News
News
X

KCR Discharge: యశోద ఆస్పత్రి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ డిశ్చార్జి, ఫ్యామిలీతో పాటు ప్రగతి భవన్‌కు

KCR in Yashoda Hospital: యశోద వైద్యులు ప్రెస్ మీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. కేసీఆర్‌ ఆస్పత్రిలో ‘డే కేర్ అడ్మిషన్’ తరహాలో ఆస్పత్రిలో కేసీఆర్‌ను అడ్మిట్ చేసుకున్నారు.

FOLLOW US: 

KCR Discharge Discharges from Yashoda Hospital: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అన్ని రకాల వైద్య పరీక్షలు చేశాక అబ్జర్వేషన్‌లో ఉంచిన అనంతరం డాక్టర్లు ఆయన్ను డిశ్చార్జి చేశారు. మధ్నాహ్నం 3 గంటల సమయంలో కేసీఆర్ డిశ్చార్జి అయ్యారు. డిశ్చార్జి సమయంలో ఆయన చేతికి తెలుపు రంగు పట్టీ ఉంది. ఆయనే స్వయంగా నడుచుకుంటూ లిఫ్టు ద్వారా కిందికి వచ్చారు. ఈ సందర్భంగా సీఎం నీరసంగా కనిపించారు. ఫ్యామిలీతో సహా సీఎం ప్రగతి భవన్‌కు వెళ్లారు.

యశోద వైద్యులు ప్రెస్ మీట్‌లో తెలిపిన వివరాల ప్రకారం.. కేసీఆర్‌ ఆస్పత్రిలో ‘డే కేర్ అడ్మిషన్’ తరహాలో ఆస్పత్రిలో కేసీఆర్‌ను అడ్మిట్ చేసుకున్నారు. సాయంత్రం 3 లేదా 4 ప్రాంతంలో డిశ్చార్జి చేస్తామని డాక్టర్లు వెల్లడించారు. కరోనరీ యాంజియోగ్రామ్ చేశారు కాబట్టి 3 - 4 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచామని ఎంవీ రావు వెల్లడించారు.

సీఎం కేసీఆర్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ ఎంవీ రావు మాట్లాడుతూ.. ‘‘నీరసంగా ఉందని ఉదయం 8 గంటల సమయంలో సీఎం నాకు ఫోన్ చేశారు. వెంటనే ఆయన ఇంటికి వెళ్లి పరీక్షించాం. ప్రతి ఏటా టెస్టులు చేస్తుంటాం. అలాగే ఇప్పుడు కూడా రమ్మన్నాం. ప్రివెంటివ్ చెకప్‌లో భాగంగా రక్త పరీక్షలు, కరోనరీ యాంజియోగ్రాం, ఎంఆర్ఐ స్పైన్, ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా చేశాం. యాంజియోగ్రాం చాలా నార్మల్‌గా ఉంది. ఆయనకి కార్డియాక్ ప్రాబ్లం ఏం లేదు. ఎంఆర్ఐ బ్రెయిన్ కూడా నార్మల్‌గా ఉంది. సర్వికైల్ స్పైన్‌లో కొంచెం స్పాండిలోసిస్ ఉంది. ఇది వయసుతో పాటు వస్తుంది. సీఎం గారు ఎప్పుడూ వార్తా పత్రికలు, ఐపాడ్ చూస్తుంటారు.. కాబట్టి, మెడ నొప్పి వల్ల ఎడమ చెయ్యి నొప్పి వచ్చిందని నిర్ధారించాం. న్యూరో ఫిజీషియన్ కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏటా చేసే పరీక్షలన్నింటిలో కూడా ఏ సమస్యా లేదు. 

ఆ రెండూ కంట్రోల్ చేసుకోవాలని సూచించాం
సీఎంకు బీపీ, షుగర్ ఉన్నాయి. అవి నార్మల్‌గానే ఉన్నాయి. మిగతా పరీక్షల రిపోర్ట్స్ రావాల్సి ఉంది. సీఎం గారి రక్త పరీక్షల్లో భాగంగా హిమోగ్లోబిన్ శాతం, మూత్రపిండాల పనితీరు, కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్ని బాగున్నాయి. బీపీ, షుగర్ కొంచెం కంట్రోల్ చేసుకోమని చెప్పాం. నీరసానికి కారణం ఏంటంటే.. ఈ మధ్య బిజీగా గడుపుతున్నారు. కాస్త విశ్రాంతి అవసరమని చెప్పాం. వారానికి ఒకసారి రక్త పరీక్షలు చేసి షుగర్ లెవెల్స్ చెక్ చేస్తుంటాం. వచ్చే ఏడాది చేసే పరీక్షలు యథాతథంగా చేస్తాం.’’ అని అన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం గురించి యశోద ఆస్పత్రి వైద్యులు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ మేరకు సీఎం హెల్త్ పై అధికారికంగా ప్రకటన చేశారు. చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ విషు రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సీఎం గారు రెండ్రోజుల నుంచి నీరసంగా ఉన్నారు. ఈరోజు ఉదయం నుంచి ఎడమ చేయి కాస్త లాగుతుందని అన్నారు. దీంతో మేం హాస్పిటల్‌కి రావాలని సూచించారు. డాక్టర్ ఎంవీ రావు, చీఫ్ కార్డియాలజిస్ట్ ప్రమోద్ గారు చూసుకుంటున్నారు’’ అన్నారు.

