అన్వేషించండి

Hyderbad: మూసీపాలవుతున్న తాగునీరు…చోద్యం చూస్తోన్న జలమండలి అధికారులు

సరిపడా తాగునీరు లేనప్పుడు…నీటి కొరత తీర్చే మార్గాలు అన్వేషిస్తారు అధికారులు. జలాశయాలు పొంగిపొర్లుతున్నప్పుడు ఆ నీటిని వృధాగా వదిలేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతున్నది ఇదే…

 

భాగ్యనగర జంట జలాశయాలు నీటితో తొణికిసలాడుతున్నాయి. ఉస్మాన్ సాగర్ , హిమాయత్ సాగర్‌లకు భారీగా వరద వచ్చి చేరుతోంది. భారీ వర్షాలు.. వరద నీటి ప్రవాహంతో హిమాయత్ సాగర్ నిండు కుండలా మారింది. అయితే ఉస్మాన్‌సాగర్‌,  హిమాయత్‌సాగర్‌ నుంచి నగరానికి నీటిని తరలించడానికి ప్రతి వెయ్యి లీటర్లకు 10 రూపాయల లోపే ఖర్చవుతుంది. అదే కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల నుంచి హైదరాబాద్‌కు తెచ్చేందుకు అయ్యే ఖర్చు ప్రతి వెయ్యి లీటర్లకు 50 రూపాయలు. ఇందులో ఏది మెరుగు అంటే…ఎవ్వరైనా మొదటి ఆప్షనే చెబుతారు. కానీ జలమండలి అధికారులకు మాత్రం ఇది పట్టడం లేదు. వేల క్యూసెక్కుల నీరు మూసీపాలవుతున్నా చోద్యం చూస్తున్నారు.


Hyderbad: మూసీపాలవుతున్న తాగునీరు…చోద్యం చూస్తోన్న జలమండలి అధికారులు

కృష్ణా, గోదావరి ప్రాజెక్టులు రాకముందు హైదరాబాద్ వాసులకు జంట జలాశయాలే దిక్కు. ఉస్మాన్‌సాగర్‌ నుంచి 25 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్‌ నుంచి 15 ఎంజీడీలు నిత్యం తరలించేవారు. జనాభా పెరగడంతో నీరు సరిపోక కృష్ణా మూడు దశలు, గోదావరి ప్రాజెక్టు చేపట్టారు. నగరానికి 200 కిలోమీటర్ల నుంచి మూడు దశల పంపింగ్‌తో కృష్ణా నుంచి 270 ఎంజీడీలు, గోదావరి నుంచి 172 ఎంజీడీలు తీసుకొస్తున్నారు. కొన్ని రోజులుగా వానలు పడుతుండటంతో జంట జలాశయాలు పొంగిపొర్లుతున్నాయి. ఈ రెండు గరిష్ఠ నీటిమట్టాలకు చేరుకోవడంతో గేట్లు ఎత్తి మూసీలోకి విడిచిపెడుతున్నారు.


Hyderbad: మూసీపాలవుతున్న తాగునీరు…చోద్యం చూస్తోన్న జలమండలి అధికారులు

వాస్తవానికి మూసీలోకి వదులుతున్న నీటిని తాగునీటి అవసరాలకు కూడా వాడుకునే వీలు ఉంది. ఇందుకోసం పక్కా వ్యవస్థ అందుబాటులో ఉంది. కానీ జలమండలి వర్గాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. గతంలోనూ ఇదే పరిస్థితి. అప్పట్లో వానలు లేవు. భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం భారీగా వరద వస్తున్నా…అందుబాటులో ఉన్న నీటిని వినియోగించుకోకుండా..ఇప్పటికీ  కృష్ణా, గోదావరి జలాలపైనే ఆధారపడుతుండటం విమర్శలకు తావిస్తోంది.


Hyderbad: మూసీపాలవుతున్న తాగునీరు…చోద్యం చూస్తోన్న జలమండలి అధికారులు

మూడు నాలుగు రోజులుగా వానలు తగ్గడంతో  హిమాయత్‌సాగర్‌, ఉస్మాన్‌సాగర్‌లకు వరదనీటి ఉద్ధృతి తగ్గింది.  వరద ఉధృతి కొనసాగినప్పుడు గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు వదిలిపెట్టిన అధికారులు… వానలు తగ్గాక  ఉన్నతాధికారుల సూచనల మేరకు రెండు జలాశయాల గేట్లు మూసేశారు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో.. హైదరాబాద్ లోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ జలాశయాలకు వరద నీరు తగ్గుముఖం పట్టింది. వరద ప్రవాహం తగ్గడంతో జంట జలాశయాల గేట్లు మూసివేశారు. ఇప్పటి వరకు హిమాయత్ సాగర్ లోకి 1200 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ఐదు గేట్లు ఎత్తి.. 1715 క్యూసెక్కుల నీటిని మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్ గరిష్ట నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుతం 1762.25 అడుగుల వరకు నీరు నిలిచి ఉంది. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ లోకి 400 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుతం 1785.80 అడుగులకు నీరు చేరింది.

టాప్ హెడ్ లైన్స్

MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
CM Revanth Reddy US Visit: రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
రేవంత్ రెడ్డి అమెరికా టూర్ పర్మిషన్ నిరాకరణపై కారణం తెలిపిన తెలిపిన విదేశాంగ శాఖ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
Supreme Court: రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ
రాయదుర్గం భూముల వేలానికి లైన్ క్లియర్... స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరణ

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
MP Lingamaneni Ramesh: రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
రోడ్డు ప్రమాదంలో యువతి మృతిపై జనసేన ఎంపీ లింగమనేని రమేష్ తీవ్ర విచారం
Rahul Gandhi: పట్టువదలని రాహుల్ గాంధీ.. ఎట్టకేలకు FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
రాహుల్ గాంధీ తగ్గేదేలే.. పెల్లెట్ గన్ వినియోగంపై FIR నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు, ఆందోళన విరమణ
Rayadurgam Land Auction: రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
రాయదుర్గం భూములకు రికార్డు ధర.. TGIIC వేలంలో రూ.264 కోట్లు పలికిన ఎకరా భూమి
NO BPL This Year:  పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
పాపం బంగ్లా.. న‌ష్టాల‌తో బీపీఎల్ ర‌ద్దు.. టీమిండియా టూర్ పైనే గంపెడాశలు..
Viral News: ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
ఆత్మహత్యకు యత్నించిన కొడుకుని కాపాడబోయి కొండపై నుంచి పడి తండ్రి, దూకేసి తల్లి సైతం మృతి
Janasena Politics: స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల కోసం 14 మందితో జనసేన కమిటీ నియమించిన పవన్ కళ్యాణ్
Foods To Reduce Stress : ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
ఒత్తిడి, ఆందోళన ఎక్కువగా ఉందా? అయితే ఈ ఫుడ్స్ తినేయండి.. బెటర్​గా ఫీల్ అవుతారు
Nellore Viral Video: తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
తండ్రి నిర్వాకాన్ని పోలీసుల ఎదుట బయటపెట్టిన కొడుకు నిజాయితీ.. వీడియో వైరల్
Embed widget