By: ABP Desam | Updated at : 09 Apr 2023 01:14 PM (IST)
Edited By: jyothi
హైదరాబాద్ లో ఐపీఎల్ మ్యాచ్ - అర్ధరాత్రి కూడా పరుగులు పెట్టనున్న మెట్రో!
IPL 2023 in Hyderabad: హైదరాబాద్ ఉప్పల్ వేధికగా ఈరోజు ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో నేడు సాయంత్రం 7.30 గంటలకు హైదరాబాద్ - పంజాబ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలోనే మెట్రో రైలు సేవలను పొడగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాత్రి 12.30 గంటలకు చివరి రైలు నడవనుందని వివరించారు. ఉప్పల్ స్టేడియం స్టేషన్ నుంచి మాత్రమే ఈ అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. రాత్రి 12.30 గంటల తర్వాత మిగతా స్టేషన్లలో ప్రయాణికులు బయటకు వచ్చేందుకు మాత్రమే అనుమతిస్తారు. మ్యాచ్ కు రెండు గంటల ముందు నుంచి ఉప్పల్ కు ఎక్కువ సర్వీసులు తిరుగుతాయని మెట్రో రైలు అధికారులు చెప్పారు. రెండు వరుస మ్యాచ్ లలో ఓడిన హైదరాబాద్ ఈ సీజన్ లో గెలిచేందు కోసం ఎదురు చూస్తుంది. మరోవైపు అన్ని విభాగాల్లోనూ పటిష్టంగా ఉన్న పంజాబ్ ఆడిన రెండు మ్యాల్ లలోనూ విజయాలతో ఉత్సాహంగా ఉంది.
మరోవైపు ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ట్రాఫిక్ పోలీసులు
హైదరాబాద్ వేధికగా ఈరోజు ఐపీఎల్ జరుగుతోంది. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో ఈరోజు సాయంత్రం సన్ రైజర్స్ -హంజాబ్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఇరు జట్ల మధ్య రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఇరు జట్లు నగరానికి చేరుకొని ప్రాక్టీస్ చేస్తున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అయ్యే మ్యాచ్ రాత్రి 11.30 గంటల వరకు కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. పలు మార్గాల్లో మధ్యాహ్నం నుంచి ట్రాఫిక్ ను మళ్లించనున్నారు. ప్రధానంగా వరంగల్ రహదారిపై వచ్చే వాహనాలను చెంగిచర్ల చౌరస్తా నుంచి చర్లపల్లి ఎన్ఎఫ్సీ వైపు మళ్లిస్తున్నారు. అలాగే ఎల్బీ నగర్ నుంచి వచ్చే వాహనాలను నాచారం ఐడీఏ మీదుగా చర్లపల్లి వైపు మళ్లించనున్నారు. ఇప్పటికే స్టేడియం పరిసరాల్లో పోలీసులు పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు.
క్షుణ్ణంగా తనిఖీ చేసి తర్వాత స్టేడియంలో అనుమతి
ఉప్పల్ స్టేడియంలోకి వచ్చే వారు తమ వెంట ఎలాంటి వస్తువులు తీసుకు రావొద్దని పోలీసు అధికారులు సూచిస్తున్నారు. మ్యాచ్ వీక్షించేందుకు వచ్చే ప్రేక్షకులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత స్టేడియంలోకి అనుమతించనున్నారు. క్రికెట్ అభిమానులకు ఎలాంటి సౌకర్యం కల్గకుండా బందోబస్తు అందిస్తున్నామని రాచకొండ సీపీ చౌహాన్ తెలిపారు. స్టేడియం చుట్టూ అదనపు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు సీపీ చౌహాన్ వివరించారు. పార్కింగ్ కోసం గతంలో మాదిరిగానే ఏర్పాట్లు చేశామని తెలిపాడు. బ్లాక్ టికెట్ల విక్రయాన్ని అరికట్టేందుకు స్టేడియం పరిసరాల్లో పోలీసులు మఫ్టీలో తిరుగుతున్నారు. అదే విధఁగా బ్లాక్ లో టికెట్లు అమ్మితే కఠినంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. టికెట్ల పంపిీ పారదర్శకంగా జరుగుతుందని వివరించారు. ప్రేక్షకులు ఎలాంటి వదంతులను నమ్మవద్దన్నారు. అదే విధంగా ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులను పెంచింది అలాగే మెట్రో సర్వీసులను కూడా పొడగించారు. ఈ క్రమంలోనే అర్ధరాత్రి 12.30 గంటలకు చివరి రైలు నడుపుతున్నట్లు ప్రకటించింది.
మార్గదర్శి కేసులో ప్రభుత్వం దూకుడు- ఆస్తులు అటాచ్ చేసేందుకు సీఐడీకీ అనుమతి
Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!
TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్
Andhra Politics : వైఎస్ఆర్‌సీపీని విమర్శించి అంతకు మించి ఉచిత హామీలు - చంద్రబాబు నిధులెక్కడి నుంచి తెస్తారు ?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
MS Dhoni: ఆ విషయంలో తను, నేను సేమ్ టు సేమ్ - రాయుడు గురించి ధోని ఏమన్నాడంటే?
4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం