అన్వేషించండి

Ashu Reddy : బంగారం, కార్లు, ఫ్లాట్స్ కొనిపించుకుంది - పెళ్లి పేరుతో 9 కోట్లు దోచేసింది... బిగ్ బాస్ ఫేం, నటి అషు రెడ్డిపై కేసు

Ashu Reddy Case : బిగ్ బాస్ ఫేం, హీరోయిన్ అషు రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను పెళ్లి పేరిట మోసం చేసిందన్న ఎన్ఆర్ఐ ఫిర్యాదులో ఆమె కుటుంబ సభ్యులపై కూడా కేసు నమోదైంది.

Case Registered Against Actress Ashu Reddy : హీరోయిన్, బిగ్ బాస్ ఫేం అషు రెడ్డిపై హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. పెళ్లి పేరిట తనను మోసం చేసిందంటూ ఓ ఎన్ఆర్ఐ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అషు రెడ్డి, ఆమె కుటుంబ సభ్యులపై చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

అసలేం జరిగిందంటే?

పోలీసులు తెలిపిన పూర్తి వివరాల ప్రకారం... హైదరాబాద్ షేక్ పేట్‌కు చెందిన యెనుముల సత్యనారాయణ కుమారుడు వై వి ధర్మేంద్ర లండన్‌లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తున్నారు. 2018లో భారత్‌కు వచ్చిన టైంలో అతనికి అషు రెడ్డి పరిచయమైంది. అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశాల కోసం హైదరాబాద్ వచ్చినట్లు తెలిపింది. పరిచయమైన కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని... పెళ్లి చేసుకుంటానని ధర్మేంద్రను నమ్మించి ఆర్థిక అవసరాల కోసం డబ్బులు అడగడం ప్రారంభించింది.

బంగారం, కారు, ఆస్తులు కొనుగోలు చేసి తన పేరిట రిజిస్టర్ చేయించుకుంది. ఆ తర్వాత అషు రెడ్డి కుటుంబ సభ్యులు ధర్మేంద్రను కలిసి సంబంధం ఖాయం చేస్తున్నామంటూ పండితుడిని పిలిచి హడావుడి చేశారు. అనంతరం పెళ్లి పేరెత్తితే ముఖం చాటేస్తున్నారని బాధితుడు వెల్లడించారు. 

Also Read : జియో హాట్ స్టార్‌లో నివిన్ పాలీ జోరు - ప్రేమమ్ To లేటెస్ట్ పొలిటికల్ థ్రిల్లర్... ఎన్ని మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే?

రూ.9.35 కోట్లు మోసం

తమను మొత్తం రూ.9.35 కోట్ల మేర మోసం చేశారని బాధితులు ఆరోపించారు. 2025 వరకూ అషు రెడ్డి తన కుమారుడి నుంచి రూ.9.35 కోట్ల విలువైన బంగారం, నగదు, ఫ్లాట్స్, వాహనాలు కొనుగోలు చేయించుకుందని... అదనంగా ఆమె సోదరి కూడా రూ.50 లక్షలు తీసుకున్నట్లు ధర్మేంద్ర తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్న అషు రెడ్డి... ఆర్జీవీని ఇంటర్వ్యూ చేసి పాపులర్ అయ్యారు. ఆ తర్వాత బిగ్ బాస్‌తో మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. కొన్ని సినిమాల్లోనూ నటించారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలపై ఆమె ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News:పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు
పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై లైంగిక వేధింపుల కేసు
Harish Rao Padayatra : హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
హరీశ్ రావు పాదయాత్ర సక్సెస్ - బీఆర్ఎస్‌లో నాయకత్వ సమరం.. కేటీఆర్ vs హరీశ్ వ్యూహాత్మక ఆధిపత్య పోరేనా?
Peddi Sudarshan Reddy: మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత! సంతాపం తెలిపిన కేసీఆర్
Malkajgiri Police: రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!
రాత్రి పూట ఇడ్లీబండి పెట్టాడని జైలు - మల్కాజిగిరి పోలీసుల ఘనకార్యం - నెటిజన్లు సన్మానించేస్తున్నారు!

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Visakhapatnam Trolley Bag Murder : పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
పెళ్లి చేసుకోమంటుందని చంపేసి ట్రాలీ బ్యాగ్‌లో కుక్కేసి పక్క రాష్ట్రంలో పడేశాడు - విశాఖలో దారుణం!
Ram Gopal Varma : ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!
ఊర్మిళతో వర్మ పెళ్లి? - RGV బండారం బయటపెట్టిన చిరంజీవి!
Panchadarla Land Issue: పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
పంచదార్ల కొండలో అక్రమ మైనింగ్‌పై ప్రభుత్వం సీరియస్‌- అనకాపల్లి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ సస్పెండ్‌
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
90% Gen Z కి తెలియని మహాభారతం సీక్రెట్స్ ! 7 Lessons to Win in Life
Jamuna Rani : లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
లెజెండరీ సింగర్ జమునా రాణి కన్నుమూత - తెలుగు సహా ఇతర భాషల్లో 6 వేలకు పైగా పాటలు
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Gen Z Protests: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడు -బీజేపీకి టెన్షన్
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కేంద్రం డిఫెన్స్ - జెన్-జీ ఉద్యమం, రాహుల్ దూకుడుతో ఢిల్లీ రాజకీయం హీట్!
Priyanka Jain : ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
ప్రియుడితో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ స్టిల్స్ - టాక్సిక్ రొమాంటిక్ సాంగ్ రీల్
Embed widget