News
News
X

Hyderabad IT Raids: RS బ్రదర్స్ సహా వివిధ షాపుల్లో ఐటీ దాడులు, హైదరాబాద్‌లోనే ఆరు చోట్ల ఐటీ సోదాలు

IT Raids on RS Brothers: హైదరాబాద్ లోని ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్స్ లోని ఆరు బ్రాంచీలపై ఆదాయ పన్ను శాఖ దాడులు చేసింది.

FOLLOW US: 
 
IT Raids on RS Brothers: హైదరాబాద్ లోని పలు చోట్ల ఆదాయ పన్ను శాఖ (ఐటీ) దాడులు చేపట్టింది. ఆర్ఎస్ బ్రదర్స్ షాపింగ్ మాల్ బ్రాంచ్ లతో పాటు మరికొన్ని సంస్థలపై ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఏఖ కాలంలో 15కు పైగా బృందాలు భాగ్య నగరంలో దాడులు చేస్తున్నారు. అయితే ఆర్ఎస్ బ్రదర్స్ తో పాటు మరో రెండు స్థిరాస్తి సంసథల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఆర్ఎస్ బ్రదర్స్ లోని ఆరు బ్రాంచీలు, ఇళ్లలో అధికారులు సోదాలు చేశారు. 

అయితే ఇటీవల కాలంలోనే ఆర్ ఎస్ బ్రదర్స్ రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టింది. హానర్స్ రియల్ ఇన్ఫ్రా  పేరు తో వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. అయితే ఈ హానర్స్ సంస్థ వాసవి తోపాటు పలు ప్రాజెక్టులు చేపట్టింది. కూకట్ పల్లిలలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లో కూడా ఈ సంస్థ జోక్యం చేసుకుంది. వాసవి, సుమధురతో కలిసి కూడా ఆర్ఎస్ బ్రదర్స్ వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే హానర్స్, సుమధుర, వాసవి, పరంపర, ఆర్ఎస్ బ్రదర్స్ కార్యాలయాలపై ఐటీ దాడులు చేస్తోంది. 

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కూడా..

ఉదయం 9 గంటల నుండీ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో కూడా ఐటీ దాడులు కనసాగుతున్నాయి. అయితే లోపల ఉన్న సిబ్బందిని బయటకు రానీయకుండా, బయట ఉన్న సిబ్బందిని లోపలికి వెళ్లనివ్వకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అలాగే షాపింగ్ మాల్ లో ఉన్న ఉద్యోగులందరి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే పలు హార్డ్ డిస్క్ లు, బ్యాంక్ ఖాతాల ను పరిశీలిస్తున్నారు. అదే కాకుండా కూకట్ పల్లిలోలని లాట్ మెబైల్స్ లో కూడా సోదాలు జరుగుతున్నాయి.

News Reels

వరుగా తెలంగాణలో ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలపై దాడులు 

తెలంగాణలో రియల్ ఎస్టేట్ కంపెనీలపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. భారీ భవనాల నిర్మాణంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఫీనిక్స్ కంపెనీపై ఐటీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. నానక్ రామ్ గూడ, గోల్ఫ్ ఎడ్జ్ , మాదాపూర్ లోని ఫీనిక్స్ ఐటీ సెజ్ లలో ఉన్న ఫీనిక్స్ కార్యాలయాల్లో తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. దాదాపు నాలుగు గంటల పాటు సోదాలు కొనసాగాయి. ముంబై నుంచి వచ్చిన 8 మంది ఐటీ అధికారుల బృందం విస్తృత సోదాలు చేసి, పలు కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుంది. పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. కంపెనీకి చెందిన మొత్తం 20 చోట్ల ఐటీ రైడ్స్ జరిగాయి.

ఫోనిక్స్ గ్రూపు కార్యాలయాలు, యజమానుల ఇళ్లల్లో ఐటీ సోదాలు

సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, డైరెక్టర్ల ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు చేశారు. ఫీనిక్స్ సంస్థ రియల్ ఎస్టేట్ వెంచర్స్, రియల్ ఎస్టేట్ ఇన్ ఫ్రా సహా వివిధ రంగాల్లో హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. లాక్ బుక్స్ నిర్వహణకు సంబంధించిన వివరాలను కంపెనీ అధికారుల నుంచి ఐటీ అధికారులు సేకరించారు. వివిధ ప్రాజెక్టుల పేరిట తీసుకున్న లోన్స్.. ఆయా ప్రాజెక్టులకే ఖర్చు పెట్టారా ? ఇతర కార్యకలాపాలకు దారిమళ్లించారా? అనే కోణంలో వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. సోదాలన్నీ పూర్తయిన తర్వాత అధికారిక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని భావిస్తున్నారు. 

Published at : 14 Oct 2022 01:30 PM (IST) Tags: Hyderabad News Telangana News IT Raids on RS Brothers IT Raids in Telangana IT Raids in Hyderabad

సంబంధిత కథనాలు

Weather Latest Update:  ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Weather Latest Update: ముంచుకొస్తున్న మాండస్ తుపాను, ఏపీకి వర్షసూచన!

Gold ATM : ఈ ఏటీఎంలో బంగారం వస్తుంది, దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో!

Gold ATM : ఈ ఏటీఎంలో బంగారం వస్తుంది, దేశంలోనే తొలి గోల్డ్ ఏటీఎం హైదరాబాద్ లో!

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Gold-Silver Price 04 December 2022: చెన్నైలో ₹55 వేలకు చేరువగా స్వర్ణం, దానితో పోలిస్తే హైదరాబాద్‌లోనే రేటు తక్కువ

Petrol-Diesel Price, 04 December 2022: భారీగా పతనమైన గ్లోబల్‌ క్రూడ్‌ రేటు - మీ ఏరియాలో లీటరు పెట్రోలు ధర ఇదీ!

Petrol-Diesel Price, 04 December 2022: భారీగా పతనమైన గ్లోబల్‌ క్రూడ్‌ రేటు - మీ ఏరియాలో లీటరు పెట్రోలు ధర ఇదీ!

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్

Hyderabad Crime: గంజాయి మత్తులో యువతీ యువకులు, పోలీసుల ఎంట్రీతో బర్త్‌డే పార్టీలో సీన్ రివర్స్

టాప్ స్టోరీస్

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

YS Jagan: త్వరలో పార్టీ ఎమ్మెల్యేలతో జగన్ భేటీ - హాట్ టాపిక్‌గా ఎవరికి టికెట్లు, ఎవరికి ఇక్కట్లు !

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

YS Sharmila Padayatra: వైఎస్ షర్మిలకు వరంగల్ పోలీసులు షాక్, పాదయాత్రకు బ్రేక్!

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Bigg Boss 6 Telugu:ఈ సీజన్లో బెస్ట్ కెప్టెన్ ఎవరు? వరస్ట్ కెప్టెన్ ఎవరు? - ఇక ఆపెయ్ ఆదిరెడ్డి, నాగార్జున వేడుకోలు

Horoscope Today 4th December 2022: ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు

Horoscope Today 4th  December 2022:  ఈ రాశివారు మనసులో మాట బయటపెట్టొద్దు అది మీకు సమస్యగా మారుతుంది, డిసెంబరు 4 రాశిఫలాలు