Hyderabad Metro Rail: మెట్రో స్టేషన్‌లో టెన్షన్! ట్రాక్ మీద నడుస్తూ యువకుడు, 3 గంటలు బీభత్సం మామూలుగా లేదు!
Hyderabad Metro Rail News: గుర్తు తెలియని యువకుడు సికింద్రాబాద్ వెస్ట్ - జూబ్లీ బస్ స్టేషన్ మార్గంలో రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించాడు.
Hyderabad Metro Rail News: హైదరాబాద్ మెట్రో రైల్వే రైల్వే స్టేషన్‌లో ఓ యువకుడు నానా బీభత్సం చేశాడు. నిమిషాల వ్యవధిలోనే వేగంగా మెట్రో రైలు పరుగులు తీస్తుండే ట్రాక్‌పై ఓ యువకుడు ఏకంగా దూకేశాడు. గుర్తు తెలియని యువకుడు సికింద్రాబాద్ వెస్ట్ - జూబ్లీ బస్ స్టేషన్ మార్గంలో రైల్వే ట్రాక్‌పై నడుచుకుంటూ వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఈ విషయాన్ని భద్రతా సిబ్బంది వెంటనే గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు అతణ్ని వెనక్కి రప్పించే ప్రయత్నం చేశారు.
దాదాపు గంటపాటు ఒకే ట్రాక్‌పై మెట్రో రైళ్లను నడిపే ప్రయత్నం చేశారు. అనేక ప్రయత్నాల తర్వాత అతి కష్టం మీద అతడిని పట్టుకున్న మెట్రో సిబ్బంది అతణ్ని ముషీరాబాద్ పోలీసులకు అప్పగించారు. ఆ తర్వాత మెట్రో సిబ్బంది యథావిధంగా మెట్రో రైలు సర్వీసులను కొనసాగించారు.
ప్రయాణికుల్ని ఆకట్టుకుంటున్న మెట్రో
ప్రయాణికుల్ని ఆకర్షించడంలో భాగంగా హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ ఇటీవలే మరో అద్భుత ఆఫర్‌తో ముందుకు వచ్చింది. అయితే, ఇది టికెట్ ధరల్లో ఆఫర్ కాదుగానీ, మెట్రో ఎక్కిన ప్రయాణికులకు మాత్రం కావాల్సినంత వినోదాన్ని అందించనుంది. మెట్రో రైలులో ప్రయాణిస్తూ ఉచితంగానే ఓ సినిమా చూసేలా మెట్రో సంస్థ ఏర్పాట్లు చేసింది. మెట్రో రైలులో ప్రయాణించే వారు ఉచితంగానే ఓ సినిమా చూసేలా హైస్పీడ్ ఇంటర్‌నెట్ ను మరింత వేగవంతం చేశారు. కావాలంటే ఆ సినిమాను డౌన్‌లోడ్ కూడా చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. సినిమాలే కాకుండా వారు ఇస్తున్న హై స్పీడ్ ఇంటర్నెట్ సాయంతో వేగవంతమైన బ్రౌజింగ్, ఎంటర్టైన్ మెంట్, షాపింగ్ ఇలా నచ్చినవి చేసుకోవచ్చు.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రోలో షుగర్ బాక్స్ (Sugar Box) అనే సంస్థ ఇంటర్నె్ట్ అందిస్తున్న సంగతి తెలిసిందే. 2019 నుంచి ఈ సంస్థ హైదరాబాద్ మెట్రోలో ప్రస్తుతం అంతరాయం లేని హై స్పీడ్ సేవలను అందుబాటులోకి తెచ్చింది. తాజాగా అమీర్ పేటలోని మెట్రో స్టేషన్‌లో మంగళవారం షుగర్ బాక్స్ సంస్థ తన డిజిటల్ హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ సర్వీసెస్‌ను ప్రవేశ పెట్టింది. ఇందుకుగాను పేటెంటెడ్ క్లౌడ్ ఫ్రాగ్‌మెంట్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నట్లు షుగర్ బాక్స్ సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.
ఫ్రీ ఇంటర్నెట్ సేవలు వాడుకోవాలంటే ఇలా
మెట్రో రైలులో ప్రయాణించేటప్పుడు ఉచితంగా సినిమాలు చూడడం, డౌన్ లోడ్ చేసుకోవడం లేదా ఫ్రీగా ఇంటర్నెట్ వాడుకోవాలనుకునేవారు తప్పనిసరిగా షుగర్ బాక్స్ అనే యాప్‌ను ప్లే స్టోర్‌లో నుంచి డౌన్ చేసుకోవాలని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. షుగర్ బాక్స్ యాప్ ద్వారా అపరిమిత ఇంటర్నెట్‌ను యాక్సె్స్ చేయొచ్చని వెల్లడించారు.
ఇటీవలే ఈ-ఆటోలు అందుబాటులోకి..
హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రయాణించే వారికి రైలు దిగాక లాస్ట్ మైల్ కనెక్టివిటీలో భాగంగా ఈ-ఆటోలను అందుబాటులోకి తెచ్చిన సంగతి తెలిసిందే.మెట్రో రైడ్ అనే సంస్థ మెట్రో స్టేషన్ల నుంచి వివిధ ప్రాంతాలకు ఈ-ఆటోలను నడపనుంది. దీంతో ఇక మెట్రో రైలు దిగగానే గమ్యస్థానానికి చేరుకునేందుకు ప్రయాణికులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండబోదు. మెట్రో దిగగానే ఎలక్ట్రిక్ ఆటోలు ఈ - ఆటోలు సిద్ధంగా ఉంటాయి. ప్రత్యేకించి మెట్రో రైలు స్టేషన్ల నుంచే వివిధ ప్రాంతాలకు ఈ ఆటోలు తిరుగుతాయి.