Hyderabad Traffic Restrictions: లష్కర్ బోనాలు- హైదరాబాద్‌లో రెండు రోజులపాటు ఈ మార్గాల్లో వెళ్లొద్దు.. ట్రాఫిక్ ఆంక్షలు ఇవే
Secunderabad Bonalu 2025 | సికింద్రాబాద్ ఉజ్జయిని మహకాళి జాతర నేపధ్యంలో నేటి నుండి రెండు రోజుపాటు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పలు దారులు మూసివేశారు.

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత వైభంగా నిర్వహించే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర (Ujjaini Mahankali Bonalu 2025) నేడు ప్రారంభం కానున్నాయి. మూడురోజు పాటు నిర్వహించే ఈ వేడుకల సందర్భంగా నగర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. గత ఏడాది ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకు 20లక్షల మందికిపైగా భక్తులు హజరైయ్యారని నిర్వహకుల చెబుతున్నారు. ఈరోజు ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఈ నేపధ్యంలో ఉజ్జయినీ మహంకాళి ఆలయం చుట్టూ 2 కిలోమీటర్ల పరిధిలో భక్తులు మరియు వారి వాహనాల వల్ల రోడ్లపై ట్రాఫిక్ జాములు ఏర్పడే అవకాశం ఉండటంతో పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లే ప్రయాణికులు ఈ రోజు నుండి మూడు రోజులపాటు కాస్త ముందుగానే ప్రయాణం ప్రారంభించాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
నగరంలో ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉండే ప్రాంతాలు ఇవే..
కర్బలా మైదాన్ ,రాణిగంజ్ ,పాత పోలీస్ స్టేషన్ రాంగోపాల్‌పేట, పరేడైస్ ,సీటీఓ ప్లాజా , ఎస్‌బీఐ క్రాస్ రోడ్ ,వైఎంసీఏ క్రాస్ రోడ్స్ , సెయింట్ జాన్స్ రోటరీ ,సంగీత్ క్రాస్ రోడ్ ,పట్టణి క్రాస్ రోడ్ ,పార్క్ లేన్ ,బాటా ,ఘాస్మండి క్రాస్ రోడ్స్ ,బైబిల్ హౌస్ ,మినిస్టర్స్, రోడ్ రసూల్పురా..
ఈ రోడ్లలో రాకపోకలు బంద్...
ఈ కింది రోడ్లను నేటి నుండి ఈనెల 15తేది ఉదయం 3 గంటల వరకు వాహనాల రాకపోకలకు పూర్తిగా మూసివేస్తున్నారు.టొబాకో బజార్ మరియు హిల్ స్ట్రీట్ వైపు నుండి మహంకాళి ఆలయానికి వెళ్లే రోడ్డు మార్గాలతోపాటు బాటా క్రాస్ రోడ్స్ నుండి సుబాష్ రోడ్ వాహనాల రాకపోకలు నిలివేయబడతాయి.అడవయ్య క్రాస్ రోడ్ నుండి మహంకాళి ఆలయం వైపు వెళ్లే రహదారితోపాటు జనరల్ బజార్ నుండి మహంకాళి ఆలయం వైపు వెళ్లే మార్గాలలో వాహనాల రాకపోకలు నిలిపివేయబడతాయి.
లష్కర్ బోనాల సందర్భంగా దారి మళ్లింపు మార్గాలు ఇవే..
రాణిగంజ్ చౌరస్తా నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు కర్బలా మైదాన్ నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చే సాధారణ వాహనాలు, ఆర్టీసీ బస్సులు రాణిగంజ్ చౌరస్తా వద్ద మినిస్టర్స్ రోడ్ నుండి రసూల్పురా చౌరస్తా మీదుగా పిఎన్టి ఫ్లై ఓవర్ , హెచ్పిఎస్ యూ టర్న్ , సీటీఓ , ఎస్బీఐ చౌరస్తా, వైఎంసీఏ చౌరస్తా , సెయింట్ జాన్స్ రోటరీ, సంగీత్ ,గోపాలపురం లేన్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కి మళ్లించబడతాయి.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి ట్యాంక్ బండ్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు చిలకలగూడ చౌరస్తా మీదుగా గాంధీ హాస్పిటల్ , ముషీరాబాద్ చౌరస్తా, కావడిగూడ ,మారియట్ హోటల్ మీదుగా ట్యాంక్ బండ్ మార్గం ద్వారా వెళ్లాల్సి ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి తాడ్బన్ మరియు బేగంపేట్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు క్లాక్ టవర్ మీదుగా వైఎంసీఏ చౌరస్తా నుండి ఎస్బీఐ చౌరస్తా మార్గంలో వెళ్లాల్సి వస్తుంది. పరేడైజ్ నుండి బైబిల్ హౌస్ వైపుగా వెళ్తున్న వాహనాలు పట్టణి చౌరస్తా వద్ద ఎస్బీఐ లేదా క్లాక్ టవర్ వైపు మళ్లించబడతాయి.
