Hyderabad Water Supply Cut: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం
Hyderabad Drinking Water Supply Disruption (13-11-2025): వివిధ రకాల పనులు జరుగుతున్న వేళ హైదరాబాద్‌లోని పలు డివిజన్‌లకు నీటి సరఫరా నిలిపేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు.

Hyderabad Drinking Water Supply Disruption (13-11-2025): హైదారాబాద్‌లోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండబోదని అధికారులు ప్రకటించారు. నగరానికి శివారులో ున్న కోదండాపూర్‌లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. దీనికి తోడు కృష్ణాఫేజ్-2లో పైపులైన్ లీకేజీలు కారణంగా గురువారం 25కుపైగా ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడవచ్చని ప్రకటించారు. ఈ సూచనతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టాలని, లేదా ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
కోదండాపూర్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాట్‌లో టెక్నికల్ సమస్య వల్ల పవర్ సప్లై అగిపోయింది. దీన్ని అక్కడి సిబ్బంది సరి చేస్తున్నారు. ఇదే టైంలో కృష్ణాఫేజ్ -2లో పైపులు లీకేజీలు గుర్తించారు. 2,375 మి.మి. మెయిన్ పైపులైన్‌లో లీకేజీలు కారణంగా నీరు వృథాగా పోతోంది. దీన్ని సరి చేసేందుకు సప్లై ఆపేశారు. ఈ పనులు ఇవాళ పూర్తి చేయనున్నారు. ఈ రెండు పనులు కారణంగా డివిజన్ 3,5, 7, 8, 9, 10, 11, 14, 18, 19, 20 డివిజన్‌లలో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది.
నీటి సరఫరాకు అంతరాయం కలిగే ప్రాంతాలు ఇవే:- వనస్థలిపురం, ఆటోనగర్, వైశాలి నగర్, నాగోల్, బడంగ్‌పేట్, లెనిన్‌నగర్, ఏఆర్సీఐ, బాలాపూర్ రిజర్వాయర్, బార్కస్, మైసారం, ఎల్లుగుట్ట రిజర్వాయర్, తార్నాక్, బౌద్ధనగర్, లాలాపేట, మారేడ్ పల్లి, ప్రకాష్ నగర్, పాటిగడ్డ, మేకల మండి, మహేంద్రహిల్స్ రిజర్వాయర్, ఎంఈఎస్, రైల్వే కాలనీలు, కంటోన్మెంట్ ప్రాంతాలు, హస్మత్‌పేట, బాలానగర్, ప్రాంతాల్లో నీటి సరఫరాల లేదని తేల్చేశారు.





















