KTR Meets KCR: ఎర్రవల్లి ఫాంహౌస్‌లో కేటీఆర్, హరీష్ రావులతో కేసీఆర్ కీలక భేటీ.. జూబ్లీహిల్స్ ఎన్నికపై చర్చ
KCR Farmhouse at Erravelli | సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్ లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. కేటీఆర్, హరీష్ రావులతో సమావేశం అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో స్థానిక ఎన్నికలపై చర్చిస్తున్నారు.

BRS Chief KCR on Jubilee hills By Election | సిద్దిపేట: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిపక్ష బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సిట్టింగ్ స్థానాన్ని నిలుపుకుని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఇదే ఫలితాన్ని కోరుకుంటున్నారని నిరూపించాలని భారత రాష్ట్ర సమితి భావిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలు ఎర్రవెళ్లి ఫాంహౌస్ లో సమావేశం అయ్యారు. కేసీఆర్ పిలుపుతో కేటీఆర్, హరీష్ రావు ఎర్రవల్లి ఫాం హౌస్ కు వెళ్లి భేటీ అయ్యారు.
జూబ్లీహిల్స్ లో మళ్లీ బీఆర్ఎస్.. అదే కేసీఆర్ అజెండా..
జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో రోడ్ షో లు, ప్రచార వ్యూహం పై డిస్కషన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో తాజా రాజకీయ అంశాలు, వాటిని తమకు అనుకూల ప్రచారంతో దూసుకెళ్లాలని బీఆర్ఎస్ అగ్రనేతలు చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై ఎలా ముందుకెళ్లాలని సైతం కేటీఆర్, హరీష్ రావులతో కేసీఆర్ చర్చించే అవకాశం ఉంది. రేపు ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జ్ లతో కేసీఆర్ మీటింగ్ ఉంది. జూబ్లీహిల్స్ ప్రచార వ్యూహాలపై బీఆర్ఎస్ ఇన్చార్జిలకు కెసిఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. కూడా చర్చించనున్నట్లు సమాచారం.
నామినేషన్లకు ముగిసిన గడువు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన నామినేషన్ల దాఖలు గడువు అక్టోబర్ 21న ముగిసింది. ఇటీవల మృతిచెందిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య మాగంగి సునీతకు బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఆమె నామినేషన్ వేసిన సమయంలో కీలక నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. కేటీఆర్, హరీష్ రావులు ఈ స్థానాన్ని బీఆర్ఎస్ కచ్చితంగా నెగ్గుతుందని ధీమాగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతతో పాటు ఆమె కూతురు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని పలు ఏరియాలలో ప్రచారం చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో నగరంలో చేసిన కూల్చివేతలను, ప్రజల సమస్యలను వివరించాలని గులాబీ బాస్ దిశా నిర్దేశం చేస్తున్నారు. నగరంలో రూ.4000 పింఛన్ ఇవ్వకపోవడం, నగరంలో ట్రాఫిక్ సమస్య, యువతకు ఉద్యోగాల హామీ నెరవేరలేదంటూ పలు హామీలు పెండింగ్ లపై బాకీ కార్డు ఉద్యమాన్ని తీవ్రం చేసి ప్రచారం చేయాలని పార్టీ నేతలు చర్చిస్తున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ బి..
ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో నెగ్గి, సిట్టింగ్ సీటు కాపాడుకోవాలని చూస్తున్న బీఆర్ఎస్ ప్లాన్ బీ తో రెడీగా ఉంది. మాగంటి సునీతతో పాటు దివంగత నేత పీజేఆర్ తనయుడు పి. విష్ణువర్ధన్ రెడ్డితో సైతం నామినేషన్ వేయించింది. ఒకవేళ సునీత దాఖలు చేసిన నామినేషన్లు రిజెక్ట్ అయితే విష్ణువర్ధన్ రెడ్డిని తమ అభ్యర్థిగా గెలిపించుకోవాలని సైతం ప్లాన్ చేశారు. గతంలో ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవంతో పాటు తండ్రి పీజేఆర్ నియోజకవర్గానికి చేసిన పనులను వివరించనున్నారు.






















