అన్వేషించండి

Ganesh Immersion: హైదరాబాద్‌లో గణేశ్‌ నిమజ్జనాలు, ఏర్పాట్లను పూర్తి చేసిన అధికారులు

Hyderabad : గణేష్ నిమజ్జనాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గణేష్ విగ్రహాన్ని తీసుకువెళ్లే వాహనంలోకి మద్యం, మత్తు పదార్థాలు తీసుకున్న వ్యక్తులను అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు.

Ganesh Immersion: హైదరాబాద్ మహానగరంలో వినాయక నిమజ్జనాలు షురూ అయ్యాయి. ఈ నెల 7న వినాయక చవితి రోజున మండపాల్లో కొలువు దీరిన గణేష్ పూజలు అందుకుంటున్నాడు. మూడో రోజు నుంచి నగరంలో నిమజ్జనాలు మొదలయ్యాయి. భారీ సంఖ్యలో విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. 5వ రోజైన బుధవారం వివిధ చెరువులు, రిజర్వాయర్లలో డీజే మేళతాళాలు, షేర్ బ్యాండ్ చప్పుళ్లతో విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఈ నెల 17న ఖైరతాబాద్ గణేశుడితో సహా మహా నిమజ్జనం జరగనుండగా.. అధికారులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

పోలీసుల కఠిన వైఖరి
ఇక గణేష్ నిమజ్జనాల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. గణేష్ విగ్రహాన్ని తీసుకువెళ్లే వాహనంలోకి మద్యం, మత్తు పదార్థాలు తీసుకున్న వ్యక్తులను అనుమతించబోమని పోలీసులు స్పష్టం చేశారు. అలాంటి వారిని నిమజ్జనంలో కూడా అనుమతించబోమని చెప్పారు. మద్యం సేవించి ఇతరుల ప్రైవసీకి భంగం వాటిల్లే అవకాశం ఉన్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు చెబుతున్నారు. శాంతియుత వాతావరణంలో వేడుకలు జరుపుకోవాలని హైదరాబాద్‌ పోలీసులు నగర ప్రజలకు సూచించారు. ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో గణేష్ నిమజ్జనం చివరి రోజు 40 గంటల పాటు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. ట్రాఫిక్, శాంతిభద్రతలు, ఇతర పోలీసులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా నగరంలో మతపరమైన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా రౌడీలు, వర్గ సమస్యలపై దృష్టి సారించాలని కింది స్థాయి అధికారులకు సీపీ సూచించారు. శాంతియుతంగా వేడుకలు నిర్వహించుకునేందుకు ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. 
 
25వేల మందితో బందోబస్తు
నిమజ్జనం రోజు (సెప్టెంబర్ 17) 25 వేల మంది పోలీసులు బందోబస్తులో ఉంటారని సీవీ ఆనంద్ తెలిపారు. 15 వేల మంది నగర పోలీసులు, 10 వేల మంది జిల్లాల నుంచి  పోలీసులు వస్తున్నారని తెలిపారు. ట్రై కమిషనరేట్ పరిధిలోని హుస్సేన్ సాగర్ వైపు వచ్చే విగ్రహాలను ప్రశాంతంగా నిమజ్జనం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. హుస్సేన్‌ సాగర్‌ వద్ద రద్దీని తగ్గించేందుకు నగరంలోని కీలకమైన చెరువులతోపాటు ప్రధాన ప్రాంతాల్లో పరిశుభ్రమైన నీటితో బేబీ పాండ్స్‌, పూల్ పాండ్స్‌ను జీహెచ్ ఎంసీ రెడీ చేసింది. 24 గంటల పాటు సిబ్బందిని అందుబాటులో ఉంచుతూ.. విగ్రహాలను ఎప్పటికప్పుడు నిమజ్జనం చేసేలా భారీ క్రేన్లు, వ్యర్థాలను తొలగించేందుకు భారీ వాహనాలను అధికారులు రెడీ చేశారు.

లక్ష విగ్రహాల నిమజ్జనం
హైదరాబాద్‌ లో ఈ ఏడాది లక్షలకు పైగా విగ్రహాలను నిమజ్జనం చేసే అవకాశం ఉండటంతో.. హుస్సేన్‌ సాగర్‌తో పాటు జంటనగరాల పరిధిలోని జలాశయాల వద్ద భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ట్యాంక్‌బండ్‌వైపు మినహా ఎన్టీఆర్ మార్గ్‌, పీవీ మార్గ్‌లో ఇప్పటికే భారీ క్రేన్లను రెడీగా ఉంచారు. పీవీ మార్గ్‌లో నిమజ్జనాల సందడి గత మూడు రోజుల నుంచే కొనసాగుతోంది. ఇక చివరి రోజున భారీగా గణనాథులు సాగర తీరం వైపు తరలి రానున్నారు. మొత్తం ఆరు జోన్లలో ఐదు పెద్ద చెరువులతోపాటు తాత్కాలికంగా 73 కుంటలను గణపతుల నిమజ్జనానికి సిద్ధం చేశారు. ఎల్బీనగర్ పరిధిలో 12, ఛార్మినార్ జోన్‌లో 10, ఖైరతాబాద్ జోన్‌లో 13, శేరిలింగంపల్లి జోన్‌లో 13, కూకట్‌పల్లి జోన్‌లో 11, సికింద్రాబాద్ జోన్‌లో 12 తాత్కాలిక నిమజ్జన కుంటలను రెడీ చేశారు.