డాక్టర్ ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ.. ‘‘సీఎం గారు మాకు ఫోన్ చేయగానే, మేం ఆయన ఇంటికి వెళ్లి ప్రాథమిక పరీక్షలు చేశాం. ఆయనకు ఆస్పత్రికి వచ్చి యాంజియోగ్రామ్ చేయాలని సూచించాం. లక్కీగా గుండెలోని రక్త నాళాల్లో ఎలాంటి బ్లాక్స్ గానీ, సమస్యలు గానీ లేవు. ఎడమ చేయ్యి ఎందుకు లాగుతుందని ఇతర పరీక్షలు కూడా చేశాం. మెదడుకు సంబంధించి ఏవైనా సమస్యలు కూడా ఉన్నాయేమో పరిశీలించాం. అన్ని పరీక్షలు చేసి మా డాక్టర్లమంతా కూర్చొని మాట్లాడుకొని ఫైనల్ కంక్లూజన్‌కి వచ్చాం.’’ అని ప్రమోద్ కుమార్ అన్నారు.

Published at : 11 Mar 2022 03:20 PM (IST) Tags: Yashoda doctors on KCR Health Yashoda Hospital doctors press meet KCR Health official statement KCR Health Bulletin KCR Discharge Yashoda Hospital

సంబంధిత కథనాలు

Hyderabad: హైదరాబాద్‌ రోడ్లపై కొత్త ట్రాఫిక్ రూల్స్! ఉల్లంఘిస్తే అక్కడికక్కడే రూ.వెయ్యి ఫైన్ వసూలు

Hyderabad: హైదరాబాద్‌ రోడ్లపై కొత్త ట్రాఫిక్ రూల్స్! ఉల్లంఘిస్తే అక్కడికక్కడే రూ.వెయ్యి ఫైన్ వసూలు

Hyderabad Traffic: నేడు హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు, ఈ టైంలో ఆ చుట్టుపక్కలకు వెళ్లొద్దు!

Hyderabad Traffic: నేడు హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ ఆంక్షలు, ఈ టైంలో ఆ చుట్టుపక్కలకు వెళ్లొద్దు!

తెలంగాణలో 13 రోజులపాటు రాహుల్ భారత్ జోడో యాత్ర, పూర్తి షెడ్యూల్ ఇదే

తెలంగాణలో 13 రోజులపాటు రాహుల్ భారత్ జోడో యాత్ర, పూర్తి షెడ్యూల్ ఇదే

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా

Weather Updates: ఏపీలో 2 రోజులపాటు భారీ వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా

Swachh Bharat Gramin : స్వచ్ఛ భారత్ గ్రామీణ్ లో తెలంగాణ నంబర్ 1, దిల్లీలో అవార్డు అందుకున్న మిషన్ భగీరథ టీమ్

Swachh Bharat Gramin : స్వచ్ఛ భారత్ గ్రామీణ్ లో తెలంగాణ నంబర్ 1, దిల్లీలో అవార్డు అందుకున్న మిషన్ భగీరథ టీమ్

టాప్ స్టోరీస్

AP BJP : ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

AP BJP :  ట్రాక్ మార్చిన ఏపీ బీజేపీ - ఇక ఊపందుకుంటుందా ?

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Karimnagar: తెలుగు సినిమాల్లా తెలుగు పార్టీ, పాన్ ఇండియాలో దుమ్ము లేపే రోజు దగ్గర్లోనే - కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

MLA Kotamreddy: ఆ సెంటిమెంట్ ని గౌరవిస్తా, అందుకే అలా చేశా: నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!

Mrunal Thakur: ఆ సమయంలో చనిపోవాలనుకున్న మృణాల్‌ - ‘సీతారామం’ సక్సెస్ వరకు ‘సీత’ పడిన కష్టాలెన్నో!