By: ABP Desam | Updated at : 05 Jan 2023 09:54 AM (IST)
Edited By: jyothi
అమ్మాయి కోసం ఆన్ లైన్ లో జల్లెడ పట్టి, సైబర్ నేరగాడి చేతికి చిక్కి!
Hyderabad Crime News: డబ్బులు ఇచ్చి అయినా సరే తానో అమ్మాయితో చాలా సుఖపడాలనుకున్నాడో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. బయట ట్రై చేస్తే తప్పుగా అనుకుంటారని భావించి.. ఆన్ లైన్ అలాంటి అమ్మాయిల కోసం జల్లెడ పట్టాడు. కానీ సుఖపడాలనుకున్న ఆయన కోరిక కష్టపడేలా చేసింది. అమ్మాయికి బదులుగా ఓ సైబర్ నేరగాడి చేతిలో పడిపోయాడు. ఇలా మొత్తం 1.97 లక్షలు పోగొట్టుకున్నాడు.
అసలేం జరిగిందంటే..?
చందానగర్ లో నివాసం ఉండే ఐటీ ఉద్యోగి డిసెంబర్ చివరి వారంలో ఆన్ లైన్ లో కాల్ కోసం(ఎస్కార్ట్ సర్వీస్) వెతికాడు. ఓ వైబ్ సైట్ లో కనిపించిన లింకు క్లిక్ చేయగానే వాట్సాప్ నంబర్ దొరికింది. పటేల్ ఛార్మి వ్యక్తి పేరుతో పరిచయం చేసుకున్న వ్యక్తి వాట్సాప్ ద్వారా కొందరు అమ్మాయిల చిత్రాలు పంపాడు. బుకింగ్ కోసం రూ.510, తర్వాత రూ.5,500, అనంతరం సెక్యూరిటీ డిపాజిట్ కింద రూ.7,800.. ఇలా వేర్వేరు కారణాలు చెబుతూ రూ.1.97 లక్షలు కాజేశాడు. చివరకు మోపోయినట్లు తెలుసుకున్న బాధితుడు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
నాలుగు నెలల క్రితం
సైబర్ నేరాలకు అడ్డు అదుపూ లేకుండా పోతోంది. సామాన్యులు, ఉన్నత విద్యావంతులు, ప్రముఖులనే కాదు.. ఏకంగా నేరాల్ని అదుపు చేయాల్సిన పోలీసులనే వారు వలలో వేసుకుంటున్నారు. ఇందుకు ఉదాహరణే తాజాగా జరిగిన ఓ ఘటన. హైదరాబాద్ చర్లపల్లి ప్రాంతంలోని ఓ పోలీసు ఉన్నతాధికారిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. న్యూడ్ వీడియోల పేరుతో ఏకంగా ఆయన నుంచి రూ.97,500 వరకూ కాజేశారు. చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ దశరథం ఈ సైబర్ మోసాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. చర్లపల్లి జైలు డిప్యూటీ సూపరింటెండెంట్ సీహెచ్ దశరథానికి కొద్ది రోజుల క్రితం అపరిచిత యువతుల నుంచి కాల్ వచ్చింది. తర్వాత వారు చాటింగ్ కూడా చేశారు. అంతే కాకుండా నగ్నంగా వీడియో కాల్స్ మాట్లాడారు. దాన్ని రికార్డు చేసిన మాయగాళ్లు, దాన్ని సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. అయితే, డిప్యూటీ సూపరింటెండెంట్ దాన్ని పట్టించుకోకపోవడంతో సైబర్ నిందితులు మరో పన్నాగానికి తెర లేపారు.
సీబీఐ అధికారి పేరుతో దశరథానికి ఫోన్ చేశారు. అవతలి సైబర్ నిందితుడు అజయ్ కుమార్ పాండే పేరుతో తనను తాను పరిచయం చేసుకున్నాడు. న్యూడ్ వీడియో ఒకటి యూట్యూబ్ లో ఉందని తమకు ఫిర్యాదు అందిందని తనకు డబ్బు చెల్లిస్తే క్రమ శిక్షణా చర్యలు తీసుకోబోమని నమ్మించాడు. అంతటితో ఆగకుండా సీబీఐ పేరుతో ఓ ఫేక్ లెటర్ కూడా పంపాడు. రాహుల్ శర్మ అనే వ్యక్తి నంబరు ఇచ్చి కాల్ చేయాలని సూచించాడు. బాధితుడు అతడికి ఫోన్ చేశాక వీడియోలు డిలీడ్ చేసేందుకు ఏకంగా రెండు సార్లుగా రూ.97,500 సొమ్మును ఆన్ లైన్ ద్వారా ట్రాన్స్ ఫర్ చేశాడు. ఆ తర్వాత తన దగ్గర మరో 2 న్యూడ్ వీడియోలు కూడా ఉన్నాయని చెప్పుకొచ్చాడు. వాటిని వైరల్ చేయకుండా ఉండాలంటే ఇంకో రూ.85 వేలు పంపాలని బెదిరింపులకు గురి చేశాడు. దీంతో డ్యూటీలో ఉండగా తరచూ కంగారుగా కనిపిస్తున్న దశరథాన్ని కొలీగ్ అయిన మరో పోలీసు ఉన్నతాధికారి గమనించి ఆరా తీశారు. ఏమైందని ప్రశ్నించగా, దశరథం జరిగిన విషయం మొత్తం చెప్పారు. ఇది సైబర్ మోసం అని చెప్పి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయమని సలహా ఇవ్వడంతో బాధితుడు కుషాయిగూడ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేశారు. ఈ మోసానికి పాల్పడిన నిందితులు పశ్చిమబెంగాల్ నుంచి మోసం చేసినట్లుగా గుర్తించారు.
Remarks On Pragathi Bavan: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు ఫైర్ - డీజీపీకి ఫిర్యాదు చేసిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
Harish Rao: బీజేపీ ఆ విషయాల్లో డబుల్ సక్సెస్ - అసెంబ్లీలో మంత్రి హరీష్ రావు సెటైర్లు
Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఏ గోరంట్ల బుచ్చిబాబు అరెస్ట్!
Hyderabad Crime News: బర్త్ డే పార్టీలో బాలికపై యువకుల గ్యాంగ్ రేప్- హైదరాబాద్లో మరో దారుణం!
TS High Court: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు: సర్కార్కు మళ్లీ ఎదురుదెబ్బ, హైకోర్టులో మూసుకున్న దారులు! సుప్రీంలో పిటిషన్
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Samantha New Flat : ముంబైలో సమంత ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ - బాబోయ్ అంత రేటా?
No More Penal Interest: అప్పు తీసుకున్నోళ్లకు గుడ్న్యూస్! EMI లేటైతే వడ్డీతో బాదొద్దన్న ఆర్బీఐ - కొత్త సిస్టమ్ తెస్తున్నారు!
PM Modi On Opposition: ఈడీ దెబ్బకు ప్రతిపక్షాలన్నీ ఒక్కటయ్యాయి,ప్రజలే నా రక్షణ కవచం - ప్రధాని మోదీ