By: ABP Desam | Updated at : 16 Dec 2021 12:32 PM (IST)
ప్రతీకాత్మక చిత్రం
హైదరాబాద్‌లో ప్రస్తుతం రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించడంతో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. నగరంలో ఒమిక్రాన్ పాజిటివ్‌గా గుర్తించిన విదేశీయులు నివసిస్తున్న ప్రాంతంలో అలర్ట్ ప్రకటించారు. ఆ కాలనీలు, అపార్ట్‌మెంట్లలో అధికారులు ఆ ఇద్దరితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు ఇప్పటికే మొదలుపెట్టారు. ఒమిక్రాన్ పాజిటివ్ వ్యక్తులకు దగ్గరగా ఉన్నవారి నమూనాలను పరీక్షలకు పంపారు. ఆ ఫలితాలు 24 గంటల్లోపు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. నేడు (డిసెంబరు 16) కూడా వైద్య ఆరోగ్య శాఖ నుంచి ప్రత్యేక టీమ్‌లు రంగంలోకి దిగనున్నాయి. ఆ కాలనీలో మరింత మంది ప్రైమరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి పరీక్షలు చేయనున్నారు.
నిన్ననే (డిసెంబరు 15) టోలిచౌకీలోని పారామౌంట్ కాలనీ మొత్తం యాంటీబాక్టీరియల్ మందును స్ప్రే చేశారు. బాధితులతో దగ్గరగా మెలిగిన వారిని హోం ఐసోలేషన్‌లో ఉండాలని సూచించారు. కెన్యా, సోమాలియా జాతీయతకు చెందిన ఇద్దరు వ్యక్తులకు ఒమిక్రాన్ పాజిటివ్ ఉన్నట్లు బయట పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీరిని ఆరోగ్య శాఖ అధికారులు గచ్చిబౌలి టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ వేరియంట్ అతి వేగంగా విస్తరిస్తున్న దృష్ట్యా బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించడం పెద్ద సవాలుగా మారింది.
టోలిచౌకీలోని పారామౌంట్ కాలనీలో ఎక్కుమ మంది విదేశీయులు నివాసం ఉంటారు. సోమాలియా, కెన్యా, నైజీరియా, ఆఫ్రికా దేశాల నుంచి ఎక్కువ మంది విద్యార్థులు ఇక్కడ అద్దెలకు ఉంటారు. వీరు తరచూ వారి దేశాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అటు, రాజేంద్రనగర్, మహేశ్వరం ప్రాంతాల్లో కూడా చాలా మంది విదేశాల నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. వీరికి విమానాశ్రయంలో పరీక్షల కోసం శాంపిళ్లు తీసుకుంటున్నా.. ఫలితాలు రాకముందే ఇళ్లకు చేరుతున్నారు. తర్వాత ఫలితాలు వచ్చాక పాజిటివ్ అని గుర్తిస్తే వారి ఆచూకీ కనుగొంటున్నారు. ఈలోపు వారు బయట తిరుగుతుండడం, ఎంతో మందిని కలవడం జరుగుతోంది. దీంతో వైరస్ వ్యాప్తి చెందేందుకు అధిక ఆస్కారం ఉంటోంది.
Also Read: Hyderabad Drugs: ఓఆర్ఆర్ వద్ద ఇద్దరు యువకులు, యువతి.. ముగ్గురూ కలిసి కారులో.. అడ్డంగా బుక్
Also Read: Kurnool Onion Market: గిట్టుబాటు ధరలేక ఆగ్రహించిన ఉల్లి రైతు... పెట్రోల్ పోసి ఉల్లిబస్తాలకు నిప్పు
Also Read: YS Sharmila: వరి వద్దన్న ముఖ్యమంత్రి మనకొద్దు.. త్వరలో పాదయాత్ర చేస్తా
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
IB Terror Warning: హైదరాబాద్‌లో ఉగ్రదాడులకు ఛాన్స్! IB వార్నింగ్, ఈ ప్రాంతాల్లో పోలీసులు హైఅలర్ట్
KTR Tweet: నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉందో నీతి ఆయోగ్ లో నీతి కూడా అంతే: కేటీఆర్ సెటైర్లు
Rains in AP Telangana: తీవ్ర వాయుగుండం - నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు, ఎల్లో అలర్ట్ జారీ చేసిన IMD
తెలంగాణ బీజేపీకి మరింత సినీ జోష్- పార్టీలో చేరనున్న జయసుధ!
అనూప్, కళ్యాణ్ మాలిక్, మిక్కీ జే మేయర్‌కు సంగీత దర్శకుడు థమన్ ఛాలెంజ్!
Patriotic Poets of India: అక్షరాలనే ఆయుధాలుగా మార్చి ఆంగ్లేయులపై పోరాడిన రచయితలు వీళ్లే
Rashmika On Dating : విజయ్ దేవరకొండతో డేటింగ్‌పై స్పందించిన రష్మిక
Road Accident: ఒక్కసారిగా టైరు పేలి కారు బోల్తా, నలుగురు మృతి - నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
Swathimuthyam Release Date : దసరా సీజన్ టార్గెట్ చేసిన బెల్లంకొండ