By: ABP Desam | Updated at : 17 Mar 2022 06:50 AM (IST)
హైదరాబాద్ వాసులకు పోలీసులు ఝలక్
హోలీ వేడుకలపై హైదరాబాద్‌లో నగర పోలీసులు ఆంక్షలు విధించారు. రాజధాని పరిధిలో రేపు ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 వరకూ మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు మూసివేయాలని ఆదేశించారు.
బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై అనుమతి లేదని.. సంబంధం లేని వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయద్దని స్ట్రిక్ట్‌గా వార్నింగ్ ఇస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
హోలీ పేరుతో ఎలాంటి దుశ్చర్యలు జరగకుండా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. అందుకే 48 గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు నోటిఫికేషన్ విడుదల చేశారు.
హోలీ సందర్భంగా వాహనాలపై రోడ్లపై ఇష్టారాజ్యంగా తిరగొద్దని... పోకిరీ వేషాలు వేస్తే చర్యలు తప్పవంటున్నారు హైదరాబాద్ పోలీసులు. ఈ ఆంక్షలు మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో ఉంటాయన్నారు.
రెండు రోజుల పాటు మందుషాపులు బంద్ అవుతున్నాయని తెలిసిన వెంటనే హైదరాబాద్ వాసులు లిక్కర్ కోసం క్యూ కట్టారు. వైన్‌షాపులు, బార్ల ముందు బార్లు తీరారు. దీంతో లిక్కర్ షాపులన్నీ మందుబాబులతో కిటకిటలాడిపోయాయి.
Breaking News Live Updates : కాంగ్రెస్ లో చేరిన మంచిర్యాల జిల్లా పరిషత్ చైర్మన్
Hyderabad news : ప్రియుడితో భార్య రాసలీలలు, రెడ్ హ్యాండడ్ గా పట్టుకున్న భర్త
Hyderabad News : హైదరాబాద్ లో ఆటోలు, క్యాబ్ లు, లారీలు బంద్, కొత్త మోటార్ వాహనాల చట్టం రద్దుకు డిమాండ్
Minister KTR UK Tour : తొలి రోజు యూకే పర్యటనలో మంత్రి కేటీఆర్ బిజీబీజీ, పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ
Petrol Diesel Price 19th May 2022 : తెలుగు రాష్ట్రాలో నిలకడగా పెట్రోల్,డీజిల్ ధరలు, ఇవాళ్టి ఇంధన ధరలు ఇలా ఉన్నాయి
IPL 2022: ఐపీఎల్ 2022 మెగా ఫైనల్ టైమింగ్‌లో మార్పు! ఈ సారి బాలీవుడ్ తారలతో..
Navjot Singh Sidhu: సిద్ధూకు ఏడాది జైలు శిక్ష- 34 ఏళ్ల క్రితం కేసులో సుప్రీం తీర్పు
TRS ZP Chairman In Congress : కాంగ్రెస్‌లో చేరిన టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ - గుట్టుగా చేర్పించేసిన రేవంత్ !
Siddharth: పాన్ ఇండియా అంటే ఫన్నీగా ఉంది - 'కేజీఎఫ్2'పై హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలు