అన్వేషించండి

Raja Singh Politics: రాజాసింగ్ అడుగులు ఎటు వైపు? రాజకీయ భవిష్యత్తు కోసం ఆయన ముందు ఉన్న ఆప్షన్లు ఇవే

Goshamahal MLA Raja Singh | బీజేపీకి రాజీనామా చేసిన రాజాసింగ్ రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే ఏదో పార్టీలో చేరకతప్పదు. ఈ పరిస్థితుల్లో రాజాసింగ్ ముందు నాలుగే నాలుగు ఆప్షన్లు ఉన్నాయి.

బీజేపీకి రాజీనామా చేసిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ రాజకీయాల్లో ఓ సంచలనం. హిందుత్వ ఎజెండాతో ఆయన చేసే వ్యాఖ్యలు జాతీయ మీడియాలోనూ మారుమోగుతుంటాయి. ఇక అంతర్జాతీయ టెర్రరిస్టుల నుండి కూడా బెదిరింపులు వస్తున్నాయని రాజాసింగ్ పలుమార్లు చెప్పడం ఆయన ఇమేజ్‌కు నిదర్శనం. అలాంటి రాజాసింగ్ రాజకీయ భవిష్యత్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ఇటీవలే రాజాసింగ్ పార్టీకి చేసిన రాజీనామాను ఆమోదించారు. ఈ క్రమంలో రాజాసింగ్ రాజకీయ అడుగులు ఎటువైపు అన్న చర్చ రాజకీయ వర్గాల్లో నెలకొంది. అయితే రాజకీయంగా నిలదొక్కుకోవాలంటే ఏదో పార్టీలో చేరకతప్పదు. ఈ పరిస్థితుల్లో రాజాసింగ్ ముందున్న ఆప్షన్లు నాలుగే నాలుగు. అవేంటో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఆప్షన్ 1: ఏ పార్టీలో చేరకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో నిలబడటం

రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గంలో పట్టున్న నేత. బీజేపీ నుంచి ఏకైక ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇది పార్టీ గుర్తింపుతో కాకుండా, నియోజకవర్గంలో ఆయనకున్న సొంత బలంగానే చూడాలి. రాజాసింగ్ 2009లో టీడీపీ నుండి జీహెచ్‌ఎంసీలోని మంగళ్‌హాట్‌లో కార్పొరేటర్‌గా గెలిచారు. 2014 వరకు అదే పదవిలో ఉన్నారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. ఇలా పార్టీ ఏది మారినా తన హిందుత్వ సిద్ధాంతాలను మాత్రం వదులుకోలేదు. ఇదే రాజాసింగ్ బలంగా చెప్పవచ్చు. ఇక తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లలో చేరేది లేదని ఇప్పటికే రాజాసింగ్ తేల్చి చెప్పిన విషయం అందరికీ తెలిసిందే. ఇక బీజేపీలో ఉన్న అంతర్గత గొడవల కారణంగానే బయటకు వచ్చారు. ఇక మిగిలిన చిన్న పార్టీలు వామపక్షాలు, ఎం.ఐ.ఎంలు మాత్రమే. ఈ రెండు పార్టీలు తన హిందుత్వ సిద్ధాంతాలకు ప్రధాన శత్రువులు, కాబట్టి ఆ పార్టీలలో చేరే అవకాశమే లేదు. ఈ క్రమంలో రాజాసింగ్‌కు పార్టీల గుర్తింపు కాకుండా హిందుత్వవాదిగా మంచి గుర్తింపు ఉంది. తన సొంత బలంతో వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా కూడా గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఇది రాజాసింగ్‌కు ఉన్న మొదటి ఆప్షన్.

