Moinabad Farm House Case: రామచంద్ర భారతికి ఫ్లైట్ టికెట్ కొనిచ్చినట్లు బండి సంజయ్ అనుచరుడిపై ఆరోపణలు
Moinabad Farm House Case: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో సిట్ దూకుడు పెంచింది. రోజుకొకరికి నోటీసులు అందజేస్తూ.. ఈనెల 21వ తేదీన విచారణకు హాజరు కావాలని చెబుతోంది.
Moinabad Farm House Case: మొయినాబాద్ ఫామ్ హౌస్ డీల్ కేసులో సిట్ మరింత దూకుడు పెంచింది. ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులు సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసుకి సంబంధం ఉన్న పలువురికి నోటీసులు జారీ చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షులు బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ కు సిట్ నోటీసులు అందజేసింది. 41 ఏసీఆర్ పీసీ నోటీసులు ఇచ్చారు. ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని శ్రీనివాస్ కు సిట్ ఆదేశించింది. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సిట్ కార్యాలయంలో హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. తాను ఉపయోగించే సెల్ ఫోన్ సైతం వెంట తీసుకొని రావాలని లేఖలో పేర్కొంది. దర్యాప్తును ప్రభావితం చేసే చర్యలకు పాల్పడొద్దని, అలాగే విదేశాలకు వెళ్లకూడదని తెలిపింది.
రామచంద్ర భారతికి ఫ్లైట్ టికెట్ కొనిచ్చినట్లు శ్రీనివాస్ పై ఆరోపణలు..
ఫామ్ హౌస్ కేసులో కీలకంగా ఉన్న రామచంద్ర భారతికి ఫ్లైట్ టికెట్ కొనుగోలు చేసినట్టు శ్రీనివాస్ పై ఆరోపణలు ఉన్నాయి. దీంతో అతనికి నోటీసులు ఇచ్చారు. ఇదే కేసులో కీలకంగా మారిన తుషార్ కు కూడా నోటీసులు అందజేశారు. ఇదే నెలలో 21వ తేదీన విచారణకు హాజరు కావాలని తుషార్ కి కూడా తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి ఫామ్ హౌస్ లో రోహిత్ రెడ్డితో తుషార్ ఫోన్లో మాట్లాడారు. రామచంద్ర భారతి పైలట్ రోహిత్ రెడ్డితో సంభాషణలపై వివరణ ఇవ్వాలని తుషార్ కు సెట్ నోటీసులో పేర్కొంది. రామచంద్ర భారతి ప్రధాన అనుచరుడుగా ప్రస్తుతం కేరళ ఎన్డీఏ కన్వీనర్ గా తుషార్ కొనసాగుతున్నాడు. అటు కేరళలో రెండు బృందాలుగా సిట్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కొచ్చి కులంలో సోదాలు చేస్తున్నారు. నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి సారథ్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. రామచంద్ర భారతి అనుచరుడుగా ఉన్న జగ్గు స్వామి కోసం గాలిస్తున్నారు. జగ్గు స్వామి సిట్ కు దొరికితే మరింత సమాచారం బయటపడే అవకాశం ఉంది.
తుషార్ కు కూడా నోటీసులు..
ఇప్పటికే ఈ కేసులో రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ లను పోలీసులు అరెస్ట్ చేసి విచారణ కూడా చేపట్టారు. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో అక్టోబర్ 20వ తేదీన ఎమ్మెల్యేల ప్రలోభాల కేసులో జరిగినటువంటి డీల్ కి సంబంధించిన దానిప సిట్ అధికారులు చాలా ఫోకస్ చేస్తున్నారు. ఈ కేసులో కీలకంగా మారిన కాల్ డేటా ఆధారంగా పలువురికి నోటీసులు కూడా జారీ చేస్తున్నారు. మరోవైపు నిందితులుగా ఉన్నటువంటి రామచంద్ర భారతి, సింహయాజి, నందకుమార్ ల నివాసాలు, వారి పని చేస్తున్న కార్యాలయాల్లో అధఇకారులు సోదాలు నిర్వహించారు. కేరళలో ఉన్న ఆనందాశ్రమంలో గతంలో రామచంద్ర భారతి, జగదీశ్ స్వామి, తుషార్ ఉన్నట్టు కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు కూడా ఈ ఎమ్మెల్యే వ్యవహారంలో డీలో కుదుర్చునట్టుగా కొన్ని ఆధారాలు ఉన్నట్టు సమాచారం.
జగ్గుస్వామికి నోటీసులు అందజేయనున్నట్లు సమాచారం..
చిత్తూరు జిల్లా మదనపల్లికి సంబంధించిన సింహ యాజీ స్వామి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన పీఠంపై కూడా సిట్ అధికారులు కూపీ లాగుతున్నట్లు సమాచారం. మరోవైపు హైదరాబాదులో ఉన్న నందకుమార్ నివాసంతో పాటు ఫిలింనగర్ లో ఉన్న ఆయన రెస్టారెంట్ ని సోదాలు చేసి కొన్ని ఆధారాలను సేకరించారు. ఈరోజు జగ్గు స్వామికి కూడా నోటీసులు అందజేయనున్నట్లు తాజా సమాచారం. ఈ ముగ్గురు ఈనెల 21వ తేదీన విచారణకు హాజరుకానున్నారు.