(Source: ECI/ABP News/ABP Majha)
Hyderabad Rains: హైదరాబాద్ రోడ్లపై ప్రయాణిస్తున్నారా, వర్షం నీళ్లు నిలిచిపోయే ఏరియాలు ఇవే
Hyderabad Rains: నగరంలో పలుచోట్ల రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. వాహనదారులు ఈ వర్షాల సమయంలో ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు చర్యలు తీసుకున్నారు.
Traffic Diversions In Hyderabad: హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో నగరంలో పలుచోట్ల రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. వాహనదారులు ఈ వర్షాల సమయంలో ఇబ్బంది లేకుండా ప్రయాణించేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మూడు రోజులుగా చర్యలు చేపడుతున్నారు. జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సమన్వయంతో పనిచేసి రోడ్లపై వర్షం నీరు నిలిచి వాహనదారులకు సమస్యలు తలెత్తే ప్రాంతాలను గుర్తించారు. ఆ ప్రాంతాల్లో రోడ్లను నిలిచిపోకుండా ఉండేలా చర్యలు తీసుకున్నారు. నగరంలో మొత్తం 50 వాటర్ లాగింగ్ పాయింట్లను ట్రాఫిక్ పోలీసులు గుర్తించి వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ వాటర్ లాగింగ్ పాయింట్లను స్వయంగా పరిశీలిస్తున్నారు.
- వర్షాలతో హైదరాబాద్‌లో నీళ్లు నిలిచిపోయే సెంటర్స్ ఇవే..
- పంజాగుట్ట – మోడల్ హౌస్, కేసీపీ జంక్షన్, చట్నీస్ సమీపంలోని ఎన్‌ఎఫ్‌సీఎల్, మెట్రో రెసిడెన్సీ
- ఎస్.ఆర్.నగర్ – మైత్రివనం హర్షమెస్, బేగంపేట్ వైపు వెళ్తుండగా వచ్చే బల్కంపేట రైల్వే బ్రిడ్జి, NIMSME కంపౌండ్ వాల్
- జుబ్లీహిల్స్ – సీవీఆర్ న్యూస్ బీవీబీ జంక్షన్
- బంజారాహిల్స్ – క్యాన్సర్ హాస్పిటల్ బస్ స్టాప్, రోడ్ నెం.92 జుబ్లీహిల్స్
- బేగంపేట్ – సీటీఓ జంక్షన్, రాణిగంజ్ జంక్షన్, కర్బాల మైదాన్, ఐబీపీ పెట్రోల్ పంపు ఎదురుగా, బేగంపేట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎదురుగా..
- గోపాలపురం – ఒలిఫెంట బ్రిడ్జి, రైల్వే బ్రిడ్జి ఆళ్లుగడ్డ బావి
- మారేడ్‌పల్లి -బాలాజీ గ్రాండ్, కార్ఖాన మెయిన్‌రోడ్డు, ఫర్నిచర్ వరల్డ్, గ్రిల్ 9 హోటల్ ఎదురుగా..
- తిరుమలగిరి – పప్పు దాబా సమీపంలోని హెచ్‌పీ పెట్రోల్ పంప్ వద్ద
- టోలిచౌక్ – టోలిచౌక్ ఫ్లై ఓవర్ కింద, Honda షోరూం, రిలయన్స్ మార్ట్, పిల్లర్ నెం.102, మొఘల్‌ఖాన
- అసిఫ్‌నగర్ (మెహిదీపట్నం) – పుల్లారెడ్డి కాలేజీ లైన్, పిల్లర్ నెం.23 వద్ద రెండువైపులా
- మీర్‌చౌక్ – డబీర్‌పురా కమాన్, చంపాపేట్, గణేశ్ చౌక్
- అబిడ్స్ – నిజాంకాలేజ్ గేట్ నెం.4
- సైఫాబాద్ – రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్, అయోధ్య జంక్షన్, మెడికవర్ హాస్పిటల్ వద్ద
- మలక్‌పేట్ – రైల్వే అండర్ బ్రిడ్జ్, అక్షయ హోటల్ సమీపంలో, ముసారాంబాగ్ బ్రిడ్జి వద్ద
- నల్లకుంట – ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు ఎదురుగా
- సుల్తాన్ బజార్ (కోఠి) – పుత్లిబౌలి నుంచి రంగమహల్ వెళ్లే రూట్‌లో
సమన్వయంతో సమస్యల పరిష్కారం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల సమయంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసు, జీహెచ్‌ఎంసీ, విద్యుత్ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారు. సీపీ స్టీఫెన్ రవీంద్ర సూచనలతో ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస్‌రావు సారథ్యంలో పోలీసులు చర్యలు చేపడుతున్నారు. దాదాపు 1000 మంది పోలీసులు షిఫ్టుల వారీగా విధులు నిర్వహించి నగర వాసులకు ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read: Rains in AP Telangana: మరింత బలపడిన అల్పపీడనం - ఏపీ, తెలంగాణలో మరో 3 రోజులు భారీ వర్షాలు