క్లాక్ టవర్ నుండి ఆర్పీ రోడ్ వైపు వెళ్తున్న వాహనాలు పట్టణి చౌరస్తా వద్ద ఎస్బీఐ చౌరస్తా లేదా పరేడైజ్, మినిస్టర్స్ రోడ్, రసూల్పురా, రాణిగంజ్, ట్యాంక్ బండ్ వైపుగా మళ్లించబడతాయి.సీటీఓ జంక్షన్ నుండి ఎంజీ రోడ్ వైపు వెళ్తున్న వాహనాలు పరేడైజ్ చౌరస్తా వద్ద సింధి కాలనీ నుండి మినిస్టర్స్ రోడ్ , రాణిగంజ్ చౌరస్తా , కర్బలా మైదాన్ వైపు మళ్లిస్తారు. పట్టణి చౌరస్తా నుండి వచ్చే ట్రాఫిక్ పరేడైజ్ వద్ద సీటీఓ వైపు వెళ్లాల్సి ఉంటుంది. పంజాగుట్ట నుండి సికింద్రాబాద్ వెళ్లేవారు.. పంజాగుట్ట నుండి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే వారు పంజాగుట్ట ఖైరతాబాద్ ,IMAX, తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్, RTC ఎక్స్ రోడ్ ,ముషీరాబాద్ ,గాంధీ హాస్పిటల్ , చిలకలగూడ చౌరస్తా మీదుగా ప్లాట్‌ఫారమ్ నం.10 నుండి స్టేషన్ లోపలికి చేరుకుంటారు.
భక్తుల వాహనాల పార్కింగ్ ప్రదేశాలు ఇవే..
సెయింట్ జాన్స్ రోటరీ, ఎస్‌బీఐ, మారెడ్‌పల్లి వైపు నుండి వచ్చే వాహనాలు హరిహర కళా భవన్ వద్ద పార్క్ చేయాలి.సంగీత్, క్లాక్ టవర్ వైపు నుంచి వచ్చే వాహనాలు మహబూబ్ కాలేజ్ వద్ద పార్క్ చేయాలి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఓల్డ్ జైల్ ఖానా ఓపెన్ ప్లేస్ వద్ద పార్క్ చేయాలి.బోయిగుడా, గాంధీనగర్, బైబిల్ హౌస్, ఘాస్‌మండి వైపు నుంచి వచ్చే వాహనాలు ఇస్లామియా హై స్కూల్ వద్ద పార్క్ చేయాలి.రాణిగంజ్ & అడవయ్య చౌరస్తా వైపు నుంచి వచ్చే వాహనాలు అడవయ్య మెమోరియల్ హై స్కూల్, రాణిగంజ్ వద్ద పార్క్ చేయాలి.వీఐపీ వాహనాలకు మహాత్మా గాంధీ విగ్రహం, ఎంజీ రోడ్ వద్ద పార్కింగ్ కు కేటాయించారు.నల్లగుట్ట, బేగంపేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు నల్లగుట్ట జిహెచ్‌ఎంసీ గ్రౌండ్ వద్ద పార్క్ చేయాలి.బేగంపేట్, రసూల్‌పురా, పట్టిగడ్డ వైపు నుంచి వచ్చే వాహనాలు స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద పార్క్ చేయాలి..అన్నానగర్, బాలంరాయ్, స్వీకార్ ఉప్కార్, ఎస్‌బిహెచ్ వైపు నుంచి వచ్చే వాహనాలు బెల్సన్ తాజ్ హోటల్ లేన్ వద్ద పార్క్ చేయాలి.





















