అన్వేషించండి

Telangana Census 2027: తెలంగాణలో తొలిసారి జనగణనతో పాటు కులగణన.. నేటి నుంచి వెబ్ పోర్టల్‌లో సెల్ఫ్-ఎన్యుమరేషన్

తెలంగాణలో తొలిసారి కేంద్రం జనగణనతో పాటు కులగణన ప్రక్రియ చేపడుతోంది. నేటి నుంచి రాష్ట్రంలో సెల్ఫ్ ఎన్యుమరేషన్ ప్రక్రియ ప్రారంభం అవుతుందని జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హాళికెరి తెలిపారు.

హైదరాబాద్: తెలంగాణలో జనగణన-2027 ప్రక్రియలో భాగంగా సెల్ఫ్-ఎన్యుమరేషన్ కార్యక్రమం నేడు (ఏప్రిల్ 26న) ప్రారంభం అవుతుంది. మొత్తం రెండు దశలలో జనగణన చేస్తారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్‌లో భాగంగా ఏప్రిల్ 26 నుంచి మే 10వ తేదీ వరకు ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. హైదరాబాద్‌లోని జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జనగణన తెలంగాణ డైరెక్టర్ భారతీ హాళికెరి శనివారం మీడియాకు ఈ వివరాలను వెల్లడించారు. 

రాష్ట్రంలో తొలి జనగణన
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి జనగణన కావడంతో పాటు, ఇది పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జరుగుతున్న తొలి గణన కావడం విశేషం.  స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో తొలిసారిగా కులగణనను కూడా ఈ ప్రక్రియలో భాగంగా చేపడుతున్నారు. ప్రజలు నేరుగా జనగణన ప్రక్రియలో భాగస్వాములు అయ్యి వివరాలు సమర్పించేందుకు సెల్ఫ్-ఎన్యుమరేషన్ ఒక మంచి అవకాశమని భారతీ హాళికెరి పేర్కొన్నారు. ఆసక్తి ఉన్నవారు https://se.census.gov.in వెబ్ పోర్టల్ ద్వారా కేంద్రం చేపడుతున్న జనగణన ప్రక్రియలో పాల్గొని తమ వివరాలను నమోదు చేయవచ్చు.

తెలంగాణ భౌగోళిక పరిధిలోని ప్రతి ఇంటినీ, ప్రతి కుటుంబాన్ని లెక్కిస్తామని భారతీ హాళికెరి తెలిపారు. దేశ వ్యాప్తంగా జనగణన ప్రక్రియ కొన్ని రోజుల కిందట మొదలైందని, షెడ్యూల్ ప్రకారం ఆయా రాష్ట్రాల్లో తొలి విడతలో భాగంగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ జరుగుతుందని పేర్కొన్నారు. నివాసం ఉండే ప్రతి చోటా గణన జరుగుతుందన్న ఆమె... తరువాత మే 11 నుండి జూన్ 9 వరకు ఎన్యుమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి మార్కింగ్ చేస్తారని తెలిపారు. జనగణన రెండో దశలో భాగంగా ఫిబ్రవరి 2027 నుండి వ్యక్తుల వ్యక్తిగత సమాచార సేకరణ ప్రారంభించనున్నారు. ఈలోపు మొదటి దశ సెల్ఫ్ ఎన్యూమరేషన్ తో పాటు ఎన్యుమరేటర్లు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించేడానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేస్తామని ఆమె వివరించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
Nirmal News: నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
నిర్మల్ జిల్లాలో క్లాస్ రూం నుంచి ఏడుపు శబ్ధాలు.. వెళ్లి చూసిన స్థానికులు షాక్
Hyderabad Birthday Celebrations: అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
అర్ధరాత్రి ట్యాంక్‌బండ్‌పై బర్త్‌డే సెలబ్రేషన్స్ వద్దు! ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు: సజ్జనార్
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య
Constable Suicide: టీజీఎస్పీ కానిస్టేబుల్ సూసైడ్, ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్య

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget