News
News
వీడియోలు ఆటలు
X

Hyderabad News: హైదరబాదీలు జర సోచో - బీపీపీ పరిధిలో ట్రాఫిక్‌ మళ్లింపు, పార్కులు, రెస్టారెంట్ల మూసివేత

Hyderabad News: హైదరాబాద్ బీపీపీ పరిధిలోని పార్కులు, రెస్టారెంట్లను ఈనెల 14వ తేదీన అంటే రేపు మూసివేస్తున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించడమే ఇందుకు కారణం. 

FOLLOW US: 
Share:

Hyderabad News: బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని అన్ని పార్కులు, రెస్టారెంట్లను ఈనెల 14వ తేదీన అంటే రేపే(శుక్రవారం) మూసి వేస్తున్నట్లు హెచ్ఎండీఏ తెలిపింది. నూతన సచివాలయం సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. ఈ క్రమంలోనే ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్కు, ఎన్టీఆర్ ఘాట్, పిట్ స్టాప్, జలవిహార్, సంజీవయ్య పార్కు, అమోఘం రెస్టారెంట్ తదితర సందర్శన స్థలాలను శుక్రవారం మూసి వేస్తున్నట్లు వెల్లడించింది. 

125 అడుగుల అద్భుతమైన అంబేడ్కర్ విగ్రహం

125 అడుగుల కాంస్య ప్రతిమ ఆవిష్కరణ ప్రపంచమే అబ్బుర పడేలా ఉండాలని ప్రభుత్వం భావించింది. ఏర్పాట్లలో ఎలాంటి లోటు రానీయొద్దని ఇప్పటికే గట్టి ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అంబేద్కర్ విగ్రహా ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను ఘనంగా చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీసు శాఖ బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు చేస్తుందని, ఆర్ అండ్ బీ శాఖ లైటింగ్, షామియానా, కుర్చీలు, పూలు ఏర్పాటు చూసుకుంటుందని తెలిపారు. నిరంతర విద్యుత్‌ అందించాలని, ట్రాన్స్‌ ఫార్మర్లను సిద్ధంగా ఉంచాలని విద్యుత్‌ శాఖను కోరారు.

అంబేద్కర్ విగ్రహావిష్కరణ అత్యంత వైభవోపేతంగా

  • హెలికాప్టర్ ద్వారా పూలవర్షం కురిపిస్తూ భారత రాజ్యాంగ నిర్మాతకు పుష్పాంజలి ఘటిస్తారు.
  • గులాబీలు, తెల్లచామంతి, తమలపాకులతో అల్లిన భారీ పూలమాలను రూపొందిస్తున్నారు.
  • 125 అడుగుల విగ్రహానికున్న భారీ పరదాను తొలగించడానికి, నిలువెత్తు పూలమాలను అలంకరించడానికి అతిపెద్ద క్రేన్ ఏర్పాటు చేస్తున్నారు.
  • ఈ కార్యక్రమానికి బౌద్ధ భిక్షువులను మాత్రమే ఆహ్వానించారు. వారి సాంప్రదాయ పద్దతిలోనే కార్యక్రమం జరుగుతుంది.
  • ఈ కార్యక్రమానికి సచివాలయ సిబ్బంది, అధికారులు, అన్ని శాఖల HODలు, జిల్లాకలెక్టర్లు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారు.
  • ప్రతి నియోజకవర్గం నుంచి 300 మంది చొప్పున మొత్తం 119 నియోజకవర్గాల నుంచి 35,700 మంది విగ్రహావిష్కరణ సభకు హాజరు కాబోతున్నారు.
  • ప్రజల తరలింపు కోసం 750 ఆర్టీసీ బస్సులను బుక్ చేశారు.
  • హైదరాబాద్ చేరుకునేలోపే 50 కిలోమీటర్ల దూరంలోనే సభకు వచ్చిన ప్రజలకు భోజనం ఏర్పాట్లు చేశారు.
  • ప్రజల కోసం లక్ష స్వీట్ ప్యాకెట్లు, లక్షన్నర మజ్జిగ ప్యాకెట్లు , లక్షన్నర వాటర్ ప్యాకెట్లు సిద్ధంచేశారు.
  • పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉన్నందున ప్రజలకు ఎండ వేడి తగలకుండా షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు.
  • సభ రోజు సామాన్య ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా ప్రత్యామ్న్యాయ మార్గాలను పోలీస్ యంత్రాంగం సూచిస్తారు.
  • ఘనమైన రీతిలో ఆట పాటలతో సంబురాలతో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. గాయకుడు సాయిచంద్, సాంస్కృతిక సారథి ఛైర్మన్ రసమయి బాలకిషన్ కల్చరల్ ప్రోగ్సామ్స్ రూపొందిస్తున్నారు.
  • అంబేద్కర్‌కు సంబంధించిన పాటలను మాత్రమే పాడుతూ, ఆ మహనీయునికి సాంస్కృతిక నీరాజనం అర్పించాలని సీఎం సూచించారు. ఇందుకు సంబంధించిన రిహార్సల్స్ బాధ్యత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీసుకున్నారు.
  • విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అంబేద్కర్ మునిమనుమడు ప్రకాశ్ అంబేద్కర్ మాత్రమే ముఖ్య అతిథిగా ఆహ్వనించారు.
  • అంబేద్కర్ విగ్రహ రూపశిల్పి మహారాష్ట్రకు చెందిన రామ్ వంజీ సుతార్‌ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘనంగా సత్కరిస్తారు.
  • ఏప్రిల్ 14న మధ్యాహ్నం 2 గంటలకు సభ ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.
  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ప్రారంభోపన్యాసంతో సభ ప్రారంభమౌతుంది. అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రసంగం ఉంటుంది. తర్వాత ముఖ్య అతిథి ప్రకాశ్ అంబేద్కర్ ప్రసంగిస్తారు. ఫైనల్ సందేశం సీఎం కేసీఆర్ ఇస్తారు.
Published at : 13 Apr 2023 09:41 AM (IST) Tags: Hyderabad News BRS KCR Telangana News Ambedkar News

సంబంధిత కథనాలు

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Raghunandan Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు లీగల్ నోటీసులు, రూ.1000 కోట్ల పరువునష్టం దావా

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

గురుకుల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, డైరెక్ట్ లింక్ ఇదే!

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

TSPSC Paper Leak: పేపర్ లీక్ కేసులో సంచలనం, ఎగ్జామ్ లో బ్లూటూత్ వాడిన ముగ్గురు అభ్యర్థుల అరెస్ట్

IIIT Hyderabad: హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్‌, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌‌లో ప్రవేశాలు!

IIIT Hyderabad: హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకూ ఇంజినీరింగ్‌, ట్రిపుల్‌ఐటీ హైదరాబాద్‌‌లో ప్రవేశాలు!

టాప్ స్టోరీస్

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

4 Years Of YSRCP: వైఎస్ జగన్ పాలనకు నాలుగేళ్లు పూర్తి- భారీగా బైక్ ర్యాలీలు, కార్యక్రమాలకు నేతలు శ్రీకారం

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!

'యూత్‌ ను ఎంకరేజ్‌ చేయాలే, ధమ్‌ ధమ్‌ చేయొద్దు'  - జక్కన్న ట్వీట్ వైరల్!

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా

Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా