By: ABP Desam | Updated at : 02 Aug 2022 10:35 AM (IST)
ప్రతీకాత్మక చిత్రం
Hyderabad Traffic Updates: హైదరాబాద్ నగరంలో తరచూ కురుస్తున్న భారీ వర్షాల వల్ల ప్రతిసారి ట్రాఫిక్ సమస్య తీవ్రంగా తలెత్తుతోంది. కొన్ని చోట్ల రోడ్లపై మోకాళ్లలోతు నీరు నిలవడంతో వాహనాలు సాఫీగా రాకపోకలు సాగించేందుకు బాగా ఇబ్బంది కలుగుతోంది. ఇలాంటి ప్రాంతాల్లో వాహనాలు అతి నెమ్మదిగా కదులుతుండడంతో కిలో మీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. వర్షం సరిగ్గా పీక్ టైమింగ్స్‌లో కురవడం అదే సమయంలో వాహనాల రద్దీ ఎక్కువగా ఉండడం, దానికి తోడు వరద నీటి అంతరాయంతో ట్రాఫిక్ జామ్ నగరవాసులను వేధిస్తోంది. ఈ క్రమంలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు, ట్విటర్ ద్వారా ట్రాఫిక్ సమస్యల గురించిన అప్ డేట్లు ఇస్తున్నారు.
నేడు కూడా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు (Hyderabad Traffic Police) ట్రాఫిక్ జామ్ గురించి అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ లో పీక్ ట్రాఫిక్ (Hyderabad Traffic) ఉండే ఉదయం 9 నుంచి 11 గంటల మధ్య భారీ వర్షం కురిసే సూచన ఉండడంతో కొన్ని చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడే అవకాశం ఉందని అలర్ట్ చేశారు. ముఖ్యంగా వాన వెలసిన ఒకటి రెండు గంటల్లోపు ట్రాఫిక్ సమస్య ఉంటుందని మంగళవారం (జూన్ 2) ఉదయం ఓ ప్రకటన విడుదల చేశారు. వాహనదారులు ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు ఇచ్చే సూచనలను పరిశీలించాలని కోరారు. సోషల్ మీడియా, ఎఫ్ ఎం చానెళ్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో ట్రాఫిక్ సమస్యల గురించి తెలుసుకోవచ్చని సూచించారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) August 2, 2022
Its raining,
please drive carefully.#Rainfall #HyderabadRains @JtCPTrfHyd pic.twitter.com/VckMU5Emar
వర్షం వెలిసిందని అందరూ వాహనదారులు ఒకేసారి రోడ్లపైకి రావొద్దని సూచించారు. దీనివల్ల ట్రాఫిక్ ఇబ్బంది ఏర్పడుతుందని తెలియజేశారు. రోడ్లపై నిలిచిన నీరు ఒకటి లేదా రెండు గంటల్లో డ్రెయిన్లలోకి వెళ్లిపోతుందని, ఆ తర్వాత ట్రాఫిక్ కాస్త వేగంగా కదులుతుందని చెప్పారు. వర్షం ఆగిపోయిందని వెంటనే ప్రయాణం చేద్దామనుకుంటే అనవసరంగా ట్రాఫిక్ లో చిక్కుకోవాల్సి వస్తుందని ప్రకటనలో హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ వివరించారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) August 2, 2022
Traffic Alert#Rainfall #HyderabadRains @JtCPTrfHyd pic.twitter.com/dtIHv0SwbQ
ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కూడా చాలా చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బీహెచ్ఈఎల్ నుంచి మియాపూర్ వరకు రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, లక్డీకాపూల్, బంజారాహిల్స్, మణికొండ, టోలిచౌకీ, జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, మూసాపేట్, అమీర్‌పేట, సనత్ నగర్, బాలానగర్, రాజేంద్ర నగర్ ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో, వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. పంజాగుట్ట శ్మశానవాటిక వద్ద భారీగా వాన నీరు నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ఈ వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం వచ్చిన ప్రతిసారి జీహెచ్ఎంసీ అధికారులు, డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తం అయ్యాయి. డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో నిమగ్నం అయ్యాయి.
Robin Hood: రాబిన్ హుడ్ వస్తాడు, సాయం అందిస్తాడు @మిషన్ 75
Video Call Suicide: భార్యకు భర్త వీడియో కాల్, వెంటనే దూలానికి ఉరి! కారణం తెలిసి పోలీసులు షాక్
MLC Mahender Reddy: టికెట్ ఎవరికిచ్చినా పార్టీ కోసమే పని చేస్తా: ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
KCR Flag Hoisting: గోల్కొండ కోటలో జెండా ఎగురవేసిన సీఎం కేసీఆర్, ఏమన్నారంటే?
Rain Updates: వాయుగుండం ఎఫెక్ట్, వర్షాలతో తెలంగాణలో ఆరెంజ్ అలర్ట్ - మరికొన్ని గంటల్లో ఏపీలో అక్కడ భారీ వర్షాలు: IMD
Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్
Salaar Release Date: ఫ్లాప్ ఇచ్చిన రోజు హిట్ కొట్టడానికి వస్తున్న ప్రభాస్ - ‘సలార్’ రిలీజ్ డేట్ ఫిక్స్
TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం
Popcorn Price In Multiplex: మల్టీప్లెక్స్‌ల్లో పాప్‌కార్న్ కాస్ట్ ఎందుకంత ఎక్కువ? పీవీఆర్ ఛైర్మన్ ఏమన్నారంటే?