ఆప్షన్ 2: రాజాసింగ్ సొంత పార్టీ పెట్టడం

ఏ పార్టీలో చేరకుండా సొంత పార్టీ పెట్టడం. అయితే ఇది చాలా కష్టమైన పని. ఒక రాజకీయ పార్టీని పెట్టి దాన్ని నడపడం అనేది చాలా కష్టమైన విషయం. పార్టీ పెట్టాలంటే బలమైన సిద్ధాంతం, రాజకీయ వ్యూహం, రాష్ట్ర రాజకీయాల్లో నాయకత్వ శూన్యత, భారీగా నిధులు సేకరించడం, పటిష్టమైన క్యాడర్‌ను తయారు చేసుకోవడం - ఇవి ప్రస్తుత రాజకీయాల్లో సాధ్యమైన పనులు కావు. హిందుత్వ ఎజెండాతో పార్టీ పెట్టాలనుకున్నా, రాష్ట్రంలో ఇప్పటికే బీజేపీ ఆ స్థానంలో ఉండనే ఉంది. ప్రస్తుతం తెలంగాణలో చిన్న పార్టీలు మనుగడ సాధించే పరిస్థితుల్లో లేవు. ఇది రెండో ఆప్షన్‌గా తీసుకోవాలనుకున్నా రాజాసింగ్ వంటి నేతకు చాలా కష్టమైన లక్ష్యంగా చెప్పుకోవచ్చు.

 

ఆప్షన్ 3: హిందుత్వ సిద్ధాంత పార్టీ అయిన శివసేనలో చేరడం

బీజేపీలాగా హిందుత్వ సిద్ధాంతంతో నడుస్తున్న శివసేన వంటి జాతీయ పార్టీలో చేరడం మూడో ఆప్షన్. మహారాష్ట్ర పార్టీ అయినప్పటికీ హిందుత్వ వాదంతో ఉండి, బీజేపీకి దూరంగా ఉన్న పార్టీ కావడం వల్ల రాజాసింగ్ ఈ ఆప్షన్‌ను ఎంచుకునే అవకాశం లేకపోలేదు. తెలంగాణలో ఈ పార్టీ లేనప్పటికీ హిందుత్వ వాదంతో హైదరాబాద్ వంటి నగరంలో శివసేనను బలోపేతం చేసే అవకాశం లేకపోలేదు. మహారాష్ట్రలో కూడా ముంబైలోనే శివసేన పార్టీ బలంగా ఉన్న చరిత్ర ఉంది. ఆ తర్వాత క్రమక్రమంగా మహారాష్ట్ర అంతటా వ్యాపించి బలమైన పార్టీగా శివసేన రూపొందింది. ఈ పార్టీలో చేరడం ద్వారా రాజాసింగ్ తన హిందుత్వ భావజాలాన్ని దేశవ్యాప్తంగా వినిపించే అవకాశం లేకపోలేదు. రాజాసింగ్ వంటి నేతలు వస్తే శివసేన పార్టీ తెలంగాణ అధ్యక్షుడు అయ్యే అవకాశం లేకపోలేదు.

ఆప్షన్ 4: బీజేపీలో తిరిగి చేరడం

అసంతృప్తితో రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేయడం, దాన్ని పార్టీ ఆమోదించడం చకాచకా జరిగిపోయాయి. అయితే గతంలోనూ రాజాసింగ్ పార్టీ లైన్ దాటి చేసిన పరుష వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుని బీజేపీ ఆయన్ను సస్పెండ్ చేసింది. గత శాసనసభ ఎన్నికల ముందే తిరిగి పార్టీలోకి తీసుకుని గోషామహల్ టికెట్‌ను బీజేపీ రాజాసింగ్‌కు ఇచ్చింది. ఆ ఎన్నికల్లో రాజాసింగ్ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. తిరిగి ఇదే కథ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ పునరావృతం కావచ్చు. తిరిగి బీజేపీలోనే ఎన్నికల ముందు చేరి గోషామహల్ నుండి పోటీ చేసే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే గోషామహల్‌లో రాజాసింగ్‌ను మించి బలమైన అభ్యర్థి బీజేపీకి దొరికే అవకాశం లేదనే చెప్పాలి. రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదన్న రాజకీయ నానుడి రాజాసింగ్ విషయంలో జరిగవచ్చు.

