Hyderabad Traffic Restrictions: హైదరాబాదీలు ఓసారి ఇటు చూడండి, ఆ ఏరియాల్లో ట్రాపిక్ ఆంక్షలు, ఏకంగా మూడు నెలలు!
Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి కొండాపూర్ వైపు ట్రాఫిక్ ను డైవర్ట్ చేసినట్లు తెలిపారు.
Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. మాదాపూర్ డీసీపీ కార్యాలయంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ హర్షవర్ధన్, మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి, ఏసీపీ హనుమంతరావు లు ప్రెస్ మీట్ నిర్వహించి మరీ వివరాలు తెలిపారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ జంక్షన్ నుంచి కొండపూర్ వైపు వెళ్లే నూతన ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుందని.. దాని వల్లే ట్రాఫిక్ డైవర్షన్ చేసినట్లు సైబరాబాద్ పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలి ఓఆర్ఆర్ చౌరస్తా నుంచి కొండాపూరు వెళ్లే దారిని కొన్ని రోజుల పాటు మూసివేయనున్నట్లు స్పష్టం చేశారు. మే 13వ తేదీ నుంచి ఆగస్టు 10వ తేదీ వరకు మూడు నెలల పాటు 24 గంటలూ పని జరుగుతుందని.. అప్పటి వరకూ ఈ దారి మూసే ఉంటుందని పేర్కొన్నారు. ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు ప్రయాణికులు ప్రత్యామ్నాయ రహదారులను వినియోగించుకోవాలని సూచించారు.
- ఓర్ఆర్ నుంచి హఫీజ్ పేట వైపు వచ్చే ట్రాఫిక్ శిల్పప లేఅవుట్ ఫ్లైఓవర్ - మీనాక్షి టవర్స్ - డెలాయిట్ - ఏఐజీ హాస్పిటల్ - క్యూ మార్ట్ - కొత్తగూడ ప్లైఓవర్ - హఫీజ్ పేట వద్ద మళ్లించబడుతుంది.
- లింగంపల్లి నుంచి కొండాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్ గచ్చిబౌలి ట్రాఫిక్ పీఎస్ - డీఎల్ఎఫ్ రోడ్ - రాడిసన్ హోటల్ -కొత్తగూడ కొండాపూర్ వద్ద మళ్లించబడుతుంది.
విప్రో జంక్షన్ నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్ ఐఐటీ జంక్షన్ - ఎడమ మలుపు - గచ్చిబౌలి స్టేడియం - డీఎల్ఎఫ్ రోడ్ - రాడిసన్ హోటల్ - కొత్తగూడ ఫ్లైఓవర్ - ఆల్విన్ వద్ద యూ టర్న్ ని మళ్లిస్తారు. - టోలిచౌకి నుంచి ఆల్విన్ ఎక్స్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్ బయో డైవర్సిటీ ఫ్లైఓవర్ - మైండ్ స్పేస్ జంక్షన్ వద్ద మళ్లిస్తారు. సైబర్ టవర్స్ జంక్షన్ - హైటెక్స్ సిగ్నల్ వైపు ఎడమవైపు - కొత్తగూడ జంక్షన్ - ఆల్విన్.
- టెలికాం నగర్ నుంచి కొండాపూర్ వైపు వచ్చే ట్రాఫిక్ ఫ్లైఓవర్ కింద గచ్చిబౌలి వద్ద యూటర్న్ వద్ద మళ్లించబడుతుంది. బస్ స్టాప్ పక్కన శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ - మీనాక్షి టవర్స్ - డెలాయిట్ -ఏఐజీ హాస్పిటల్ - క్యూమార్ట్ -కొత్తగూడ - కొండాపూర్.
- ఆల్విన్ ఎక్స్ రోడ్డు నుంచి గచ్చిబౌలి వైపు వచ్చే ట్రాఫిక్ కొత్తగూడ జంక్షన్ గా మళ్లించబడుతుంది. హైటెక్స్ రోడ్డు వైపు - సైబరట్ టవర్స్ మైండ్ స్పేస్ జంక్షన్. శిల్ప లేఅవుట్ ఫ్లైఓవర్ - గచ్చిబౌలి ఓఆర్ఆర్.
- ఆల్విన్ ఎక్స్ రోడ్డు నుంచి లింగంపల్లి వైపు వచ్చే ట్రాఫిక్ బొటానికల్ గార్డెన్ జంక్షన్ వద్ద మళ్లించబడుతుంది. మసీదుబండ - హెచ్సీయూ డిపో - లింగంపల్లి.
90 రోజుల పాటు ఎర్రగడ్డలో రోడ్డు మూసివేత
హైదరాబాద్ ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ సమీపంలో మూడు నెలల పాటు ట్రాఫిక్ అమలు చేయబోతున్నట్లు ఇటీవలే ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనను కూడా విడుదల చేశారు. మెట్రో స్టేషన్ వద్ద ఏజీ కాలనీ నుంచి లక్ష్మీ కాంప్లెక్స్ వరకు నాలా పునర్నిర్మాణ పనులను జీహెచ్ఎంసీ అధికారులు చేపడుతున్నారు. ఈ పనుల కారణంగా మూడు నెలల పాటు మెట్రో స్టేషన్ వద్ద ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ క్రమంలోనే మార్చి 28వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు 90 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. నాలా పనులు జరుగుతున్న ప్రాంతాల్లోని ట్రాఫిక్ అవసరాన్ని బట్టి డైవర్ట్ చేస్తామని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.