అన్వేషించండి

Kodandaram and Azharuddin Sworn In as MLCs: ఎమ్మెల్సీలుగా కోదండరాం, అజారుద్దీన్ ప్రమాణం.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

Minister Azharuddin | చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్సీ ఫైల్‌పై గవర్నర్ సంతకం చేయడంతో, ఆరు నెలల గడువు ముగిసేలోపే అజారుద్దీన్ మంత్రి పదవీ గండం నుంచి గట్టెక్కారు.

MLC Kodandaram  | హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపికైన ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్‌లు సోమవారం (ఏప్రిల్ 27న)  ప్రమాణస్వీకారం చేశారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వారిద్దరితో ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు రాష్ట్ర మంత్రివర్గ సహచరులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరై నూతన ఎమ్మెల్సీలకు అభినందనలు తెలిపారు. అంతకుముందు, ఆదివారం నాడు గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు వీరి నియామకానికి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.

మైనార్టీల సంక్షేమమే నా లక్ష్యం: ఎమ్మెల్సీ అజారుద్దీన్
ప్రమాణస్వీకారం అనంతరం మంత్రి అజారుద్దీన్ మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రిమండలికి, టీపీసీసీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, వారి అభివృద్ధి కోసం తాను మరింత నిబద్ధతతో కృషి చేస్తానన్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాకుండా, మైనార్టీల సంక్షేమంపై ముఖ్యమంత్రికి ఉన్న చిత్తశుద్ధి వల్లే తనకు ఈ అవకాశం లభించిందని పేర్కొన్నారు. జీవితంలో ఎదురయ్యే ఎత్తుపల్లాలను అధిగమిస్తూ ప్రజాసేవలో ముందుంటానని ఈ సందర్భంగా అజారుద్దీన్ స్పష్టం చేశారు. 

ప్రమాణ స్వీకారం చేసిన తరువాత కోదండరాం మాట్లాడుతూ.. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిలో తాను భాగమై, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానన్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి, పీసీసీకి ధన్యవాదాలు తెలిపారు.

అజారుద్దీన్ మంత్రి పదవి సేఫ్..

తెలంగాణ రాజకీయాల్లో గత కొంతకాలంగా నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. గవర్నర్ కోటా కింద పెండింగ్‌లో ఉన్న 2 ఎమ్మెల్సీ పదవుల నియామక ఫైల్‌పై గవర్నర్ శివ్‌ప్రతాప్ సంతకం చేయడంతో మంత్రి అజారుద్దీన్ పదవీ గండం నుంచి గట్టెక్కారు. గత ఏడాది ఆగస్టు 30న ప్రొఫెసర్ కోదండరాం, మహమ్మద్ అజారుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదన అప్పటి నుండి రాజ్‌భవన్‌లో పెండింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే.

ఈ పరిణామం మంత్రి అజారుద్దీన్‌కు అత్యంత కీలకంగా మారింది. శాసనసభ లేదా శాసనమండలిలో సభ్యత్వం లేకుండానే ఆయనను రాష్ట్ర ప్రభుత్వం మంత్రిగా ప్రమాణం చేయించింది. నిబంధనల ప్రకారం 6 నెలల గడువులోగా ఏదైనా సభలో సభ్యుడిగా ఎన్నికవ్వాల్సి ఉండగా, ఆ గడువు ముగిసే సరిగ్గా కొన్ని రోజుల ముందు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులకు ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది. గవర్నర్ నిర్ణయంతో అటు ప్రభుత్వం, ఇటు అజారుద్దీన్ కు ఊరట లభించింది. దీంతో ఆయన మంత్రి పదవికి ఎదురైన సాంకేతిక అడ్డంకులు తొలగిపోయాయి. 

 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
రాజమండ్రి రూరల్‌ నియోజకవర్గ నేతలతో జగన్‌ సమావేశం
Hyderabad Traffic Chaos: ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
ఐటీ రాజధానిలో ట్రాఫిక్ నరకం - కేబీఆర్ వన్-వే, గచ్చిబౌలి గుంతల రోడ్లు - అలవాటు చేసుకోవాల్సిందేనా?
Ponguleti Srinivas Reddy on 22A Lands: రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
రబ్బరు చెప్పులతో వచ్చి వేల కోట్లు సంపాదించలేదు.. 22ఏ భూముల వివాదంపై పొంగులేటి కీలక వ్యాఖ్యలు
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి

వీడియోలు

Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
LPG to PNG Shift: LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
LPG నుంచి PNGకి మారడానికి ప్రభుత్వం సహాయం! డబ్బు ఆదా చేసే ఈ కొత్త సబ్సిడీ స్కీమ్ గురించి తెలుసా?
NTR Trivikram Movie Title: గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
గాడ్ ఆఫ్ వార్ కాదు... త్రివిక్రమ్ మార్క్ టచ్‌తో మరో క్రేజీ టైటిల్
Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
ప్రభాస్ 'స్పిరిట్' వాయిదా? 'ఫౌజీ'కి నెట్‌ఫ్లిక్స్ డెడ్‌లైన్!?
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Embed widget