Damodara Rao: ఎవరీ దామోదరరావు, టీఆర్‌ఎస్ తరఫున ఎంపీ పదవి ఎందుకు ఇచ్చారు?
అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. డా. బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, దీవకొండ దామోదర్ రావును అభ్యర్థులుగా కేసీఆర్ ఎంపిక చేశారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన దేవరకొండ దామోదరరావుకు రాజ్యసభ సీటు కేటాయించడంపై సొంత జిల్లాలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నమస్తే తెలంగాణ పత్రిక సీఎండీగా వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్న దీవకొండ దామోదరరావు టీటీడీ బోర్డు మెంబర్‌గా కూడా ఉన్నారు. తెలంగాణ తొలిదశ, మలిదశ ఉద్యమాల్లో సీఎం కేసీఆర్‌తోపాటు నడిచిన దీవకొండ దామోదరరావు సీనియారిటీ తగ్గట్టుగా రాజ్యసభ సీటు కేటాయించాలని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి
కుటుంబ, రాజకీయ నేపథ్యం ఇదీ
దామోదర్ రావు జగిత్యాలలోని బుగ్గారం మండలం, మద్నూర్ లో 1958, ఏప్రిల్ 1న జన్మించాడు. తనకి భార్య, ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. 2001లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ప్రారంభమైన నాటినుంటి పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసిన దామోదర్ రావు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడిగా, ప్రధాన కార్యదర్శిగా, పార్టీ సెక్రటరీ-ఫైనాన్స్‌గా వ్యవహరించాడు. తెలంగాణా వాదాన్ని వినిపించాలని కేసీఆర్ బలంగా ఆశిస్తున్న సమయంలో మీడియా వైపు అడుగులు వేశారు. టీ న్యూస్, నమస్తే తెలంగాణ ప్రారంభించి మేనేజింగ్ డైరెక్టర్ గా కొనసాగారు.
2019, సెప్టెంబరు 18న తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా నియమించబడ్డారు.. సౌమ్యుడిగా , వివాదాలకు, ప్రచారానికి దూరంగా ఉంటారనే పేరు రాజకీయ వర్గాల్లో సంపాదించుకున్నారు... అన్ని పార్టీల నాయకులతో సత్సంబంధాలు నెరపడం తనకి పొలిటికల్‌గా ఎలాంటి శత్రువులు లేకుండా చేసింది.
అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. డా. బండి పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), దీవకొండ దామోదర్ రావు లను టీఆర్ఎస్ పార్టీ నుంచి రాజ్యసభ అభ్యర్థులుగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఎంపిక చేశారు. టీఆర్ఎస్ ప్రకటించిన ముగ్గురు రాజ్యసభ అభ్యర్థులలో ఒకరు ఫార్మా దిగ్గజం, మరొకరు గ్రానైట్ వ్యాపారి కాగా, మరొకరు పత్రికా రంగంలో సేవలు అందిస్తున్న వ్యక్తి కావడం విశేషం.
టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులలో ఒకరు దీవకొండ దామోదర్ రావు నమస్తే తెలంగాణ దినపత్రిక ఎండీగా ఉన్నారు. డాక్టర్ బండి పార్థసారథి రెడ్డి ఫార్మా సంస్థ హెటిరో అధిపతి, సంస్థ ఎండీగా సేవలు అందిస్తున్నారు. గ్రానైట్ వ్యాపారి వద్దిరాజు రవిచంద్ర(గాయత్రి రవి) పేర్లను సీఎం కేసీఆర్ వెల్లడించారు.
వైద్య, విద్యా రంగాల్లో పార్థసారథి సేవలు..
బండి పార్థసారథిరెడ్డి స్వస్థలం ఖమ్మం జిల్లా సత్తుపల్లి. వేంసూరు మండలం కందుకూరులో జన్మించిన పార్థసారథి రెడ్డి హెటిరో డ్రగ్స్ వ్యవస్థాపకుడు. ఆయనకు భార్య, ఓ కుమారుడు ఉన్నారు. డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఓ ప్రైవేట్ కంపెనీల్ జాబ్ చేస్తూనే ఫార్మా సంస్థను ఆయన స్థాపించారు. పలు విద్యాసంస్థలు స్థాపించి విద్యావేత్తగానూ రాణిస్తున్నారు. ప్రజలకు ఎంతో కీలకమైన వైద్యం, విద్య రంగాల్లో ఆయన అందిస్తున్న సేవలకు గుర్తింపుగా టీఆర్ఎస్ పార్టీ పార్థసారథిరెడ్డిని రాజ్యసభకు పంపుతోంది.