Jeedimetla Fire Accident: జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం, వర్షాల ఎఫెక్ట్‌తో పేలిన రియాక్టర్
Jeedimetla Fire Accident: జీడిమెట్ల పారిశ్రామికవాడలోని విశిష్ట ల్యాబ్ లో ఉన్న రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
మేడ్చల్ జిల్లా: జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విశిష్ట ల్యాబ్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలో ఆ ప్రాంతాన్ని దట్టమైన పొగలు కమ్మేశాయి. ఇది గమనించిన సిబ్బంది పోలీసులు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడికి చేరుకుని మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. భారీగా ఆస్తి నష్టం సంభవించింది.
జీడిమెట్ల పారిశ్రామికవాడలోని విశిష్ట ల్యాబ్ లో ఉన్న రియాక్టర్ పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. రియాక్టర్స్ వద్ద జరిపే కెమికల్స్ చర్యలో భాగంగా వర్షాలకి చిన్న మెరుపు లాంటిది వచ్చి, అగ్ని ప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. సిబ్బంది, స్థానికులు పోలీసులు, అగ్నిమాపక శాఖకు అగ్ని ప్రమాదంపై సమాచారం అందించారు. రెండు ఫైర్ ఇంజన్స్ తో పాటు, ఒక డిజాస్టర్ వెహికల్, ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ సహయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. కానీ రియాక్టర్ పేలుడుతో పెద్ద ఎత్తున ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.