో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత రాష్ట్రానికే పరిమితమవుతారా? కెసిఆర్ కోరిక కొడుకు కెటిఆర్‌ని సిఎం చేయాలన్నదే అన్న విపక్షాల ఆరోపణలు నిజం కాదా? టీఆర్‌ఎస్ పార్టీ నేతలు ఇప్పటికే యంగ్ సిఎం కెటిఆర్ అని ప్రభుత్వ వేదికలపైనే చెప్పిన మాటలు తూచ్చేనా ? అంటే కాదంటున్నారు రాజకీయవిశ్లేషకులు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి దళితుడన్న కెసిఆర్ ఆ మాటని నిలబెట్టుకోలేదు. కొత్త రాష్ట్రానికి ఆయనే మొదటి ముఖ్యమంత్రి అయ్యి చరిత్రలో నిలిచాడు. ఇక రానున్న ఎన్నికల్లో సిఎంగా నిలబడేది ఆయనేనని చెబుతున్నారు. అతి కష్టం మీద గెలిస్తే పీఠంపై సిఎం హోదాలో ఉండేది కెసిఆర్ అని చెబుతున్నారు. ఒకవేళ మెజార్టీతో అధికారాన్ని కైవసం చేసుకుంటే పార్టీ చీలకుండా.. వ్యతిరేకత రాకుండా ముందస్తు వ్యూహంతో వ్యవహరించనున్నారట.
వరసగా మూడుసార్లు ముఖ్యమంత్రి రికార్డ్‌ని అందుకొని ఆ తర్వాత ప్లాన్ ప్రకారం కొడుక్కి రాష్ట్రాన్ని అప్పజెప్పి మేనల్లుడు హరీశ్‌తో కలిసి కేంద్రంపై దృష్టి పెడతారని రాజకీయవిశ్లేషకుల అభిప్రాయం. అంతేకాదు వ్యతిరేకత చూపించే నేతలందరినీ అందలాలు ఎక్కించేందుకు కూడా పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నని కెసిఆర్ మాములోడు కాదని అంటున్నారు. ఏదో తిరిగాడు.. కలిశాడు అని కెసిఆర్ పర్యటనలని తేలిగ్గా తీసుకోవద్దంటున్నారు. ఏమీ ఆలోచన చేయకుండా ఉత్తినే తిరిగొస్తాడా అని ప్రశ్నిస్తున్నారు రాజకీయవిశ్లేషకులు. అయితే ఈసారి బీజేపీని ఢీ కొట్టాలంటే హస్తం ఉండాల్సిందే ! మరి తెలంగాణ విషయంలో హ్యాండిచ్చిన కెసిఆర్‌ని ఆ పార్టీ నమ్ముతుందా లేదంటే మరోసారి ఆటలో అరటిపండు అవుతుందా అన్నది భవిష్యత్ తేల్చుతుంది.
BJP Office: బీజేపీ ఆఫీసు ముందు కారు కలకలం, లోపల సూట్‌కేసు - బాంబ్ స్క్వాడ్‌కు కాల్, ఫైనల్‌గా ట్విస్ట్!
Breaking News Live Telugu Updates: తెలంగాణ వ్యాప్తంగా ముగిసిన జాతీయ గీతాలాపన
Hyderabad Traffic: హైదరాబాద్‌లో నేడు భారీగా ట్రాఫిక్ ఆంక్షలు, దారి మళ్లింపు పూర్తి వివరాలు ఇవీ
Hyderabad Metro: నేడు ఈ టైంలో నిలిచిపోనున్న మెట్రో రైళ్లు, ఎక్కడివక్కడే - ఆ తర్వాతే మళ్లీ స్టార్ట్
Governor At Home: అరగంట ఎదురుచూశాం, సీఎం కేసీఆర్ ఎందుకు రాలేదో తెలియదు: తమిళిసై
సంగం బ్యారేజ్ నిర్వహణపై రగడ- పైచేయి కోసం పోటీ పడుతున్న వైసీపీ ఎమ్మెల్యేలు!
బాలీవుడ్ భయపడుతోందా? ‘కార్తికేయ 2’ హిట్‌తో మళ్లీ కలవరం!
Psycho Killer Rambabu: భార్యపై కోపంతో ఆడజాతినే అంతం చేయాలనుకున్నాడు ! విశాఖ సీరియల్ కిల్లర్ అరెస్ట్
JVVD Scheme 2022: జగనన్న విదేశీ విద్యా దీవెనకు దరఖాస్తు చేసుకోండి, చివరితేది ఎప్పుడంటే?