జీహెచ్‌ఎంసీ కమిషర్ ఆమ్రపాలి ఆదేశాలు
 శోభాయాత్ర నుంచి నిమజ్జన ప్రక్రియ పూర్తయ్యే వరకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే చెట్ల కొమ్మల తొలగింపు పూర్తయిందని, రోడ్డు మరమ్మతులు, బారికేడ్లు, విద్యుత్ దీపాల ఏర్పాటు ప్రక్రియ కొనసాగుతుందని ఆమె తెలిపారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులు, జీహెచ్ ఎంసీ, విద్యుత్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గణేష్ నిమజ్జనానికి 140 స్టాటిక్ క్రేన్లు, 295 మొబైల్ క్రేన్లు, 160 గణేష్ యాక్షన్ టీమ్‌లు, 102 మినీ టిప్పర్లు, 125 జేసీబీలు ఏర్పాటు చేశామని, భక్తుల సౌకర్యార్థం ఆయా ప్రాంతాల్లో 308 మొబైల్ టాయిలెట్లను కూడా సిద్ధం చేసినట్లు తెలిపారు. నిమజ్జన ప్రక్రియ సజావుగా పూర్తయ్యేలా భక్తులు సహకరించాలని ఆమ్రపాలి విజ్ఞప్తి చేశారు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Attack On Collector: కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Revanth Reddy: తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
Revanth Reddy: తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
Case On RGV: ఆర్జీవీకి తప్పదు - ప్రకాశం జిల్లాలో కేసు నమోదు !
ఆర్జీవీకి తప్పదు - ప్రకాశం జిల్లాలో కేసు నమోదు !
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆసీస్ తో టెస్టుకు రోహిత్ దూరం! కెప్టెన్ గా బుమ్రా?ట్రోలర్స్‌కి ఇచ్చి పడేసిన రౌడీ, ఒక్క వీడియోతో గప్‌చుప్బెల్టు తీస్తానన్నారు? రోజా సంచలన ట్వీట్గేమ్ చేంజర్ టీజర్ టాక్ ఎలా ఉందంటే?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Attack On Collector: కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
కలెక్టర్‌పై చేయి చేసుకున్న మహిళా రైతు - ఫార్మా కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాస, వికారాబాద్ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత
Andhra Pradesh Budget 2024-25: ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
ఏపీ బడ్జెట్‌లో పవన్ కల్యాణ్‌, లోకేష్ శాఖలకు ఇచ్చిన నిధులు ఎంతంటే?
Revanth Reddy: తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
Revanth Reddy: తెలంగాణ యువతకు 50 వేల ఉద్యోగాలు, ఆ ఫ్యామిలీలో నలుగురి జాబ్ కట్: కేసీఆర్ కు రేవంత్ రెడ్డి కౌంటర్
Case On RGV: ఆర్జీవీకి తప్పదు - ప్రకాశం జిల్లాలో కేసు నమోదు !
ఆర్జీవీకి తప్పదు - ప్రకాశం జిల్లాలో కేసు నమోదు !
Sanjay Bangar Son Aryan:అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్‌ కుమారుడు- అనయగా పేరు మార్చుకున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు
అమ్మాయిగా మారిన సంజయ్ బంగర్‌ కుమారుడు- అనయగా పేరు మార్చుకున్నట్టు సోషల్ మీడియాలో పోస్టు
Hormone Replacement Therapy : ఈ సర్జరీతో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారిగా మారొచ్చట.. లింగమార్పిడితో జరిగే మార్పులు, సైడ్ ఎఫెక్ట్​లు ఇవే
ఈ సర్జరీతో మగవారు ఆడవారిగా, ఆడవారు మగవారిగా మారొచ్చట.. లింగమార్పిడితో జరిగే మార్పులు, సైడ్ ఎఫెక్ట్​లు ఇవే
OTT Releases This Week: ఒక్క ఫైట్ చేయలేదు, సిక్స్ ప్యాక్ చూపించలేదు... హీరో ఏడ్పించేశాడు భయ్యా - ఈ వారమే ఓటీటీలోకి ఫాదర్ సెంటిమెంట్ సినిమా
ఒక్క ఫైట్ చేయలేదు, సిక్స్ ప్యాక్ చూపించలేదు... హీరో ఏడ్పించేశాడు భయ్యా - ఈ వారమే ఓటీటీలోకి ఫాదర్ సెంటిమెంట్ సినిమా
Honda Amaze 3rd Gen: కొత్త హోండా అమేజ్ - నిజంగానే అమేజింగ్ - వావ్ అనిపిస్తున్న డిజైన్!
కొత్త హోండా అమేజ్ - నిజంగానే అమేజింగ్ - వావ్ అనిపిస్తున్న డిజైన్!
Embed widget