Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భారీ ట్విస్ట్! ఎక్సైజ్ శాఖకు ఎదురుదెబ్బ
Drugs Case Latest News: ఈ కేసు విచారణకు 2017లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) ఏర్పాటు చేసి విచారణ చేసిన సంగతి తెలిసిందే.
![Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భారీ ట్విస్ట్! ఎక్సైజ్ శాఖకు ఎదురుదెబ్బ Hyderabad Nampalli Court dismissed six out of eight cases today in tollywood drugs case Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసులో భారీ ట్విస్ట్! ఎక్సైజ్ శాఖకు ఎదురుదెబ్బ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/01/557abcd887e76769f5cf765f02cac9d61706788251926234_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Hyderabad Drugs Case: 2017లో టాలీవుడ్‌ను కుదిపేసి, సంచలనం రేపిన డ్రగ్స్ కేసులో తాజాగా కీలక మలుపు జరిగింది. 2017లో నమోదైన ఎనిమిది కేసుల్లో ఆరు కేసులను నాంపల్లి కోర్టు నేడు కొట్టివేసింది. అప్పట్లో ఈ కేసు విచారణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) ఏర్పాటు చేసి విచారణ చేసిన సంగతి తెలిసిందే. అలా ప్రముఖులైన టాలీవుడ్ సెలబ్రిటీలకు డ్రగ్స్ తో సంబంధం ఉందని.. నెలల తరబడి వారిని పిలిచి ఎక్సైజ్ శాఖ విచారణ చేసింది. అలా మొత్తం ఎనిమిది కేసులను ఫైల్ చేసింది. వారి నుంచి గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ ను కూడా సేకరించింది. ఈ శాంపిల్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించింది. ఈ క్రమంలో పూరీ జగన్నాథ్, తరుణ్ శాంపిల్స్‌ను పరిశీలించిన ఎఫ్‌ఎస్‌ఎల్.. వాళ్ల శరీరంలో ఎలాంటి డ్రగ్స్ ఆనవాళ్లు లభించలేదని తేల్చింది. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు, సాక్ష్యాలు చూసి 6 కేసులను నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)