తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: రైతులకు బిగ్ అలర్ట్! హైదరాబాద్‌లో ముంపు, ట్రాఫిక్ జామ్.. తాజా వాతావరణ హెచ్చరికలు!
Weather Report: ముందస్తు రుతపవనాలు వచ్చిన్పటికీ తెలుగు రాష్ట్రాల్లో జూన్‌లో తక్కువ వర్షపాతం నమోదయింది. జులైలో వరుణుడు కరుణించాడు. జోరుగా వానలు పడుతున్నాయి. మరో మూడు రోజులపాటు ఇదే పరిస్థితి.

Latest Weather Report : తెలుగు రాష్ట్రాల రైతులకు ఆనందకరమైన వార్తను చెప్పారు వాతావరణశాఖాధికారులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో మూడు రోజులపాటు జోరువానలు పడతాయని చెబుతున్నారు. ఇప్పటికే హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తూర్పు ఆగ్నేయ దిశలో కదిలి ఈశాన్య బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. ఏపీకి ఆనుకొని ఉపరితల చక్రవాత ఆవర్తనం ఏర్పడి ఉంది. వీటికి సమాంతరంగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. ఈ వాతావరణ మార్పులు కారణంగా తెలుగు రాష్ట్రాల్లో జోరువానలు పడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
ఆంధ్రప్రదేశ్‌వ్యాప్తంగా వర్షావరణం ఏర్పడింది. రాష్ట్రంలో మరో మూడు రోజులపాటు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు. నిన్న రాత్రి అల్లూరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. రాయలసీమ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం,మన్యం, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లో జిల్లాల్లో కూడా వానలు కురుస్తున్నాయి. విశాఖ,అనకాపల్లి, కాకినాడ, ఏలూరు,కృష్ణా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే సూచనలు ఉన్నాయి.
తెలంగాణలో వాతావరణం
తెలంగాణలో మూడు రోజుల నుంచి వర్షాలు భారీగా కురుస్తున్నాయి. మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. భారీ నుంచి అతి భారీ వానలు పడతాయిని అధికారులు హెచ్చరిస్తున్నారు. మధ్య, ఉత్తర తెలంగాణలో వర్షాల ప్రభావం ఎక్కవగా ఉంది.
రెడ్ అలర్ట్ జిల్లా :-రంగారెడ్డి, హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఎల్లో అలర్ట జిల్లాలు:- సూర్యపేట, నల్గొండ, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల్ జిల్లా
హైదాబాద్లో వాతావరణం
హైదరాబాద్లో మూడు రోజుల నుంచి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాయంత్రానికి సైలెంట్గా వాన దంచి కొడుతోంది. మరో మూడు రోజుల పాటు ఇలాంటి పరిస్థితి కనిపిస్తోందని వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడతాయని అంటున్నారు.
శుక్రవారం కొన్ని గంటలాటు కురిసిన వర్షానికి హైదరాబాద్ అతలాకుతలమైపోయింది. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆఫీస్‌ల నుంచి వచ్చే టైంలో వానలు పడటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కిలోమీటర్ ట్రావల్ చేయడానికి కూడా గంటల సమయం పట్టింది. ఈ పరిస్థితులను వివరిస్తూ సోషల్ మీడియాలో నెటిజన్లు వీడియోలు, ఫొటోలను షేర్ చేస్తున్నారు.
కుండపోతగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్లైఓవర్లు కూడా ముంచెత్తే పరిస్థితి ఏర్పడింది. ఇళ్లు నీట మునిగాయి. వాహనాలు సరే సరి. కార్లు, టూవీలర్లు, ఇతర వాహనాలు నీటిలో తేలియాడాయి.
తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తం
వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ అధికారులను సీఎం ఆదేశించారు.జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, వాటర్ వర్క్స్ , విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్, హైడ్రా బృందాలు, ఇతర విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. వర్షంతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాల్లో ప్రజలు పిర్యాదు చేసిన వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలుజారీ చేశారు.





















