Hyderabad Traffic Restrictions: నేడు హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు - ఆ రూట్లలో వెళ్తున్నారా, ఇది తెలుసుకోండి
Hyderabad Traffic Diversions: టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖ నేతలు హాజరు కానున్నారు. హైదరాబాద్ నగరంలో పలుచోట్ల నేడు ట్రాఫిక్ ఆంక్షలున్నాయి.
Hyderabad Traffic Restrictions: హైదరాబాద్ నగరంలో పలుచోట్ల నేడు ట్రాఫిక్ ఆంక్షలున్నాయి. బంజారాహిల్స్ లోని తెలంగాణ భవన్‌తో పాటు, ఆ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ మంగళవారం రాత్రి వెల్లడించారు. బుధవారం (అక్టోబర్ 5న) ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు టీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశం తెలంగాణ భవన్ (TRS Bhavan, Banjara Hills)లో జరగనుంది. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు రంగనాథ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశానికి సీఎం కేసీఆర్‌తో పాటు పలువురు ప్రముఖ నేతలు హాజరు కానున్నారు.
జాతీయ పార్టీపై కేసీఆర్ కీలక ప్రకటన, టీఆర్ఎస్ సమావేశం
జాతీయ పార్టీ ఏర్పాటు సైతం కావడంతో ఇతర రాష్ట్రాల నుంచి నేతలు హైదరాబాద్ కు విచ్చేస్తున్నారు. జాతీయ పార్టీ పేరు ‘భారత్ రాష్ట్ర సమితి’గా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. దాదాపు 100కు పేర్లను పరిశీలించిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీకి బీఆర్ఎస్ గా నామకరణం చేస్తున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంతో పాటు జాతీయ పార్టీ ఏర్పాటుపై కీలక ప్రకటన చేయనుండటం, ఇతర రాష్ట్రాల నుంచి కీలక నేతలు సైతం హైదరాబాద్ కు రావడంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ భవన్‌తో పాటు, ఆ పరిసర ప్రాంతాల్లో, మరికొన్ని చోట్ల ట్రాఫిక్‌ను కూడా మళ్లించనున్నారు.
#HYDTPinfo
— Hyderabad Traffic Police (@HYDTP) October 4, 2022
Commuters, please make a note of traffic restrictions/diversions in connection with visit of Hon’ble Chief Minister of Telangana State to TRS Bhavan, Banjara Hills for “TRS LEGISLATIVE PARTY MEETING” on 05-10-2022 from 1000 hours to 1500 hours.@JtCPTrfHyd pic.twitter.com/M0augM9vDm
హైదరాబాద్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
- మాసబ్‌ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెం. 12 వైపు వెళ్లే వాహనాలను బంజారాహిల్స్ రోడ్డు నెం. 1, రోడ్డు నెం.10, జహీరానగర్, క్యాన్సర్ హాస్పిటల్ నుంచి ఎన్టీఆర్ భవన్ వైపు వెళ్లాలని సూచించారు.
- ఎన్టీఆర్ భవన్, అపోలో హాస్పిటల్, ఫిలింనగర్, బంజారాహిల్స్ వైపు వచ్చే వారు జుబ్లీహిల్స్ చెక్ పోస్టు నుంచి రోడ్డు బంజారాహిల్స్ రోడ్డు నెం.36, రోడ్డు నెం. 45 రూట్‌లలో వెళ్లాలని నగర ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
- ఫిలింనగర్ నుంచి ఒరిస్సా ఐలాండ్‌కు వచ్చే వాహనాలు జుబ్లీహిల్స్ చెక్‌పోస్టు, ఎన్టీఆర్ భవన్, సాగర్ సొసైటీ, ఎస్‌ఎన్‌టీ, ఎన్‌ఎఫ్‌సీఎల్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లాల్సి ఉంటుంది
- మాసబ్‌ట్యాంక్ నుంచి బంజారాహిల్స్ రోడ్డు నెం.12, జుబ్లీహిల్స్ వైపు వెళ్లే వాహనదారులు మెహిదీపట్నం, నానల్‌నగర్, టోలిచౌక్, ఫిలిం నగర్, జుబ్లీహిల్స్ వైపు వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు పేర్కొన్నారు.