Hyderabad Rains: హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్, పలుచోట్ల భారీ వర్షాలు- ఆరెంజ్ అలర్ట్ జారీ
Rains In Hyderabad | హైదరాబాద్ లో వరుసగా మూడో రోజు వరుణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. పలుచోట్ల భారీ వర్షం కురుస్తోంది. పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు దిగొచ్చాయి.

Rains In Telangana | హైదరాబాద్: తెలంగాణలో వరుసగా మూడోరోజు పలు జిల్లాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. హైదరాబాద్ లో గురువారం, శుక్రవారం భారీ వర్షం కురిసింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఫ్లై ఓవర్ల వద్ద నీరు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య తలెత్తింది. హైదరాబాద్‌లో బోయిన్ పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, మారేడుపల్లి సహా శనివారం పలుచోట్ల వర్షం కురుస్తోంది. నేడు హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనీ బీరంగూడ, ఆర్‌సీ పురం, మియాపూర్, శేరిలింగంపల్లి, చంద్రాయణగుట్ట, హయత్‌నగర్, బాలాపూర్, రాజేంద్రనగర్ ప్రాంతాల్లో చెదురుమదురుగా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2:30 తర్వాత నుంచి ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాత్రి సైతం వర్షం కురుస్తుందని నగర వాసులను GHMC అలర్ట్ చేసింది. వర్ష సూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.
హైదరాబాద్ లో దంచికొడుతున్న వర్షాలు (Hyderabad Rains)
నగరంలో వరుసగా మూడో రోజు వరుణుడు ప్రభావం చూపిస్తున్నాడు. గత కొన్ని రోజులుగా ఎండలతో ఇబ్బంది పడిన హైదరాబాద్ వాసులు వర్షాలతో చిల్ అవుతున్నారు. హైదరాబాద్ లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు భారీగా దిగొచ్చాయి. హైదరాబాద్ లో శనివారం మధ్యాహ్నం వర్షం ప్రారంభమైంది. 40-60 కి.మీ.ల వేగంతో గాలులు వీచనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు కురవనున్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
Daily Weather PPT of Telangana dated 19.07.2025@TelanganaCMO @TelanganaCS @DCsofIndia @IASassociation @IasTelangana @tg_weather @metcentrehyd #CMO_Telangana @TelanganaDGP @GHMCOnline @CommissionrGHMC pic.twitter.com/5s0Z60T9Xj
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) July 19, 2025
భారీ వర్ష సూచనతో ఆరెంజ్, ఎల్లో అలర్ట్
హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆదిలాబాద్, మంచిర్యాల,నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట జిల్లాలలో తేలికపాటి నుంచి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం వుంది. గంటకు 40 కి.మీ వేగంతో గాలులతో ఉరుములతో కూడిన వర్షాలు కురవనున్నాయి. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.
ఆదివారం వర్షాలు
తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాలలో ఆదివారం సైతం అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది.






