అయితే రాజాసింగ్‌కు ఉన్న ఈ నాలుగు ఆప్షన్లలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి ఆయన గోషామహల్‌లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తన సైద్ధాంతిక బలం, ఎమ్మెల్యేగా తనకున్న ఫాలోయింగ్‌ను మరింత పెంచుకుని గోషామహల్‌లో బలమైన నేతగా ఉండటాన్నే రాజాసింగ్ తన ఆప్షన్‌గా ఎంచుకునే అవకాశం ఉంది. లేదనుకుంటే సైద్ధాంతిక సామీప్యత ఉన్న శివసేన పార్టీలో చేరి గోషామహల్‌లో ఆ పార్టీ గుర్తు మీద పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా బీజేపీకి పోటీగా హిందుత్వ ఎజెండాను తీసుకెళ్లే శివసేనకు తెలంగాణలో రాజాసింగే నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన రెండు ఆప్షన్స్‌ను రాజాసింగ్ అమలు చేసే అవకాశాలు చాలా తక్కువ. పార్టీ పెట్టి నడిపించడం అంత తేలిక కాదు. అదే రీతిలో బీజేపీ నుండి విభేదించి మళ్లీ ఆ పార్టీలో చేరే అవకాశాలు తక్కువ. అయితే ఇంతకు ముందు చెప్పినట్లు రాజకీయాల్లో చివరి రెండు ఆప్షన్స్‌ను రాజాసింగ్ తీసుకోరని మాత్రం చెప్పలేం. కానీ ఆ అవకాశాలు ప్రస్తుత పరిస్థితిని బట్టి తక్కువనే చెప్పాలి.

About the author Yedla Sudhakar Rao

జర్నలిజంలో 25 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గత పాతికేళ్లుగా పలు ప్రముఖ తెలుగు  ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సంస్థలలో ఆయన పనిచేశారు.

గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత జర్నలిజం కోర్సు చేసి, అదే వృత్తిని కెరీర్‌గా ఎంచుకున్నారు. వివిధ తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా సంస్థల్లో సీనియర్ రిపోర్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు, ఆ తర్వాత ఇన్‌పుట్ ఎడిటర్‌గా కూడా సేవలందించారు. తెలంగాణ ప్రభుత్వ ఇరిగేషన్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్‌లకు PUBLIC RELATION OFFICER గా  ఐదేళ్లపాటు పనిచేశారు.

ఆయనకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సమకాలీన అంశాలపై మంచి పట్టు ఉంది. పరిశోధనాత్మక కథనాలు రాయడంలో ఆయనకు నైపుణ్యం ఉంది. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్‌బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన ఏబీపీ దేశం డిజిటల్ మీడియాలో కొన్నేళ్లుగా అసిస్టెంట్ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

వీడియోలు

Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?
Rahane Saved Jaiswal From 4-Match Ban | జైస్వాల్‌ను గ్రౌండ్ నుంచి బయటకు పంపిన రహానే
Ganguly & Yuvraj Singh In Delhi Capitals Camp | ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి దాదా, యువి
PM Modi Meets CWG 2026 Medal Winners | ప్రధాని మోడీని కలిసిన గ్లాస్గో కామన్వెల్త్ విజేతలు
Gundenininda Gudigantalu Serial August 10 | రోహిణిని రోడ్డుపైకి నెట్టేసిన ప్రభావతి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial Politics: ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
ప్రేమ్ సాగర్ రావుకి విదేశాల్లో ఆస్తులున్నాయని నిరూపిస్తా.. ఎమ్మెల్యే‌కు బీఆర్ఎస్ నేత ఛాలెంజ్
Ministers vs BRS MLA: కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
కమలాపూర్‌లో రసాభాస.. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో మంత్రులు వర్సెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే
Sarfaraz Fighter Comeback: 17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
17 కేజీల బరువు తగ్గి టీమ్ ఇండియాలో లక్కీ ఎంట్రీ.. జమ్మూ కశ్మీర్ లో ట్రైనింగ్ తీసుకుని, ఫిట్ గా మారి..
Polavaram Project: పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు నిధులు, పురోగతిపై కేంద్రం క్లారిటీ
పోలవరం ఫేజ్ 1 పనుల పూర్తికి మరో ఏడాది గడువు పెంపు.. ప్రాజెక్టు పురోగతిపై కేంద్రం క్లారిటీ
Hyderabad News: యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
యాప్ లేదు, బైక్‌ నెంబర్ ప్లేట్ లేదు.. హైదరాబాద్‌లో ఫేక్ రాపిడో డ్రైవర్‌ను నిలదీసిన మహిళ !
Work From Home OTT : ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
ఓటీటీలోకి లేటెస్ట్ తెలుగు మూవీ - మూడు నెలల తర్వాత స్ట్రీమింగ్... యూత్ డోంట్ మిస్
Ongole Politics: బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
బాలినేని, దామచర్ల వివాదంపై టీడీపీ, జనసేన అధిష్టానాలు సీరియస్.. బహిరంగ విమర్శలు వద్దని క్లాస్
Adilabad News: కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఆపాలి.. 4 లేబర్ కోడ్ లను రద్దు చేయాలి
Embed widget