KTR On Alluri: తెలంగాణలో అల్లూరి భవన్ త్వరలోనే, మంత్రి కేటీఆర్ వెల్లడి - ట్యాంక్‌బండ్‌పై నివాళులు
Alluri Sitarama Raju: హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
Alluri Sitarama Raju 125 Birth Anniversary In Hyderabad: మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజుని గుర్తు చేసుకోవడం ప్రతి భారత పౌరుడి బాధ్యత అని కేటీఆర్ అన్నారు. వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడే అని కొనియాడారు. ప్రభుత్వం అల్లూరి 125వ జయంతి సందర్భంగా ఆ వేడుకలు అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, వి శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ సహా పలువురు ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు కూడా పాల్గొన్నారు. అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. క్షత్రియ సామాజిక వర్గంలోని పేదల కోసం స్థలం అడిగినందున ప్రభుత్వం మూడు ఎకరాల భూమి కేటాయించిందని కేటీఆర్ తెలిపారు. క్షణం ఆలోచించకుండా మూడు ఎకరాల భూమిని కేసీఆర్ కేటాయించారని అన్నారు. త్వరలోనే అక్కడ భూమి పూజ నిర్వహించాలని కోరారు. అల్లూరి సీతారామరాజు పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఎన్ని ప్రతికూలతలు, కుట్రలు చేసినా రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పని చేస్తూనే ఉన్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. వీరుడు దేశంలో ఎక్కడ పుట్టినా వీరుడేనని అన్నారు.
జల్ - జంగల్ - జమీన్ కోసం కొమరం భీమ్ పోరాడారని గుర్తు చేశారు. అల్లూరి సీతారామ రాజు కూడా బ్రిటిష్ వారిపై పోరాడారని గుర్తు చేశారు. అతి త్వరలోనే అల్లూరి భవన నిర్మాణం పూర్తిచేసుకుని దానికి అల్లూరి పేరు పెట్టడమే సముచితమని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.
Live: Minister @KTRTRS speaking after paying floral tributes to Alluri Sitarama Raju on his birth anniversary in Hyderabad https://t.co/0Ay9mXyG8P
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 4, 2022