(Source: ECI/ABP News/ABP Majha)
Police Raids: పైకి మసాజ్ సెంటర్! లోపల అమ్మాయిలతో దందా!
Hyderabad Crime: హైదరాబాద్‌లో మసాజ్ సెంటర్ల పేరుతో నడుస్తున్న స్పా కేంద్రాలపై గుడిమల్కాపూర్ పోలీసులు, సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
Police Raid On Massage Center: హైదరాబాద్ మహా నగరంలో అక్రమ వ్యాపారాలు గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నాయి. మసాజ్ సెంటర్ల (Massage Center) పేరుతో అక్రమ దందాకు పాల్పడుతూ కోట్లకు పడగలెత్తుతున్నారు. దీంతో పోలీసులు ఈ తరహా దందాలపై పోలీసులు ఫోకస్ చేశారు. గుడిమల్కాపూర్ (Gudimalkapur)లోని ఇలాంటి తంతు జరుగుతున్న స్పా సెంటర్ల (Spa Center)పై గుడిమల్కాపూర్ పోలీసులు, సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భాగంగా ఐదుగురు యువతులను రెస్క్యూ చేయగా, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. స్పా నిర్వహకులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వివరాలు.. గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నానల్ నగర్ ప్రాంతంలో కొద్ది రోజులుగా మసాజ్ సెంటర్ పేరుతో అక్రమంగా స్పా సెంటర్లను నిర్వహిస్తున్నారు. దీని గురించి మల్కాపూర్ పోలీసులకు సమాచారం అందిందింది. దీంతో పక్క ప్లాన్ ప్రకారం పోలీసులు, టాస్క్‌ఫోర్స్ సిబ్బంది దాడులు నిర్వహించారు. అపార్ట్‌మెంట్లల్లో జన్నత్, గోల్డెన్ పేర్లతో నడిపిస్తున్న స్పా సెంటర్లలో గుడిమల్కాపూర్ – సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడులు చేశారు.
ఈ దాడుల్లో ఐదుగురు అమ్మాయిలను రెస్క్యూ చేసిన పోలీసులు, ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇన్‌స్పెక్టర్ షేక్ ముజీబ్ ఉర్ రెహామన్ వివరాలు వెల్లడిస్తూ.. గుట్టు చప్పుడు కాకుండా గత కొద్దిరోజుల నుండి స్పా పేరుతో క్రాస్ మసాజ్ చేయిస్తున్నారని పక్కా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఈ దాడులు చేసినట్లు చెప్పారు. వివిధ ప్రాంతాలకు చెందిన యువతులను ఉద్యోగం పేరిట హైదరాబాద్‌కు రప్పించి, ఈ వృత్తిలోకి దింపి వ్యభిచారంలోకి నేడుతున్నట్లు పోలీసులు తెలిపారు. బంజారా హిల్స్, జూబ్లీహిల్స్‌లో మసాజ్ సెంటర్ల పేరుతో ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. ఇలాంటి తప్పుడు వ్యవహారాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు హైదరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.
సిటీలో ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. పేరుకు మస్సాజ్ సెంటర్లు నడుపుతూ వాటి మాటున అక్రమాలకు పాల్పడుతున్నారు. కస్టమర్ వివరాలతో కూడిన రిజిష్టార్‌ను మెయింటైన్ చేయాల్సి ఉండగా దానిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అలాగే స్పా సెంటర్లలో సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేయాల్సి ఉండగా అ పని కూడా చేయడం లేదు. గుట్టు చప్పుడు కాకుండా జనావాసాలు ఎక్కువగా ఉండే అపార్ట్‌మెంట్లను ఎంచుకుని అందులో స్పా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి ఉద్యోగం కోసం వచ్చే అమ్మాయిలను ఈ కూపంలోకి నెడుతున్నారు. దీంతో చేసేది ఏమీ లేక చాలామంది యువతలు ఇందులో నుండి బయటపడలేక పోతున్నారు.